No products in the cart.
మే 02 – వ్యాధులపై జయము!
“నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే” (నిర్గమ. 15:26).
దేవుని యొక్క బిడ్డలు వ్యాధులపై జయము పొందవలనని ప్రభువు ఆశించుచున్నాడు. మన యొక్క శరీరము ప్రభువు వలన రూపించబడినందున, శరీరము యొక్క రోగములను, బలహీనతలను ప్రభువు సిలువలో భరించి తీర్చినందున మనము వ్యాధితో అలమటించవలసిన ఆవశ్యము లేదు. వాగ్దానములను పట్టుకుని జయము పొందుదుము గాక!
‘నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక’ అని చెప్పి మనము ప్రార్ధించుచున్నాము. పరలోకమునందు వ్యాధియు, రోగమును లేదు.
ప్రభువైన యేసు భూమి మీదయున్న దినములయందు వ్యాధులపై జయము పొందినవారై జీవించెను. ఆయన యొక్క సువార్త పరిచర్యను, ప్రార్థన పరిచర్యను, ఉపవాస పరిచర్యను మొదలగునవి వ్యాధిని బట్టి గాని, బలహీనతను బట్టి గాని ఒక్క దినమైనను ఆటంక పరచబడలేదు. వ్యాధులు ఆయనపై జయమును పొందలేదు అనుటయె దాని కారణము. కుష్ఠ రోగిపై అసహ్యించుకొనక తన చేతిని చాచి ముట్టెను. కుష్ఠ రోగము ఆయనను జయించలేదు. యేసు క్రీస్తు మన యొక్క బలహీనతలను, రోగములను తానే భరించి తీర్చుటకు సంకల్పించెను.
ఎందుకని దేవుని యొక్క బిడ్డలకు వ్యాధులు వచ్చుచున్నాయని మీరు ఒకవేళ అడగవచ్చును. వ్యాధి వచ్చుటకు గల ముఖ్య కారణము పాపమైయున్నది. పక్షవాయువు గలవానిని యేసుని వద్దకు తీసుకొని వచ్చినప్పుడు అతనిని స్వస్థపరచుటకు ముందుగా యేసు అతనిని చూచి: ‘కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడియున్నవి’ అని చెప్పెను (మత్తయి. 9:1-6). అదేవిధముగా బేతెస్ద కోనేటి వద్ద ముప్పది యెనిమిది ఏండ్లు వ్యాధిగల యొక మనుష్యుడ్ని స్వస్థపరచున్నప్పుడు ప్రభువైన యేసు అతనిని చూచి: ‘ఇదిగో, నీవు స్వస్థతనొందితివి; మరి యెక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుము’ అని చెప్పెను.
కొన్ని సమయములలో తల్లిదండ్రులు మరియు పితరుల యొక్క పాపము వలనను, శాపము వలన కూడాను వ్యాధులు వచ్చుచుండెను. ఈ సంగతిని అనేకులు నమ్మక ఉండవచ్చును. అయితే, రాజైన దావీదు పాపము చేసెను అనియు, అతని యొక్క పాపము నిమిత్తము దేవుడు అతని యొక్క బిడ్డను మొత్తెను అనియు, ఆ బిడ్డ బహుగా జబ్బుపడి మరణించెను అనియు బైబులు గ్రంథమునందు చూచుచున్నాము (2. సమూ. 12:14,15).
కావున అటువంటి సమయములలో మనము మనలను మనము పరిశీలించి చూచుకొని, “ఇతరులకు వ్యాధి కలుగుటకు నేను కారణముగా ఉన్నానా?” అని పరిశీలించి వాటిని ఒప్పుకోలు చేసి విడిచిపెట్టుట మంచిది. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “మీరు స్వస్థతపొందునట్లు; ….. ఒకనితో నొకడు ఒప్పుకొనుడి, ఒకని కొరకు ఒకడు ప్రార్థనచేయుడి” (యాకోబు. 5:16).
కొంతమంది అత్యాశ వలనను, ధనాపేక్ష వలనను రోగములకు గురి అవ్వుచున్నారు. ఏలిషా యొక్క పనివాడైయున్న గేహాజీని చూడుడి. ధనమును సంపాదించునట్లు నయమాను యొక్క రధము వెనుక పరిగెత్తుకుని వెళ్లి సాహసించి అబద్ధము చెప్పెను. చివరకు అతనికి అతనిక సంతతికిని కుష్ఠ రోగము వచ్చెను. ధనాపేక్ష సమస్త కీడునకు మూలమైయూన్నది అని బైబిలు గ్రంథము మనలను హెచ్చరించలేదా? దేవుని బిడ్డలారా, పాపము మిమ్ములను సమీపించకుండునట్లు కాపాడుకున్నట్లయితే వ్యాధులు మిమ్ములను సమీపించదు.
నేటి ధ్యానమునకై: “ఆయనే మన బలహీనతలను వహించుకొని, మన రోగములను భరించెను” (మత్తయి. 8:17).
