No products in the cart.
మార్చి 11 – దేవుని ప్రేమ
“మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది, ఇట్టి నిరీక్షణ మనలను సిగ్గుపరచదు” (రోమీ. 5:5).
దేవుని యొక్క అతి గొప్ప గుణాతిశయము ప్రేమయైయున్నది. “దేవుడు ప్రేమాస్వరూపి” (1. యోహాను. 4:8). అట్టి ప్రేమ త్యాగపూరితమైన ప్రేమ, కార్యసాధకమైన ప్రేమ, మనసారా ఇచ్చుచున్న ప్రేమ. అట్టి ప్రేమ చేతనే తండ్రియైన దేవుడు తన యొక్క ఏకైక కుమారుని మన కొరకు అనుగ్రహించెను. అట్టి ప్రేమ చేతనే కుమారుడు మన కొరకు తన యొక్క రక్తమును జీవమును ఇచ్చెను.
దైవీక ప్రేమను గ్రీకు భాషలో ‘అగాఫే ప్రేమ’ అని సూచించుచున్నది. దానికి దేనిని ఎదురు చూడని త్యాగపూర్తమైన ప్రేమ అనుట అర్థమునైయున్నది. లోకమునందుగల పలు రకాల ప్రేమల అన్నిటిలోను ప్రభువు యొక్క ప్రేమ మిన్నయైనది. అది మనలను ఆశ్చర్యఛిఖ్సుతులుగా చేయగలిగినది.
దక్షిణ అమెరికాలో నాలుగు కళ్ళ చాప ఒకటి, ఒక తెగకు చెందిన చాప కలదు. ఈ చేప యొక్క ప్రత్యేకమైన సామర్ధ్యత ఏమిటంటే, ఈ చేప వల్లన నీటిమట్టమునకు పైన ఉన్న వస్తువులను నీటిమట్టమునకు కింద ఉన్న వస్తువులను ఒకే సమయములో చూడగలదు. ఆ చేప నీటిలో ఈదుచున్నప్పుడు దాని రెండు కనుల యొక్క క్రింది భాగము నీటి మట్టమునకు క్రింద ఉండును. పై భాగమునందు గల కన్ను భాగము యొక్క లెన్స్కు వ్యత్యాసమైన అమెరిక ఉండును. కావున ఆ చేప పైనను కిందను ఒకే సమయములో చూడగలిగినదై ఉండును.
అదేవిధముగా మీ యొక్క ప్రేమ మొదటిగా పైతట్టున చూచి పరలోకమునందుగల దేవుని వద్ద ఉండవలెను. రెండోవదిగా, భూమియందు గల సహోదర సహోదరీల వద్ద ఉండవలెను. రెండు ప్రాముఖ్యమైన నియమములను ప్రభువు చెప్పెను కదా? ‘నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ప్రాణముతోను, నీ పూర్ణ బలముతోను, నీ పూర్ణ మనస్సుతోను ప్రేమింపవలెను’ అనియు ‘నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను’ అనియు ఆయన సెలవిచ్చియున్నాడు.
క్రైస్తవ మార్గము యొక్క శ్రేష్టత ప్రేమలోనే ఉన్నది. మీరు చూపించుచున్న ప్రేమను చూచి అన్యజనులు ప్రభువు వద్దకు వచ్చుచున్నారు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమ మీ యొక్క హృదయములలో కుమ్మరింపబడుచున్నది. పరిశుద్ధ ఆత్ముడే దేవుని ప్రేమ యొక్క లోతులను మీరు తెలుసుకొనుటకు సహాయము చేయుచున్నాడు. అనవసరమైన, దేశపూరితమైన, కఠినమైన మాటల ద్వారా పరిశుద్ధాత్ముడు దుఃఖపడుచున్నాడు అను సంగతిని తలంచుచున్నారా?
కొందరు ఇతరులను తీసిపడేసి మాట్లాడుదురు. కుల బేధమును చూచి హీనముగా మాట్లాడుదురు. పేదవారిని వెలివేసి మాట్లాడుదురు. అట్టి సమయములయందు దేవుని యొక్క అంతరంగము గాయపరచబడుచున్నది. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “సమస్తవిదములైన ద్వేషమును, కోపమును, మూర్ఖతయు, అల్లరియు, దూషణయు, సకలమైన దుష్టత్వము మీ వద్ద నుండి తొలగించవలెను” (ఎఫెసీ. 4:31).
దేవుని బిడ్డలారా, “ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి” (ఎఫెసీ. 4:32). దేవుని ప్రేమచేత నింపబడుడి.
నేటి ధ్యానమునకై: “మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మనకెట్టి ప్రేమ ననుగ్రహించెనొ చూడుడి” (1. యోహాను. 3:1).
