No products in the cart.
మే 03 – శత్రువులను జయుంచుడి!
“మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు, ఇశ్రాయేలీయులు గెలిచిరి; మోషే తన చెయ్యి దింపినప్పుడు, అమాలేకీయులు గెలిచిరి, మోషే చేతులు బరువెక్కెను” (నిర్గమ. 17:11).
ఆత్మీయ ఇశ్రాయేలీయులైయున్న మనము జయించునట్లుగాను, సాతానును గెలుచునట్టుగాను పిలువబడినవారము. ప్రభువు నేడు మనకు జయమును అనుగ్రహించును.
ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కనానుతట్టున పయనిచ్చినప్పుడు అమాలేకీయులు వారిని ఎదిరించిరి. యెహోషువ ఇశ్రాయేలు ప్రజల కొరకు యుద్ధము చేయునట్లుగా యుద్ధ యోధులను వెంటపెట్టుకొని ముందుకు సాగి వెళ్లెను. అట్టి సమయమునందు మోషే తన చేతిలో దేవుని యొక్క కర్రను తీసుకొని కొండ శికరమునక్కెకి, తన యొక్క చెయ్యిని పరలోకమునకు తిన్నగా ఎత్తెను. మోషే యొక్క చెయ్యి పైకెత్తి నప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యిని దించినప్పుడు అమాలేకీయులు గెలిచిరి.
కొద్దిగా ఆలోచించి చూడుడి, విజయము యొక్క రహస్యము, యుద్ధ యోధుల చేతులో మాత్రము గాక, దేవుని యొక్క సమూఖములో నుండి చేతులను దేవునికి తిన్నగా ఎత్తియున్న మోషే వైపున కూడా ఉండెను. ఒక కుటుంబము యొక్క ఆశీర్వాదము దేవుని సన్నిధిలో నిలువబడి కుటుంబము కొరకు భారముతో ప్రార్థించు వారి యొక్క పక్షమున ఉన్నది. అను సంగతిని మనము ఎన్నడును మర్చిపోకూడదు.
ఆనాడు ఇశ్రాయేలీయులకు అమాలేకియులతో యుద్ధము జరిగినట్లుగా మనకు కూడాను ఒక యుద్ధము కలదు. ఆ యుద్ధము ఆకాశమండలము నందుగల దురాత్మల సైన్య సమూహముతోను, పెత్తందారులతోను, అధికారులతోను మనకు యుద్ధమున్నది (ఎఫెసీ. 6:12).
ఇట్టి యుద్ధమునందు మన కొరకు ప్రార్థించుటతో పాటు, మన యొక్క కుటుంబము కొరకును, శ్రేయోభిలాషుల కొరకును, దైవసేవకుల కొరకును, బంధువుల కొరకును ప్రార్థించువారిగా ఉండవలెను. మన యొక్క చేతులు ఎల్లప్పుడును దేవుని సమూఖములో పైకెత్తబడి, ఒకరికొకరు ప్రార్ధనలో ఆదుకొనువారిగా ఉండవలెను. ఒకరి భారమును ఒకరు భరించి ఇలాగున క్రీస్తు యొక్క నియమమును నెరవేర్చువారు అని అపోస్తులుడైన పౌలు సెలవిచ్చుచున్నాడు (గలతి. 6:5).
మోషే ఎక్కువసేపు చేతులను ఎత్తి పట్టి ఉండినప్పుడు, అతని యొక్క చేతులు అలసిపోయెను. అతడు ఒంటరిగా చాలాసేపు కొనసాగించి చెయ్యని ఎత్తి పట్టుకొని ఉండలేకపోయెను. కావున అహరోనును, హూరును మోషే యొక్క చేతులను ఆదుకొనిరి అని చూచుచున్నాము. ఒకరి భారమును ఒకరు భరించుట మాత్రము కాదు, బలహీనుల యొక్క బలహీనతలను కూడా మనము భరించవలెను.
బైబులు గ్రంథము సెలవిచ్చుచున్నది: “కాగా బలవంతులమైన మనము, మనలను మనమే సంతోషపరచు కొనక, బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమైయున్నాము. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దానియందు అతనిని సంతోషపరచవలెను” (రోమీ. 15:1,2).
దేవుని బిడ్డలారా, మీ యొక్క చేతులు ప్రభునకు తిన్నగా ఎత్తబడి ఉండినప్పుడు, మిమ్ములను ఆదుకొనుటకు పరిశుద్ధ ఆత్మడు కూడాను మీ చెంతన ఉన్నాడు అను సంగతిని మరచిపోకుడి. ఆయన మీయొక్క బలహీన సమయములలో మీకు సహాయము చేయును.
నేటి ధ్యానమునకై: “నీ కుడిచెయ్యి నన్ను ఆదుకొనెను; నీ సాత్వికము నన్ను గొప్పచేసెను” (కీర్తనలు.18:35).
