No products in the cart.
మార్చి 21 – అరణ్యములో త్రోవలు!
“ఇదిగో నేనొక నూతనక్రియ చేయుచున్నాను; ….. నేను అరణ్యములో త్రోవను కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులను పారజేయుచున్నాను” (యెషయా. 43:19).
నాకు ఒక మార్గము తెరవపడదా, నాకు ఒక త్రోవ పుట్టదా, నాకు ఒక మేలుకరమైన అంశము జరుగదా, నా కుటుంబమును ప్రభువు గొప్ప ఔన్నత్యముతో హెచ్చింపడా వంటి పలు ప్రశ్నలు మీయందు తలెత్తవచ్చును. అయితే, ప్రభువు యొక్క వాగ్దానము ఏమిటి? నేను అరణ్యములో త్రోవను కలుగజేయుచున్నాను ఎడారిలో నదులను పారజేయుచున్నాను అనుటయైయున్నది.
మనుష్యుడు పలుమార్గములను ముసి వేయవచ్చును, ద్వారములను మోయవచ్చును. ఏరికో ప్రాకారమునందు ఉన్నట్లుగా ఇత్తడి తలుపులును, ఇనుప గడియలును మీకు సవాలు విడవవచ్చును. అట్టి సమయమునందు ప్రభువును తేరి చూడుడి. ఏ స్థలమునందుయితే మార్గము తెరవబడదు అని మీరు తలంచుచున్నారో, ఆ స్థలమునందే ఆయన మార్గమును తెరువచేయును.
ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు, ఎర్ర సముద్రము యొక్క తీరమునకు వచ్చి దానికి పైగా వెళ్ళుటకు త్రోవ లేనందున విభ్రాంతితో నిలిచిపోయిరి. ముందట సముద్రము, వెనకైతే తరుముచు వచ్చుచున్న ఐగుప్తు యొక్క సైన్యము. రెండు వైపుల అతి పెద్ద పర్వతములు. ఐగుప్తుల యొక్క చేతులలో పడి హతమవ్వుటయ లేక ఎర్ర సముద్రమునందు మునిగిపోవుటయ అని తెలియక అంగలాచిరి. ప్రభువు మోషేను చూచి: ‘నీ చేతి కర్రను ఎర్ర సముద్రమునకు తిన్నగా చాపుము’ అని చెప్పెను. మోషే చేతి కర్రను చాపినప్పుడు ఎర్ర సముద్రము రెండు పాయలుగా చీలి త్రోవను కలుగజేసెను.
అదేవిధముగా యోర్ధాను నదీతీరమునకు వచ్చి యోధాను యొక్క నీటి ప్రవాహమును చూచి ఇశ్రాయేలీయులు భయపడిరి. కోత కాలము ముగియు వరకు యోర్దానులో గొప్ప ప్రవాహము ప్రవహిస్తూనే ఉండును. ఎలాగున ఇట్టి గొప్ప నీటి ప్రవాహమును దాటుట, ఎలాగు త్రోవ కలుగును అని భయపడుచున్నవారై నిబంధన మందస పెట్టెను మోసుకొని యాజకులు యోర్ధాను నదిలో కాలు మోపినప్పుడు అది ఆరిన నేలగా వారికి త్రోవను కలుగజేసెను.
ప్రభువు నీ కొరకు త్రోవను తరచుటకు తలంచినప్పుడు ఎవరును దానిని అడ్డగించ లేరు. ఆయన ఇత్తడి తలుపులను విరిచి, ఇనుప గడియలను పగులగొట్టును. ఆయనే ఆటంకములను పడగొట్టువాడు. మనకు ముందుగా వెళ్ళుచున్నవాడు (మీకా. 2:13). ఎవరును మూయజాల కుండునట్లు తెరచువాడు.
షద్రకు, మేషాకు, అబేద్నెగోలను అగ్నికొండములో ఎత్తి పడవేసిరి. అక్కడ కూడాను ప్రభువు త్రోవను కలుగజేయునా? అవును, అట్టి గుంఢమునందు రగులుకొని మండుచున్న అగ్ని జ్వాలల మధ్యలోను ప్రభువే స్వయముగా దిగివచ్చి, సంచరించి వారికి త్రోవను కలుగజేసెను. వారు సంతోషముతో అగ్నిగుంఢములో సంచరించిరి. ప్రభువు అగ్ని యొక్క ఉగ్రతను ఆర్పివేసెను. రాజు యొక్క అంతరంగమునందు మాట్లాడి వారిని ఉన్నత స్థితికి హెచ్చించి తీసుకొని వెళ్లెను.
దేవుని బిడ్డలారా, అరణ్యములో త్రోవలను, ఎడారిలో నదులను కలుగచేయువాడు మన ప్రియ ప్రభువు. మీ యొక్క మార్గములను ఆయన సస్యశ్యామలముగా మార్చును. ఇదిగో నూతన మార్గము కనబడుచున్నది. ప్రభువు నూతన ద్వారములను తరుచుచున్నాడు, ఎవడును దానిని మూయజాలడు.
నేటి ధ్యానమునకై: “అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును. ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటిబుగ్గలు పుట్టును” (యెషయా. 35:6,7)..
