AppamAppam - Telugu

జనవరి 11 – క్రొత్త పరుగు!

అయితే ఒకటి చేయుచున్నాను; వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికొరకై వేగిరపడుచు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను”   (ఫిలిప్పీ.3:13,14).

క్రీస్తునందు మీరు నూతన సృష్టిగా ఉన్నప్పుడు మీరు పరిగెత్తుటకై ఒక క్రొత్త పరుగును, దానికంటూ ఒక క్రొత్త బాటను పొందుకొనుచున్నారు. ఆ బాటకు ఒక క్రొత్త  గురి ఉన్నది. కావున మీరు వెనకున్న వాటిని మరచి ముందున్న వాటికొరకై వేగిరపడుచు  ఆ క్రొత్త బాటలో పరుగెత్తవలెను.

లోకస్తులు క్షయమగు కిరీటమును పొందుకొనునట్లు పరుగెత్తెదరు.  ప్రసిద్ధిగాంచిన గ్రీకుల పరుగుపందెమునందు, అందమైన పుష్పాలతోను, చిగురుటాకులతోను అలంకరించబడిన కిరీటమును ప్రథముడిగా వచ్చి గెలుపొందిన వారి తలపై పెట్టి ఆర్బట్టించి కొనియాడెదరు. అయితే మీరు, అక్షయమగు కిరీటమును పొందుకొనుట్లు పరుగెత్తుచున్నారు. మీ పరుగుపందెము యొక్క ముగింపునందు నీతి కిరీటమును, వాడబారని మహిమా కిరీటమును ప్రభువు మీకు దయచేయును.

మనకు ముందుగా, అనేక పరిశుద్ధులు, దేవుడు వారికి నియమించిన పరుగు పందెమునందు పరిగెత్తిరి. తమ యొక్క పరుగును విజయవంతముగా పరుగెత్తి ముగించిన పరిశుద్ధులు నేడను మేఘమువలె గొప్ప సాక్షి సమూహముగా మనలను ఆవరించియున్నారు. మీరు ఎలాగూ పరుగెత్తవలెను? ఈ క్రొత్త పరుగు పందెమునందు రెండు భాగములు కలవు. ఒక భాగము వెనకున్న వాటిని మరువవలెను. మరో భాగము ముందున్న వాటికొరకు వేగిరపడవలెను. అప్పుడే మీయొక్క పరుగు విజయవంతముగా ముగియును.

ఆనాడు లోతుయొక్క కుటుంబము, సొదొమ యొక్క నాశనము నుండి కాపాడుకొనుటకై పర్వతము తట్టునకు పరుగెత్తెను. అయితే లోతుయొక్క భార్య వెనకున్న వాటిని మరువలేదు. అందుచేత ఆమె వెనుకకు తిరిగి చూచినందున ఉప్పు స్తంభముగా మారిపోయెను  (ఆది. 19:26). బైబిలు గ్రంధము సెలవిచ్చుచున్నది,   “కుమారీ, ఆలకించుము ఆలోచించి చెవియొగ్గుము నీ స్వజనమును నీ తండ్రి యింటిని మరువుము, అప్పుడు రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమునందు ఆనందించువాడు”   (కీర్తన.45:10,11).  క్రీస్తు మీయందు సంతోషింప వలనంటే, మీ ఆది తండ్రియగు ఆదాము యొక్క జీవితమును మరిచిపోవుడి.

ఇశ్రాయేలు ప్రజలు కనాను తట్టుకు ప్రయాణము చేసిరి. అయితే వారి యొక్క హృదయము ఐగుప్తునందు గల దోసకాయలను,  వెల్లుల్లిపాయలు మరియు ఉల్లిపాయిలు మొదలగు వాటిని యిచ్చించుచుండెను. ముందున్న వాటికై వేగిరపడనందున వారిలో అనేకులు కనానును స్వతంత్రించుకొన లేకపోయిరి.  మీ ఎదుట పరలోకపు గ్రృహము కలదు, నిత్యానందము కలదు, యేసుక్రీస్తు యొక్క ముఖారవిందపు వెలుగుచే ప్రకాశించుచున్న పరలోకరాజ్యము కలదు.

దేవుని బిడ్డలారా, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటికొరకై వేగిరపడి, పరలోకపు పిలుపు యొక్క పందెపు బహుమానమును పొందుకొనునట్లు పరుగెత్తెదరుగాక!

నేటి ధ్యానమునకై: “పందెపు రంగమందు పరుగెత్తువారందరు పరుగెత్తుదురుగాని; యొక్కడే, బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలె మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి”  (1.కోరింథీ.9:24).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.