AppamAppam - Telugu

జూలై 04 – షాలేము రాజు!

“మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసికొనివచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు”(ఆది. 14:18)

మెల్కిసేదెకు గూర్చి పైన చెప్పబడిన వచనమునందు వ్రాయబడియున్నది. అబ్రాహాము యొక్క దినములయందు ఆయన షాలేముయొక్క రాజుగాను, సర్వోన్నతుడగు దేవునికి యాజకుడుగాను ఉండెను. రాజుయొక్క అభిషేకము ఆయనపై ఉండెను.

అది మాత్రమే గాక, ఆయన అబ్రాహామును ఆశీర్వదించుటను చూచున్నప్పుడు  ప్రవక్తయొక్క అభిషేకము ఆయనపై ఉండుటను చూడగలము. ఇట్టి మూడు అభిషేకములను ప్రభువు తనయొక్క పిల్లలకు యిచ్చుచున్నాడు. దేవుని బిడ్డలు ఏలుబడిని పొందుకొనవలెనంటే, రాజులయొక్క అభిషేకము అవశ్యము. పొందుకొనిన అభిషేకమునందు నిలచియుండవలెనంటే, యాజకుని అభిషేకమును, ప్రవక్తయొక్క అభిషేకమును అవశ్యము.

మన దేవుడుని మనము అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని పిలుచుచున్నాము. అబ్రాహాము దేవునియొక్క ప్రవక్త, ప్రభువుతానే  అబీమెలెకునివద్ద, అబ్రాహాము ఒక ప్రవక్తయని చెప్పెను. ఇస్సాకు యాజకునికి సాదృశ్యమాయెను. ప్రభువైన యేసు క్రీస్తునకు సాదృశ్యముగా బలిపీఠంపై పరుండపెట్టెను. యాకోబు రాజునకు సాదృశ్యముగా ఉన్నాడు. ఎందుకనగా దేవుడుతానే ఆయనకు దేవునితో పోరాడి గెలిచినవాడు అను అర్థమునిచ్చు ‘ఇశ్రాయేలు’ అని పేరును పెట్టెను.

కొత్త నిబంధనను మూడు విభాగములుగా విభజింపవచ్చును. మొదటిగా, సువార్త గ్రంధములు, రెండవదిగా, అపోస్తులుల కార్యములు, మూడవదిగా, ప్రకటన గ్రంథము. సువార్త గ్రంథములయందు ఏసుక్రీస్తును ప్రవక్తగాను, అపోస్తులుల కార్యములయందు యాజకునిగాను, ప్రకటన గ్రంధమునందు రాజాధిరాజుగాను చూడగలము.

యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము మారనివాడు, నిన్నటి దినమునందు ఆయన ప్రవక్తగా ఉన్నాడు. నేటి దినమునందు ఆయన మనకొరకు విజ్ఞాపనచేయు యాజకునిగా ఉన్నాడు. ఇక రానైయున్న దినములయందు ఆయన నిత్యమును రాజాధిరాజుగా ఉండును.

ప్రకటన గ్రంధమునందు 1: 8 ‘నందు మన ప్రభువును గూర్చి, వర్తమాన, భూత, భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని చెప్పబడియున్నది. భూతకాలమునందు ఉన్నవాడు ప్రవక్త, వర్తమానమునందు ఉంటున్నవాడు యాజకుడు, భవిష్యత్కాలమునందు రానొయున్నవాడు రాజాధిరాజు. అవును, ఆయన ప్రవక్తగాను, యాజకునిగాను, రాజాధిరాజుగాను మూడు విధములైన పరిచర్యను నెరవేర్చుచున్నాడు.

యోహాను 4 :19 ‘నందు, సమరయ స్త్రీ యేసుక్రీస్తును ప్రవక్తగా చూచెను, “అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను”  అని చెప్పెను. హెబ్రీ. 9:11 ‘నందు క్రీస్తు ప్రధానయాజకుడుగా బయలుపరచబడుటను చూడగలము. 1. యోహాను.1:7 ‘నందు మనలను పవిత్రులునుగా చేయువాడుగాను, 1.కొరింథీ.15:25 ‘నందు ఏలుబడి చేయువాడుగాను ఆయనను చూచుచున్నాము. దేవుని బిడ్డలారా, ఆయన మిమ్ములను రాజుగాను, యాజకునిగాను  ప్రవక్తనుగాను అభిషేకము చేయుచున్నాడు అనుటను జ్ఞాపకము ఉంచుకొనవలెను.

 

నేటి ధ్యానమునకై: “యాజకుడు ధర్మశాస్త్రము వినిపించక మానడు, జ్ఞాని యోచనలేకుండ నుండడు, ప్రవక్త వాక్యము చెప్పక మానడు”(యిర్మీయా.18:18).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.