AppamAppam - Telugu

జూన్ 24 – “మంచితీర్మానమును -సమర్పణయు!”

“రాజు భుజించు భోజనమును పానముచేయు ద్రాక్షారసమును పుచ్చుకొని, తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు (హృదయమునందు తీర్మానించెను)ఉద్దేశించి”(దానియేలు 1:8)”

క్రైస్తవ జీవితమునందు, తీర్మానము మరియు సమర్పణయు అనేటువంటిది మిక్కిలి అవశ్యము. దృఢమైన తీర్మానము లేకుండినట్లయితే, పరిశుద్ధ జీవితమును కాపాడుకొనలేము. సమర్పణగల జీవితము లేకుండినట్లయితే, పోరాటపు సమయాలలో మనస్సు చంచలనము చెందును.

నేడు పలు రకాలైన మొక్కుబడులను, తీర్మానములను చూడగలము. నలభై దినములు మాంసమును భుజింపక ఉండుటయు, సిగలో పూలు పెట్టకపోవుటయు, ఉదయమునందు బైబిలు గ్రంథమును చదివి ప్రార్ధించుటయు, కొందరు లెంటు దినములయందు తీర్మానింతురు. అలా తీర్మానించుట మంచిదే, అలా  మ్రొక్కుకొనినదానిని ఎలాగైనను చెల్లించవలెను (ప్రసంగి.5:5).

దినములను లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసరమే లక్ష్యపెట్టుచున్నాడు. అయితే మీయొక్క సమర్పణయు, ప్రతిష్టతయు కొన్ని దినములతోనే ఆగిపోకూడదు. పరిశుద్ధ జీవితమునకు లోతైన ప్రతిష్టత జీవితదినములన్నిటను అధికమించినదై ఉండవలెను.

పాత నిబంధనయందు ఒక సమర్పణగల జీవితమును ప్రభువు ఏర్పరచుకొనునట్లు తన జనులకు ఇచ్చెను. అందులో ఒక సమర్పణగల జీవితము నాజీరువ్రతము (సంఖ్య.6: 1-12) వరకుగల వచనాలలో, నాజీరు వ్రతముయొక్క నిబంధనలు గూర్చి చెప్పబడియున్నది. 1) నాజీరైయుండు వాణి తల వెంట్రుకలు కత్తిరించబడకూడదు. 2) నాజీరైయున్నవాడు ద్రాక్షరసమును, మద్యపానమును త్రాగకూడదు. 3) మృతదేహముచే అపవిత్రపరచబడకూడదు. ఇటీ నాజీరువ్రతము యొక్క ప్రతిష్టత కొద్దిదినములకు చెందినదికాదు, జీవించుదినములన్నిటికీ చెందినది.

క్రొత్త నిబంధనయందు యేసుక్రీస్తు యొక్క సమర్పణగల జీవితము మన యొక్క మనస్సులకు బహు లోతుగా తాకుతున్నది. తాను దానిని సంపూర్ణముగా అధిగమించుటకై తండ్రి చిత్తమునకు తనను సంపూర్ణముగా అర్పించుకొనియుండెను. అందుచేతనే దిగివచ్చితిని అని చెప్పెను(యోహాను.6:38). ఆయన నలభై దినములు ఉపవాసం ఉండినప్పుడు ఆయనకు ఆకలి కలిగెను. అయినను ఆయన రాళ్లను రొట్టెలుగా చేసుకుని, తన ఆకలిని తీర్చుకొనుటకు సాహసించలేదు.

ఆయనను వెనుకంజ వేయించుటకు సాతాను ప్రయత్నించిన తంత్రములన్నియు పరాజయము నొందెను. అవును, ఆయన యొక్క సమర్పణగల జీవితము పరిశుద్ధతగల జీవితముగా ఉండెను. ఆయన పరిశుద్ధుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును (హెబ్రీ. 7:26).

ప్రభువు ప్రతిష్టతను, కట్టుదిట్టాలుగల జీవితమునే నేడు మీయందు కాంక్షించుచున్నాడు. పాత నిబంధనయందు దానియేలు అటువంటి ప్రతిష్ఠతగల జీవితమును చేసినందున, ప్రభువు దానియేలును బహుబలముగా హెచ్చించెను! తనయొక్క నిగూఢమైన సంగతులన్నిటిని దానియేలునకు తెలియపరచెను. దేవుని బిడ్డలారా, మీరును సమర్పణగల జీవితమును జీవించుటకు మిమ్ములను సమర్పించు కొందురుగాక

నేటి ధ్యానమునకై: “బల్యర్పణ చేత నాతో నిబంధన చేసికొనిన నా భక్తులను నాయొద్దకు సమకూర్చుడి”(కీర్తన.50:5)”.

Leave A Comment

Your Comment
All comments are held for moderation.