AppamAppam - Telugu

జూలై 02 – అబ్రహాముయొక్క నమ్మకత్వము!

“అబ్రాహామను నా యాజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక; ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు”(ఆది.24:27)

ప్రభువు నమ్మకస్థుడు. తనయొక్క బిడ్డలుకూడా నమ్మకస్థులై ఉండవలెనని కాంక్షించువాడు. ప్రభువు అబ్రాహామునివద్ద ఒక నమ్మకత్వము చూచెను. అది ప్రభువునకు లోబడేటువంటి నమ్మకత్వము. “యెహోవా నీవు లేచి  నీదేశమునుండియు  నీబంధువుల యొద్దనుండియు నీతండ్రి యింటి నుండియు బయలుదేరి, నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము”(ఆది. 12:1) అని ప్రభువు చెప్పినప్పుడు, అబ్రాహాము అలాగునే చేసెను.

అలాగున బయలుదేరి వెళ్ళుట ఆ దినములలో ఎంతటి అపాయకరమైనది! దానికై  అత్యధికమైన నిబ్బరత్వము ఉండవలెను. అయినప్పటికీ, అబ్రాహాము ప్రభువునకు లోబడుటయందు నమ్మకస్థుడైయుండెను.

అబ్రహాముయొక్క జీవితమును గూర్చి చదివిచూడుడి. ఆయనయొక్క నమ్మకత్వము మన హృదయమును ఆశ్చర్యపరుచును. తనయొక్క ఏకైక కుమారుడని చూడక, ప్రభువునకు లోబడి, మోరీయా దేశమునందుగల పర్వతమునందు బలిపీఠముపై బలిగా ఇస్సాకును ఉంచినప్పుడు, ఆ నమ్మకత్వపు ఔనత్యము బయలుపరచబడెను. ప్రభువువలన అబ్రాహాము యొక్క నమ్మకత్వమును మెచ్చుకోకుండా ఉండలేక పోయిన పరిస్థితి.

అబ్రాహాముయొక్క పనివాడైన ఎలియెజెరు చెప్పుచున్న మాటలను గమనించిచూడుడి, “ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు; నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించెను”(ఆది. 24:27).

అబ్రాహాముయొక్క నమ్మకత్వమునందు, ప్రభువు తరతరములకు అబ్రాహాముయొక్క సంతతిని ఏర్పరచుకుని ఆశీర్వదించెను. తన్ను అబ్రహాముయొక్క కుమారుడని పిలిపించుకొని, ప్రభువు అబ్రహామును హెచ్చించెను(మత్తయి. 1:1). నమ్మకస్థులకు ప్రభువు నమ్మకస్థుడుగానే  ఉన్నాడు!

దేవుని బిడ్డలారా, మీరు అబ్రాహామును మీయొక్క మూలపితరునిగా కలిగియున్నారు. అబ్రాహామును విశ్వాసులకుయొక్క తండ్రి అని పిలుచుచున్నారు. అబ్రాహాము యొక్క సంతతికి చెందిన స్వాస్థ్యమంతటిని స్వతంత్రించు కొనుచున్నారు. అలాగైతే, అబ్రాహామునకు కలిగియున్న నమ్మకత్వము మీవద్ద ఉండవలెను కదా?

ప్రభువు ఎన్నడును రెండు తలంపులను, రెండు మార్గములను, వేషధారణను కోరుకొనడు. “ఇదిగో, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు; ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు”(కీర్తన. 51:6)  అనుటయే కీర్తనకారునియొక్క ప్రార్థనగా  ఉండెను. అదియే మీయొక్క ప్రార్ధనగా ఉండునుగాక!

నేటి ధ్యానమునకై: “అతడు నమ్మకమైన మనస్సుగల వాడని యెరిగి, కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, గిర్గాషీయులు, అనువారి దేశమును అతని సంతతివారికిచ్చునట్లు ఆతనితో నిబంధన చేసినవాడవు నీవే, నీవు నీతిమంతుడవై యుండి నీ మాటచొప్పున జరిగించితివి”(నెహెమ్యా 9:8-9).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.