Appam, Appam - Telugu

జూలై 01 – దర్శించువాడు

“నేనైతే నీతిగలవాడనై నీ ముఖదర్శనము చేసెదను”   (కీర్తన. 17:15).”

“నేనైతే” అని చెప్పి దావీదు ఇతరులకంటే తన్ను ప్రత్యేకపరుచుకుని తన యొక్క దృఢమైన నమ్మికను విశ్వాసపు మాటలతో భేరించుచున్నాడు. అవును నీతియందు ప్రభువు యొక్క ముఖమును దర్శించుటయును, ప్రభువు యొక్క పోలికచే తృప్తి చెందుటయే ఆయన యొక్క నqమ్మికయైయుండెను.

భక్తుడైన మోడీగారి దినములయందు ఫ్రెన్నీ గ్రోస్ఫీ అను ఒక తల్లిగారు ఉండెను. వారు సువార్త పాటలను రక్షించుట యందును, సంగీతమును సమకూర్చి పాడుటయందును బహు సామర్థ్యత గలవారై ఉండెను. సుమారు ఆరువేల కంటే ఎక్కువైన చక్కని సువార్త గీతములను ఈ తల్లిగారు సమకూర్చి ఉండెను. ఇందులో బహు గొప్ప ప్రత్యేకత ఏమిటంటే వారికి రవంతైనను కంటి చూపు లేదనుటయే. అంత గొప్ప లోపము ఉండినను వారు మనస్సునందు సొమ్మసిల్లి పోలేదు. పాటల ద్వారాను, సంగీతము ద్వారాను, ఆత్మలను ప్రభువు వద్దకు తీసుకొని రావాలెను అనుట యందు వారు వైరాగ్యతను కలిగినవారై ఉండెను.

ఒక దినమున నేను పరలోకమునకు వెళ్ళుచున్నప్పుడు నా కన్నులు తెరవబడును. మొట్టమొదటిగా నేను చూడబోయేది నా ప్రియమైన యేసు రాజునే. ఇప్పుడు నా యొక్క ఊహించే మనస్సైతే, ఆయన  ముఖము యొక్క ఔనత్యమైన సౌందర్యమును ధ్యానించి ధ్యానించి ఆనందించుచూనే ఉన్నది అని వారు చెప్పిరి.

ఒకసారి భక్తుడైన మోడీ గారు తన యొక్క గొప్ప మహాసభ కూటములయందు వారిని పాడునట్లు ఆహ్వానించినప్పుడు వారు పాడిన పాట ఏమిటో తెలియునా?   “ఈ లోకము యొక్క శ్రమలు మరుగైపోవును; జీవితమునందుగల నరములన్నియు తెగిపోవును. మేల్కొందును నేను దేవుని సముఖమునందు; రాజును ముఖాముఖిగా చూచెదను. ఆయన అంతపురమునందు ఉల్లాసముతో సంచరించెదను; ఆయన కృపను రమ్యముగా పాడి ఆనందించెదను”  అని వారు పాడినప్పుడు, జెనులందరును  కన్నీరు విడిచిరి. దేవుని యొక్క ప్రేమ గల అభిషేకము ఒక్కొక్కరిని నింపెను.

నేను యేసును చూచెదను, ఆయనకు సమమైన మహిమ యందు రూపాంతరము చెందెదను. ఆయన యొక్క పోలికతో తృప్తి చెందెదను, అనుటయే దేవుని బిడ్డలందరి నిరీక్షణగా ఉండవలెను. భూసంబంధమైన జీవితమును ముగించుకొని, మరో తీరమైయున్న మోక్షమునందు ప్రవేశించుచున్నప్పుడు, మహిమా స్వరూపియైయున్న ప్రభువును చూచుట ఎంతటి ఆనందకరమైన ధన్యత!  బైబులు గ్రంథము సెలవిచ్చుచున్నది,   “అలంకరింపబడిన రాజును నీవు కన్నులార చూచెదవు, బహు దూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడును”    (యెషయా. 33:17). అపోస్తులుడైన పౌలు ఆ దినమునకై ఆసక్తితో కాంక్షించుచుండెను.

ఆయన సెలవిచ్చుచున్నాడు,  “ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా  చూచుచున్నాము;  అప్పుడు  ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంతమట్టుకే యెరిగియున్నాను; అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును”   (1.కోరింథీ.13:12). దేవుని బిడ్డలారా మీ యొక్క అంతరంగమునందు ప్రభువును దర్శించెదను అను ఉన్నతమైన అనుభవమును పొందికొనుట యందు మీకు తీక్షణయు, నిరీక్షణయు ఉన్నదా? దేవుని దర్శించు దినమును ఆసక్తితో  కాంక్షించుచున్నారా?

 నేటి ధ్యానమునకై: “ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము, గనుక ఆయనను పోలియుందుమని యెరుగుదుము”   (1.యోహాను.3:2).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.