Appam, Appam - Telugu

జూన్ 20 – చేదునందు ఆదరణ

“ఆమె సర్వశక్తుడు నాకు చాలా చేదును (దుఃఖము) కలుగజేసెను, గనుక నన్ను నయోమి అనక, మారా అనుడి”    (రూతు. 1:20).”

మనస్సునందు గల చేదు అనేది జీవితమును విరక్తి చెందునట్లు చేయును. అట్టి బాధ చేత మనస్సంతయు ముసిని పండంత చేదు మయమగును.

బైబిలు గ్రంధమునందు నయోమికి ఏర్పడిన ఒక  చేదు అనుభవమును  గూర్చి చదువుచున్నాము. ఆమె బెత్లెహేమును విడిచి మోయాబు దేశమునకు వెళ్లెను. అక్కడ ఆమె తనకు ప్రేమగా నున్న భర్తను కోల్పో వలసినదైయుండెను. ఆమె యొక్క ఇద్దరు కుమారులును మరణించిరి. వెధవరాలైన ఆమె, వెధవరాలైన కోడలతో కూడా కలసి అనునిత్యమును చేదును అనుభవించ వలసినదాయెను.

ఆమె ఇశ్రాయేలు దేశమునకు తిరిగి వచ్చినప్పుడు ఒక కోడలు మాత్రమే ఆమెతో కూడా వచ్చేను. ఆమె బంధువులు  ఆమె వద్ద దీనిని గూర్చి విచారించినప్పుడు, ఆమె  మనస్సునందు గల చేదు అనుభవముతో చెప్పెను:   “నేను సమృధ్దిగల దాననై వెళ్లితిని, యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను;  యెహోవా నామీద విరుద్ధముగ సాక్ష్యము పలికెను,  సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పెను”    (రూతు. 1:21).

అదే విధముగా, ఏశావు యొక్క జీవితమును చేదు గలదై యుండెను. అతడు తన యొక్క సహోదరునిచె మోస పోయినందున,  పరాజయపు అనుభవము అతనిని చేదు మయముగా  చేసేను. తండ్రి యొక్క జ్యేష్ఠత్వమును, విశిష్టమైన ఆశీర్వాదములను కోల్పోయినందున, అతని యొక్క చేదు అనుభవము మరీను అత్యధికమాయెను. అతడు బహుగా మనస్సునందు దుఃఖా క్రాంతుడై పెద్ద కేకవేసి,   “ఓ నా తండ్రీ, నన్నును దీవించుమని”   (ఆది.27: 34)  చెప్పెను.  వంచింపబడి నందున వచ్చిన చేదు అనుభవము అది.

ఐగుప్తు యొక్క బానిసత్వము నందును, హింశయందును, అనగద్రొక్క బడుచున్న కఠినమైన పనులయందును ఇశ్రాయేలీయుల యొక్క ప్రాణమే చేదు మయమాయెను (నిర్గమ.1: 14). తాను ప్రేమించుచు వచ్చిన రక్షకుడ్ని నోరారా తుణీకరించి ఒట్టుపెట్టు కున్నందున పేతురు సంతాపపడి ఏడ్చెను. మనస్సాక్షి వాదించుటచేత వచ్చిన చేదు అనుభవము అది  (లూకా.22: 62).

ఇశ్రాయేలు ప్రజలు మారాకు వచ్చినప్పుడు మారా యొక్క నీళ్లు మిగులు చేదైయుండెను. ఆ చేదును తొలగించుటకు, ప్రభువు ఒక  మ్రానును చూపించెను.  ఆ మ్రానును నరికి తీసుకొచ్చి, మారా యొక్క నీటిలో వేసినప్పుడు, ఆ నీళ్లు మధురముగా మారెను.

ఆనాడు తెలియజేయబడక ఉండిన ఆ మ్రాను యేసు క్రీస్తుగా ఉన్నాడు. ఆయన మీ యొక్క జీవితమునందు వచ్చుటకు చోటు ఇవ్వుడి. ఆయన చేదునంతటిని తొలగించి మీకు మధురమును ఆజ్ఞాపించును.

దేవుని బిడ్డలారా, మారా వంటి చేదు మీ జీవితమునందు కొనసాగింపదు;  అది త్వరలో గతించిపోవును. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది,   “తరువాత వారు ఏలీమునకు వచ్చిరి; అక్కడ పండ్రెండు నీటి బుగ్గలును, డెబ్బది యీత చెట్లును ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్లయొద్ద దిగిరి”   (నిర్గమ. 15:27)

 నేటి ధ్యానమునకై: “వారు బాకా లోయలోబడి వెళ్లుచు, దానిని జలమయముగా చేయుదురు; తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును”    (కీర్తన. 84:6).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.