Appam, Appam - Telugu

మార్చి 06 – తీర్మానముచే విజయము

“విజయమొందుటకు న్యాయవిధిని ప్రబలము చేయువరకు, ఈయన నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుచున్న అవిసెనారను ఆర్పడు”    (మత్తయి. 12:20) 

మీరు ఒక బలహీనమైన స్థితియందుగల క్రైస్తవులుగా ఉండవచ్చును. మరల, మరల పడి ఆత్మీయ జీవితమునందు ముందుకు కొనసాగలేని స్థితియందు ఉండవచ్చును. విజయమును పొందవలెను అంటే మీరు తీర్మానించినట్లయితే, ప్రభువు మీ బలహీనతనంతటిని తొలగించి విజయమును దయచేయును. ఆయన    “ఇశ్రాయేలీయులకు (ఆధారమైనవాడు) జయమును బలమైనవాడు”   (1.సమూ. 15:29). మీరు జయమును పొందునట్లు,  మీయొక్క చేతులకును, వ్రేళ్లకును ఆయన పోరాటమును నేర్పువాడైయున్నాడు. దావీదు సెలవిచ్చుచున్నాడు,    “నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడైయున్నాడు”    (కీర్తన. 144:1).

ఒక యవ్వనస్తునికి కుస్తీ యుద్ధము నేర్చుకొనవలెను అని మిగుల ఆశతో ఉండెను. అయితే అట్టి  తార్ఫీదు ఇచ్చువారు ఎవరు ఆయనను చేర్చుకొనలేదు. కారణము, అతనికి పుట్టుకతోనే ఒక చెయ్యి లేదు. కుస్తీ యుద్ధము చేయుటకు రెండు చేతులును మిగుల అవశ్యమైయున్నది. అయినను అతని యందు గల వాంఛను, తీర్మానమును చూచి, ఒక తాఫీదు ఇచ్చు శిక్షణాకారుడు అతనికి కుస్తీ యుద్ధము నేర్పించుటకు ముందుకు వచ్చెను.

ఆయన చెప్పెను,   “మిగతా వారికి నూరు దినములు కొనసాగించి తర్ఫీదును ఇచ్చెదను. అయితే నీకు ఒకే ఒక్క తర్ఫీదును మాత్రమే నేర్పించబోవుచున్నాను. నీవు దానిని మరల మరల నూరు దినములు తర్ఫీదు చేసి నీ యొక్క నాడి నరములయందు బలమును సంపాదించుకొనుము” అని చెప్పెను.

అది ఎట్టి తర్ఫీదు?    “ఎదుటి జట్టువాడు నీ వద్ద కుస్తీ యుద్ధము చేయుటకు వచ్చినప్పుడు, ఏమి చేయలేని వాని వలె నీవు కొంత కొంతసేపు వంగియుండుము. అతడు నిన్ను చులకనగా ఎంచి నీ సమీపమునకు వచ్చుచున్నప్పుడు, నీ పూర్తి బలముతో అతని యొక్క దవడ ఎముకపై ఓకే ఏటితో  గుద్ది  వేయుము. అతని ముఖమునందు వెయ్యి అనుబాంబులు పేలినట్లు అతడు గ్రహించును. ఆ తరువాత అతడు తిరిగి లేవనే లేవడు” అని చెప్పెను.

అలాగునే, తర్ఫీదు ముగించబడిన తర్వాత,  అతి భయంకరమైన కుస్తీ పోటీయందు పాలుపొందెను. తనకు తర్ఫీదు ఇచ్చిన శిక్షణాకారుడు చెప్పినట్లుగానే ఎదుటి జట్టి వాణ్ణి కొట్టి పడగొట్టెను. అతని  యొక్క చేతులయందు అంతటి బలము ఉండగలదని ఎదుటి జట్టివాడు కొంచెము కూడా ఎదురు చూడలేదు. అతని దవడ ఎముకంతయు నుజ్జునుజైపోయెను.

దావీదునుకు విరోధుముగా గోలియాతు వచ్చినప్పుడు, దావీదు గొప్ప గొప్ప యుద్ధాయుధములను ధరించుకొనలేదు. రాజైన సౌలు ఇచ్చిన యుద్ధోపకరణములు కూడా వద్దు అని చెప్పెను. అతనికి ఉండిన దంతయు ఒకే ఒక్క యుద్ధోపకరణము, వడిసలో నుండి బయలుదేరి వెళుతున్న గులకరాయే, ఆ యుధాయుధము.

అరణ్యమునందు దానినే నేర్చుకున్నవాడై అందులో మిగుల నేర్పరి తనము గలవాడైయుండెను.  గోలియతునకు ఆ సంగతి తెలియలేదు. దావీదును అల్పముగా ఎంచి సమీపమునకు వచ్చినప్పుడు, దావీదు భయపడక అతనిని ఎదుర్కొని పరిగెత్తుకొని వెళ్లి, వడిసెతోను, గులకరాయితోను దాడిచేసెను. ఆ నున్నటి గులకరాయి గోలియాతు యొక్క  నొసటిలోనికి అతివేగముగా చొచ్చుకుని వెళ్లగా, గోలియాతు నేలపై బోర్లపడి, పరాజయము పొందెను. దేవుని బిడ్డలారా, మిమ్ములను యుద్ధమునకు నేర్పించువాడు ప్రభువే కదా?  ఆయన యొక్క శత్తువయందును, బలముయందును, శక్తియందును బలము పొందుడి.

 నేటి ధ్యానమునకై: “ఓ మరణమా! నీ విజయమెక్కడ? ఓ మరణమా!  నీ ముల్లెక్కడ?”    (1.కోరింథీ. 15:55).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.