Appam, Appam - Telugu

సెప్టెంబర్ 22 – “తప్పిపోయిన గొఱ్ఱెలు!”

“ఒక మనుష్యునికి నూరు గొఱ్ఱలుండగా, వాటిలో ఒకటి తప్పిపోయిన యెడల, అతడు మిగితా తొంబదితొమ్మిదింటిని కొండలమీద విడిచివెళ్లి, తప్పిపోయినదానిని వెదకడా?”   (మత్తయి.18:11,12) 

గొఱ్ఱె అనుట ఏ విధము చేతనైనను భద్రత లేని ఒక ప్రాణియైయున్నది. దానికి మాత్రమే ఎంత భయంకరమైన క్రూరమైన శత్రువులు! ఉండినప్పటికిను,  సింహము, ఎలుకబండి, పులి, తోడేళ్లు మొదలగు క్రూర మృగములన్నియు అభివృద్ధి చెందుట కంటేను, గొఱ్ఱెలు పది రెట్లు అత్యధికముగా అభివృద్ధి చెందుచున్నది.

గొఱ్ఱె యొక్క మందగమన స్వభావముచే, పచ్చిక బయలు వెతుకుచు కాపరిని విడిచిపెట్టి దూరముగా వెళ్లిపోవుచున్నది. కొన్ని గొఱ్ఱెలు కనబడకుండా పోవుచున్నది. కొన్ని తప్పిపోవుచున్నది. నేడును మనుష్యుడు పాతాళమును, అగ్నిని గూర్చి చింతింపక,  కంటి దృశ్యాములయందు నడచుచు లోకము యొక్క క్షణికమైన సుఖముల వెంబడి పరుగులెత్తుచున్నాడు. మత్తు పదార్థములకును, మత్తు పానీయములకును బానిసలై  పలు విధములైన ఇచ్చలచే పీడింపబడుచున్నాడు.

బైబులు గ్రంథము సెలవిచ్చుచున్నది,    “మనమందరము గొఱ్ఱలవలె త్రోవ తప్పిపోతివిు, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మన అందరి యొక్క దోషమును ఆయనమీద మోపెను”   (యెషయా. 53:6). ఆయన సిలువలో వేలాడుచున్నప్పుడు, లోకమందుగల సమస్త జనులను తప్పిపోయిన గొఱ్ఱెలు వలె ఆయన యొక్క కనులు చూచెను. యేసు అట్టివారికై జాలిపడెను.

యేసు ఈ లోకమునకు వచ్చుట గల ఉద్దేశము ఏమిటి? బైబులు గ్రంథము సెలవిచ్చుచున్నది,   “నశించినదానిని వెదకి రక్షించుటకే మనుష్యకుమారుడు వచ్చెను”   (లూకా. 19:10). కనబడకుండా పోయిన గొఱ్ఱెలను, తప్పిపోయిన గొఱ్ఱెలను వెతుక్కుంటూ ఆయన వచ్చెను. రక్షింపబడుచున్న వారిని సంఘము నందు ప్రతి దినమును చేర్చుచునే వచ్చెను. ప్రభువు ఇట్టి గొఱ్ఱెలను సమకూర్చి ఏకముగా చేర్చుటకుగల ఉద్దేశమే ఒక మందలోనికి తీసుకొని రావలెను అనుటైయున్నది.

మంచి కాపరి గొఱ్ఱెలను వెదకి వచ్చుచున్నాడు. గొఱ్ఱెల కొరకు బాధ్యతను కలిగియున్నాడు. గొఱ్ఱెల కొరకు తన ప్రాణమునైనను ఇచ్చుటకు అతడు వెనుకంజవేయుడు. ఆదాము పాపము చేసి, చెట్ల చాటున దాగియున్నప్పుడు, ఈ గొఱ్ఱె వద్దు అని ప్రభువు తృణీకరించి వేయలేదు.   ‘ఆదాము ఎక్కడ ఉన్నావు?’  అని కాపరికి మాత్రము కలిగియున్న ఆప్యాయతతోను, వాత్సల్యతతోను, జాలితోను వెదకి వచ్చెను.

నేడును ఆయనను విడిచిపెట్టి వెనకబడిపోయి దూరముగా వెళ్లిపోయిన వారిని కూడా ఆప్యాయతతో వెదకి వెదకి అలయుచున్నాడు. ప్రభువు సెలవిచ్చుచున్నాడు,   “ఎఫ్రాయిమూ, నేనెట్లు  నిన్ను చెయ్యివిడిచి పెట్టుదును? ఇశ్రాయేలూ, నేను నిన్ను ఎట్లు విసర్జింతును? అద్మానువలె నిన్ను నేను ఎట్లు చేతును? సెబోయీమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును? నా మనస్సు నాయందు తల్లడిల్లుచున్నది; సహింపలేకుండ నా యంతరంగమునందు పరితాపములు ఏకముగా పొంగుచున్నది”   (హోషేయా. 11:8).

దేవుని బిడ్డలారా, ప్రభువు యొక్క మందలోనున్న గొఱ్ఱెగా కనబడుచున్నారా? లేక వెనకబడి పోయిన గొఱ్ఱెలుగా  ఉన్నారా? నేడు ప్రభువు ప్రేమతో మిమ్ములను వెదకి వచ్చుచున్నాడు. ఆయన యొక్క కృపలోనికి పరిగెత్తుకొని వచ్చి చేరుడి.

నేటి ధ్యానమునకై: “నా గొఱ్ఱలు నా స్వరము వినును,  నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును”   (యోహాను.10:27).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.