Appam, Appam - Telugu

మార్చి 16 – ప్రేమ బలమైనది!

“ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది, దాని జ్వాలలు అగ్నిజ్వాలా సమములు” (ప.గీ. 8:6).

లోకమునందు గల సమస్త ఆయుధముల కంటెను ప్రేమయే బలమైనది. ప్రేమ చేత బలవంతము చేయబడి, తల్లి తన పిల్లల కొరకు ఎట్టి త్యాగమునైనను చేయుటకు సంసిద్ధు రాళ్లైయుండును. ప్రేమ చేత బలవంతము చేయబడి యవ్వన దంపతులు ఒకరికొకరు పట్టు విడిచిపెట్టుచు పలు త్యాగములను చేయుచున్నారు. ఒక మనిష్యుని యొక్క సమస్త గుణాతి శయములయందును ప్రేమయే శ్రేష్టమైనది.

క్రీస్తు యొక్క ప్రేమను మనము ధ్యానించుచున్నప్పుడెళ్లను అది గొప్ప త్యాగపూరితమైన ప్రేమ అను సంగతిని గ్రహించుచున్నాము. ఆయన పరలోకమును విడిచి భూమికి దిగి వచ్చుట ఎంతటి గొప్ప త్యాగము! ఆయన ఎంతగానో త్యాగము చేసి భారమైన శిలువను మన కొరకు మోసెను. ఆయన ఎంతగానో త్యాగము చేసి ఆయన యొక్క చివరి బొట్టు రక్తమును కూడా మన కొరకు చిందించి ఇచ్చెను!

“శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను; గనుక విడువక నీయెడల కృప చూపుచున్నాను” అని ప్రభువు చెప్పుచున్నాడు (యిర్మీయా. 31:3). ఆయన యొక్క ప్రేమ నుండియే ఆయన యొక్క వాత్సల్యత, ఆప్యాయత, దయ, కృప మొదలగునవి అన్నియును బయలు పరచబడుచున్నది. ఆయన యొక్క ప్రేమ నిస్వార్ధమైన ప్రేమ. అంత మాత్రమే కాదు దైవీకమైన ప్రేమ, నిష్కపటమైన ప్రేమ.

రెండవ మహా ప్రపంచ యుద్ధము జరుగుచు ఉన్నప్పుడు, ఇటలీని పరిపాలించిన ముసోలిన్ ఒక గొప్ప నియంతగా ఉండెను. ఆయన యొక్క వీర సాహస కృత్యములచే ఆకర్షింపబడ్డ ఒక యవ్వనచిన్నది ఆయనను ఆమితముగా ప్రేమించి, ఎన్నో త్యాగము చేసి, చివరకు వివాహము చేసుకొనెను.

అయితే, కొన్ని దినములలో దేశమునందు అంతర్కలహములును, పొరుగు దేశాలతో బహాట కలహములును మొదలాయెను. ఒక దినమున ముసోలిన్ యొక్క ఇల్లు ముట్టడి వేయబడెను. ముసోలిన్ను చంపుటకు ఒక హంతకుడు వచ్చినప్పుడు, ఆ చిన్నది అడ్డముగా పోయి ముసోలిన్కు ముందుగా వెళ్లి ఆయనకు అడ్డముగా నిలబడెను. “కావాలంటే నన్ను చంపి వేయుడి, ఆయనను చంపకుడి” అని విలపించెను.

ఆ హంతుకుడు జాలి కనికరము చూపించలేదు. ఆ చిన్న దాని యొక్క ప్రేమను లెక్కచేయలేదు. ఆ హంతకుని యొక్క తుపాకీ లోనుండి బయటకు వచ్చిన తూటా ఆ యవ్వన చిన్నదానిలోనికి చొచ్చుకొనివెల్లి ఆమె ప్రాణాన్ని నిలిపివేసెను. అయితే ఆమె యొక్క ప్రేమను ఎన్నడను నిలిపి వేయలేక పోయెను. ముసోలిన్ను హత్తుకున్నట్టుగానే ఆమె మరణించెను. నేడు కూడాను ఆమె యొక్క త్యాగపూరితమైన ప్రేమను, గొప్ప ఔన్నత్యముతో జ్ఞాపకము చేయబడుచున్నది.

ప్రభువు పాపములో నుండియు, శాపములో నుండియు మిమ్ములను తప్పించుటకును, మీపై రావలసిన శిక్షను తనపై వేసుకొనెను. మీకు ఆశ్రయమును, కేడమునాయెను. మీ పై రావలసిన శిక్షను తనపై వేసుకొనుట ఎంత గొప్ప త్యాగము! దేవుని బిడ్డలారా, ప్రభువు యొక్క ప్రేమ మిమ్ములను కాపాడుచున్న ప్రేమ అను సంగతిని మరచిపోకుడి.

నేటి ధ్యానమునకై: “నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడైయుందును; నీవు నదులలో బడి వెళ్లునప్పుడు అవి నీమీద పొర్లిపారవు; నీవు అగ్ని మధ్యను నడచునప్పుడు కాలిపోవు; జ్వాలలు నిన్ను కాల్చజాలవు” (యెషయా. 43:2).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.