Appam, Appam - Telugu

జూన్ 27 – ప్రేమచేత ఆదరణ

“నీ ప్రేమనుబట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను” ‌  (ఫిలేమో.1:7).”

ఫిలేమోను ఎలాగున తన యొక్క ప్రేమచేత అపోస్తులుడైన పౌలునకు  విశేషమైన ఆదరణను, సంతోషమును తీసుకుని వచ్చెను అనుటను  ఫిలేమోనునకు వ్రాసిన పత్రిక వివరించుచున్నది.

అవును, ఒకరు చూపించుచున్న ప్రేమను బట్టి మరొకరు ఆదరణను పొందుచున్నారు. అందరి ప్రేమ కంటెను, క్రీస్తు యొక్క ప్రేమయే అందరికిని ఆదరణను ఓదార్పును కలిగించి ఉత్సాహపరచుచున్నది. అది గయపరచబడిన మనస్సులకు ఆదరణ కలిగించు ఔషధముగా ఉంటున్నది. పలు పరిస్థితుల యందు మీరు ఆదరణ లేక అలమటించిరి. మనస్సు ఆదరణ పొందలేక విలపించు చూనే ఉండును.

అదే విధముగా ఇతరులకు మీరును కొన్ని సందర్భముల యందు ఆదరించుటకు ప్రయత్నించినను  వీలుకాక, తగిన మాటలు లేక తపించిరి. అపోస్తులుడైన పౌలు సెలవిచ్చుచున్నాడు,    “దేవుడే మాకు ఆదరణను కలిగించువాడు”.  దేవుని బిడ్డలారా, ప్రభువు ఒక్కడే మన అందరికిని  ఆదరణ కలిగించువాడు అను సంగతిని మరిచిపోకుడి.

హాగరును చూడుడి.  ఆమె అరణ్యమునందు ఆదరణ లేని స్థితియందు ఒంటరిదై తపించెను. ఆమె యొక్క పిల్లవాడు దాహముచేత చనిపోవలసిన పరిస్థితి. ఆమె చెయ్యి విలువబడినది. యజమానురాళ్ళుచే తోలి వేయబడినది. అబ్రహాము ఆమెను పంపివేయుచునప్పుడు, ఆమెకు ఇచ్చి పంపించినదెల్లా, ఒక తిత్తియందు నీళ్ళును, కొంత ఆహారము మాత్రమే.

తిత్తిలోని నీళ్ళును, ఆహారమును అయిపోయినప్పుడు, ఆమె ఆకలిచేత అలమటించబడెను. అరణ్యమునందు ఆహారమునకై ఆమె ఎక్కడికి వెళ్ళును? పిల్లవాడిని ఎక్కడికి తీసుకుని వెళ్ళును? ఆదరణ లేని స్థితియందు ఎలుగెత్తి ఏడ్చెను.

మన ప్రియ ప్రభువు ఆమెను చేయ్యి విడిచి పెట్టలేదు. హాగరు దాసియెకదా అని నిర్లక్ష్యము చేయలేదు.   “దేవుడు ఆమె కన్నులు  తెరచినందున,  ఆమె ఒక  నీళ్ల  ఊటను  చూచి,  వెళ్లి  ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడైయుండెను”   (ఆది.21:19,20)  అని బైబిలు గ్రంథము చెప్పుచున్నది.

దేవుని బిడ్డలారా, ప్రభువు కేవలము ఆదరణగల మాటలు మాత్రమే చెప్పుచున్నవాడు కాదు. ఆదరణతో పాటు అద్భుతములను చేయుచున్నవాడైయున్నాడు. ప్రభువు మీయొక్క కొదవలన్నిటిని తీర్చి సమృద్ధిని కలుగజేయువాడై యున్నాడు. అద్భుతములను చేసేటువంటి దేవుని యొక్క ప్రేమగల హస్తము మిమ్ములను ఆదరించును. ఆయన మిమ్ములను ఆదరించి,  నీతిగల తన యొక్క దక్షిణ హస్తముచేత మిమ్ములను ఆదుకొనును.

నేటి ధ్యానమునకై: “నా జనులను ఆదరించుడి, ఓదార్చుడి; యెరూషలేముతో ప్రేమగా మాటలాడుడి,  ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యెను అనియు, ఆమె దోషరుణము తీర్చబడెను అనియు, యెహోవా చేతివలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందెనను అనియు సమాచారము  ఆమెకు ప్రకటించుడి”   (యెషయా. 40:2).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.