No products in the cart.
మార్చి 28 – ప్రశ్నలు!
“ఆ దినము నుండి ఎవడును ఆయనను ఒక్క ప్రశ్నయు అడుగ తెగింపలేదు” (మత్తయి. 22:46).
జీవితములో అనేకులు దేవుని ప్రణాళికయందు సణుగుచు ప్రశ్నలను అడుగుచున్నారు. ఎందుకని నాకు ఇలా జరిగెను, ఎందుకని నాకు ఓటమి, ఎందుకని నాకు ఉద్యోగము లేదు, ఎందుకని నా బిడ్డ మరణించెను అనేటువంటి ప్రశ్నలను ముందు పెట్టుచున్నారు.
కొందరి యొక్క జీవితమే ప్రశ్నార్థకముగా ఉన్నది. నా యొక్క భవిష్యత్తు కాలము ఎలా ఉండును అని తమకు తాముగా ప్రశ్నను లేవనెత్తుకొని కలత చెందుచున్నారు. జీవితమునందు గల పలు ప్రశ్నలకు ఈ భూమి మీద జవాబు కనబడకుండును. ప్రభువు యొక్క రాజ్యమునకు వెళ్ళుచున్నప్పుడే మన యొక్క ప్రశ్నలకు జవాబులన్నియును మనము పొందుకొనవచ్చును.
ఎఫ్. ఏ. టెక్స్ అను భక్తుడు బైబిలు గ్రంధమునందు గల ప్రశ్నలన్నిటిని లెక్కించుటకు ప్రారంభించెను. పాత నిబంధనలో 2,272 ప్రశ్నలును, క్రొత్త నిబంధనలో 1,022 ప్రశ్నలును ఉండుటను కనుగొనిన అన్ని ప్రశ్నలను ఆయన తయారుచేసిన టెక్స్ బైబిలు గ్రంథములో వ్రాసి ఉంచియున్నాడు.
ఇందులో సాధారణమైన ప్రశ్నలు కలవు. మనుష్యుడు మనుష్యుని వద్ద లేవనెత్తుచున్న ప్రశ్నలు కలవు. మనుష్యుడు దేవుని వద్ద అడుగు ప్రశ్నలును కలవు. మొట్టమొదటి ప్రశ్న సాతాను మనిష్యుని వద్ద తంత్రముగా లేవనెత్తిన ప్రశ్నయైయున్నది. ప్రభువు మీదనే సందేహపడు విధములో “ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా?” అని తంత్రముగా అడిగెను. నేడు అనేకమంది శోధించునట్లుగా ప్రశ్నలతో వచ్చుచున్నారు. మనము జాగ్రత్తగా ఉండ కుండినట్లయితే అట్టి ప్రశ్నలు మనలను శోధనకు గురిచేసి చివరకు త్రోవ తప్పి పోవునట్లుగా చేయును.
ప్రభువు మనుష్యుని వద్ద అడిగిన మొదటి ప్రశ్న “ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు?” అనుటయె. తనును విడిచి దూరముగా వెళ్లి పోయిన మనుష్యుడ్ని మరలా తన యొక్క ప్రేమ చేత ఆకర్షించునట్లుగా బద్దలైన హృదయముతో నీవు ఎక్కడ ఉన్నావు అని అడిగెను (ఆది.కా. 3:9). నేడును మీరు ఎట్టి స్థితిలో ఉన్నారు, మీ యొక్క ప్రాణము ఎలాగున్నది అని మిమ్ములను చూసి అడుగుచున్నాడు. అట్టి ప్రశ్నయె మిమ్ములను దేవుడ్ని జతపరిచేటువంటి ప్రశ్నగా ఉండవలెను. ఆదియందు ఉన్న ప్రేమకు తిరిగి వచ్చుటకు తీర్మానించుడి.
మనుష్యుడు ప్రభువును చూచి లేవనెత్తుచున్న మొదటి ప్రశ్న ఏమిటి? “నా యొక్క సహోదరునికి నేను కావలివాడనా?” (ఆది.కా. 4:9). తన యొక్క సహోదరున్ని దయా కనికరము లేక చంపివేసి, ప్రభువుని చూచి, సాహసించి నేను నా సహోదరునికి కావలివాడనా అని కయీను అడుగుచున్న ప్రశ్నను చూడుడి. ఇందువలన కయీను పలురకాల శాపములను పొందుకొనెను.
నేడు మీయొక్క అంతరంగమునందు పలు ప్రశ్నలు లేవవచ్చును. ‘ప్రభువా, ఎంతవరకు నన్ను మరచిపోవుదువు’ అని దావీదు రాజు అడుగుచున్నట్లుగా అడగవచ్చును. కొన్ని సమయములయందు మనము చిన్నపిల్లల వలె హక్కుతో పరమ తండ్రి వద్ద ప్రశ్నను అడుగుచున్నాము. అయితే సణుగుకొనకూడదు. దేవుని బిడ్డలారా, నిశ్చయముగానే మీయొక్క ప్రశ్నలకు జవాబు కలదు.
నేటి ధ్యానమునకై: “నేనతనికి ఉత్తరమిచ్చెదను; శ్రమలో నేనతనికి తోడైయుండెదను అతని విడిపించి అతనిని గొప్ప చేసెదను” (కీర్తనలు. 91:15).
