No products in the cart.
మార్చి 29 – యోనానా? యోసేపా?
“నన్నుబట్టియే యీ గొప్ప తుఫాను మీమీదికి వచ్చెనని నాకు తెలిసియున్నది” (యోనా. 1:12).
మీ కుటుంబములో యోనా ఎవరు? ఉప్పెనయు, గొప్ప తుఫానులు, కుటుంబము బద్దలై పోవునేమో అను పరిస్థితి ఎవరు వలన వచ్చుచున్నది? శాపములును, పాపములును మీ కుటుంబమును విచ్ఛిన్నము చేయుటకు కారణము మీరేనా?
ఒక్క యోనా వలన పోరాటము వచ్చెను. ఓడ బద్దలై పోవును అను తలంచునట్లుగా గొప్ప ఉప్పెన సముద్రమునందు కలిగెను. ఓడలో ఉన్న వారందరును భయపడిరి. సరుకులను సముద్రములో ఎత్తి పడవేసిరి. ఓడ నావికుడు కూడాను అల్లాడిపోయెను. ప్రతి ఒక్కరును తమ తమ దేవుని తట్టు చూచి ఒక్కొక్కరు విలపించిరి, మొరపెట్టిరి. అయితే, ప్రభువు యొక్క ఆలోచనను అంగీకరించక తర్షీషునకు పయనించిన యోనా గాఢ నిద్ర చేసేను.
ప్రభువు చూపించిన బాటలో వెళ్లక మనస్సునకు నచ్చిన పోకడలో నడుచుచున్న యోనాగా మీరు ఉన్నారా? లోకము తత్తర పోవుచున్న ఇట్టి దినములయందు, రాకడ సమీపించియున్న ఇట్టి చివరి సమయమునందు, పరిశుద్ధ ఆత్ముడు మనలో క్రియ చేయుటకు ఉబలాటపడుచున్న సమయములో, గాఢ నిద్ర వలన మత్తిల్లి పడియున్న యోనా మీరేనా?
మీ కుటుంబములో వచ్చిన ఉప్పెనలు, కొట్లాటలు శ్రద్దుమనగవలెను అంటే, మీలో కలిగియున్న యోనా యొక్క స్వభావములను తీర్మానముతో మిమ్ములను విడిచి తీసివేయుడి. అది వ్యభిచారపు తలంపైనను, ఇచ్ఛలను పురిగ్లొలుపుచున్న స్వభావమైనను, దొంగిలించు స్వభావమైనను, అవిధేయతయైనను మరి ఏదైనాను ఉండినప్పటికిని క్రీస్తు యొక్క రక్తము అను సముద్రములో ఎత్తి పడవేయుడి. పశ్చాతాపము నొంది, పాపములను విడిచిపెట్టి క్రీస్తుని వద్దకు తిరిగి రండి.
మీయొక్క పాపముల నిమిత్తము ఏమీ ఎరుగని మీ యొక్క కుటుంబము ఎందుకని తత్తర పడవలెను? నూతన సృష్టిగా మారుటకు తీర్మానము చేయుడి. అప్పుడు ఉప్పెన నిమ్మలించి సమాధానము ఏర్పడును. దైవీక ఆశీర్వాదము హెచ్చగును.
ఒక్క యోనా వలన అందరికి ఎంతటి నష్టమో చూడుడి. అదే సమయములో పాత నిబంధనయందు గల యోసేపు యొక్క జీవితమును ధ్యానించి చూడుడి. అతని యొక్క జీవితము ద్వారా అందరికి ఆశీర్వాదము! అతనిని అతని యొక్క సహోదరులు గుంటలో ఎత్తి పడవేసిరి. మిద్యాను దేశపు వ్యాపారులకు అమ్మివేసిరి.
అయితే అతడు ఐగుప్తులో హెచ్చింపబడి తన యొక్క సహోదరులకు ధాన్యమును అందించెను. ఆ తర్వాతి కాలమునందు తండ్రిని తన యొద్దకు రప్పించుకొనెను. తండ్రిని, సహోదర సహోదరీలను, బంధువులను అందరిని ఐగుప్తులో ఉంచి పరామర్శించి పోషించెను. యోసేపు వలన ఎంతటి ఆశీర్వాదమో చూడుడి!
బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “యోసేపు ఫలించెడి కొమ్మ; అతడు నీటి ఊటయొద్ద ఫలించెడి కొమ్మ; దాని రెమ్మలు గోడమీదికి ఎక్కి వ్యాపించును.
విలుకాండ్రు అతని వేధించిరి, అతని మీద వారు బాణములను వేసి, అతని హింసించిరి. అయినను, అతని యొక్క విల్లు దృఢముగా నిలుచును; అతని యొక్క బాహువులు
యాకోబు కొలుచు పరాక్రమశాలియైనవాని హస్తబలమువలన బలమైనదగును; ఇందువలన అతడు ఇశ్రాయేలునకు బండయు మేపెడివాడును ఆయెను” (ఆది.కా. 49:22-24). దేవుని బిడ్డలారా, మీరు యోనానా? లేక యోసేపా?
నేటి ధ్యానమునకై: “ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను” (2. కోరింథీ. 5:17).
