No products in the cart.
జూన్ 19 – విప్పియున్నావు!
“యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను; నీవు నాకట్లు విప్పియున్నావు” (కీర్తన.116:16)
ప్రభు మీయొక్క బంధకములనుండి మీకు విడుదలను ఇచ్చుచున్నాడు. “చెరలోనున్నవారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు(యెషయా.61:1) బైబిలు గ్రంథము చెప్పుచున్నది.
పదునెనిమిది ఏండ్లుగా సాతానుచే బంధించబడి గూనిగా నున్న స్త్రీ యొక్క కట్లను యేసు విప్పినప్పుడు, ఆమె నిటారుగానిలబడి దేవుని మహిమపరచెను. అవును అది సాతాను యొక్క బంధకము. నేడును అనేకులను సాతాను చేతబడులశక్తులతోను, మాంత్రికశక్తులతోను బంధించి ఉంచియున్నాడు. అయితే కుమారుడు స్వతంత్రులునుగా చేయుచున్నప్పుడు నిజముగా స్వతంత్రులైయుందురు (యోహాను .8:36). అయితే బంధకాలు అనేవి, విప్పలేని బంధకాలు ఏమీలేవు.
కొందరికి వ్యాధులనేటువంటి బంధకము ఉన్నది. వ్యాధులు వారిని బలహీన పరుచుచూనే ఉన్నవి. ప్రభువునకై లేచి ప్రకాశింపలేక పోవుచున్నారు. కారణము ఇది ఒక రకమైన బంధకము. రక్త స్రావముగల స్త్రీ పండ్రెండేలుగా బంధకములో ఉండెను. ఆమె తన ఆస్తినంతటిని వైద్యమునకై ఖర్ఛుపెట్టి చూచెను. ఒక దినమున యేసునియొద్దకు వచ్చినప్పుడు. రెప్పపాటులో ఆమె యొక్క బంధకములన్నియు తెగిపోయెను. దేవుని యొక్క శక్తి ప్రవహించి వెళ్లి ఆమెను స్వస్థపరచెను.
నికొదేమునకు ఒక బంధకము ఉండెను. పారంపర్య ఆచారబద్ధమైన బంధకము. అతడు పరిసయ్యుఢైయున్నందున, విడుదలతో యేసును వెంబడించలేకపోయెను. రాత్రియందు రహస్యముగా ఏఒక్కరికి తెలియకుండా యేసుయొద్దకు వచ్చెను(యోహాను.3:2). నేడును అనేకులు బైబిలు గ్రంథమునందుగల లోతైన సత్యములు ఏమిటని ఎరిగియుండియు, తమ యొక్క సంఘపు కట్టుదిట్టాలవలన ఆత్మతోను, సత్యముతోను ఆరాధించలేక జీవించుచున్నారు.
మరికొందరిని అవిశ్వాసము బంధించి ఉంచియున్నది. ప్రభువు అద్భుతములను చేయకుండునట్లు వారు ఓటమిగల మాటలను, ఆవిశ్వాసపు మాటలను మాట్లాడుతున్నారు. యేసు మరణించిన లాజరును జీవముతో లేపుటకు వెళ్ళెను. అయితే లాజరుయొక్క సహోదరీలకు విశ్వాసములేదు. యేసు లాజరుయొక్క సమాధివద్దకు వచ్చిన తరువాత మార్తా అవిశ్వాసపు మాటలనే మాట్లాడెను.
మార్తా,”అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికీ వాసనకొట్టును”(యోహాను 11:39) అని చెప్పెను. మరియా,”ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండు”(యోహాను.11:32).అని చెప్పెను. అయితే యేసు, లాజరును బయటికి రమ్మని పిలిచినప్పుడు, చనిపోయినవాడు వెలుపలికి వచ్చెను. అయినను అతని కాళ్ళును, చేతులును ప్రేతవస్త్రములతో కట్టబడియుండెను. యేసు వారిని చూచి, అతని కట్లను విప్పుడి అని చెప్పెను(యోహాను.11: 43-44).
దేవుని బిడ్డలారా, కట్లను విప్పుడి అనుటయే ప్రభువు మీకు యిచ్చుచున్న అజ్ఞ.
నేటి ధ్యానమునకై: “సత్యమును గ్రహించెదరు; అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పెను” (యోహను.8:31-32).