No products in the cart.
మే 05 – జయమునిచ్చు నామము!
“నేనైయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యముల కధిపతియగు యెహోవా పేరట నేను నీమీదికి వచ్చుచున్నాను” (1. సమూ. 17:45)
మీరు జయించునట్లుగా ప్రభువు యొక్క నామము మీకు ధరించబడియున్నది. అందుచేతనే క్రైస్తవుడు అను జయము గల నామమును మీరు ధరించబడియున్నారు. నజరేయుడైన యేసుక్రీస్తుని నామము చేత మీకు ఓటమియె లేదు. వెలుచూపునకు ప్రారంభము ఓటమి వలె కనబడినను, అంతమునందు సంపూర్ణమైన విజయముగా ఉండును.
అందుచేత అపో. పౌలు అట్టి నామము కొరకు ప్రభువునే ఆశ్రయించి: “అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక” (1. కోరింథీ. 15:57) అని చెప్పెను. అట్టి నామము ఎల్లప్పుడును మిమ్ములను జయించినట్లు చేయు నామము. జయము పొందుటకు మరొక్క నామము లేదు. జయించుటయందు యేసు నామమునకు సరిసాటియైనది మరొకటి లేదు.
బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “పరలోకమందు ఉన్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను” (ఫిలిప్పీ. 2:9-11).
లోకము నందుగల ఎట్టి దళాధిపతి యొక్క నామము కంటెను, ఎత్తి సైన్యాధిపతి యొక్క నామము కంటెను, ప్రభువు యొక్క నామము గొప్పది. ఆయన యొక్క నామము బలవంతుడగు ప్రభువు (యెషయా. 9:6). ఆయన సర్వశక్తిమంతుడు (ఆది. కా. 17:1). “నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును” (యోహాను. 14:14) అని ప్రభువు వాక్కును ఇచ్చియున్నాడు.
అందుచేత ప్రభువు వద్ద జయమును అడుగుడి. జముపై జయమును అడుగుడి. యేసు చెప్పెను: “ఇదివరకు మీరేమియు నా పేరట అడుగలేదు; మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకును” (యోహాను. 16:24).
ఒకరి యొక్క పేరుతో వారి యొక్క వ్యక్తత్వము ఏకమైయుండును. ఒకరి యొక్క పేరును చెప్పుచున్నప్పుడే వారి యొక్క స్వభావములు, గుణాతిశయములు, వారు వహించుచున్న పదవి, వారి యొక్క కుటుంబము మొదలగునవి మన యొక్క మనోనేత్రమునకు ముందుగా వచ్చుచున్నాయి. యేసుక్రీస్తు అను నామమును మనము చెప్పుచున్నప్పుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అను గుణాతిశయములు అన్నియును మనకు ముందుగా వచ్చుచున్నాయి. అట్టి జయము గల నామము మీకు ధరించబడియున్నది.
యేసు అంటేనే, రక్షించువాడు అని అర్థము. దుష్టుడైన సాతానును ఆయన జయించినందున, అతని వసము నుండి మిమ్ములను తప్పించి రక్షించుచున్నాడు. ప్రభువు యొక్క నామము అను బలమైన ఆయుధమును తీసుకొనుడి. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు అని ప్రభువు వాక్కును ఇచ్చియున్నాడే. (మార్కు. 16:17). క్రీస్తు యొక్క నామము మీకు ధరించబడియున్నందున మీరు జీవించు దినములన్నిటను ఎవరు మిమ్ములను ఎదిరించి నిలబడరు.
నేటి ధ్యానమునకై: “మాటచేత గాని క్రియచేత గాని, మీరేమి చేసినను ప్రభువైన యేసు పేరట చేయుడి, ఆయన ద్వారా సమస్తమును తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి” (కొలస్సీ. 3:17).
