Appam, Appam - Telugu

జూలై 18 – పరుగెత్తువాడు

“పందెపు రంగమందు పరుగెత్తువారందరు పరుగెత్తుదురు;  గాని యొక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలె మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి”   (1.కోరింథీ.9:24)

ప్రభువు నియమించియున్న పరిశుద్ధ మార్గమునందు పరిశుద్ధతను కాపాడుకొనుచు పరిగెత్తినట్లయితే, నిశ్చయముగానే మీ యొక్క పరుగు జయము పొందును. మంచి పోరాటమును పోరాడి, విశ్వాసమును కాపాడుకొందురు.

ఒక సేవకుడుని గాని లేక విశ్వాసిని గాని, పడద్రోశేటువంటి మూడు గొయ్యలు కలదు. ధనము అధికారము మరియు లైంగీక ఇచ్ఛలు అనునవే ఆ మూడు గొయ్యలు. అపోస్తులుడైన పౌలు యొక్క జీవితమును చూచుచున్నప్పుడు, ఈ మూడు అంశములయందును ఆయన హెచ్చరిక గలవాడుగాను, జాగ్రత్తగా గలవాడుగాను ఉండుటను చూచుచున్నాము. ఆయన తన యొక్క పరిశుద్ధతను కాపాడుకొనెను.

ధనము విషయమునందు ఆయన నమ్మకస్తునిగా ఉండుటవలన, ఆయన ఎఫ్ఫెసు సంఘమునకు వ్రాయిచున్నప్పుడు,   “ఎవని వెండినైనను, బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు; నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవి”    (అపో.కా. 20:33,34)  అని చెప్పెను.  ధనముచేత ఆయన ఎన్నడును తనను మలిన పరుచుకొనలేదు.

అదేవిధముగా ఆయన తన పరిశుద్ధతను కాపాడుకొనెను.   “ఇతరులకు ప్రకటించుచున్న నేనే భ్రష్టుడనై పోదునేమో అని, నా శరీరమును నలగగొట్టి, దానిని లోపరచుకొనుచున్నాను”   (1. కొరింథీ. 9:27)  అని ఆయన చెప్పెను.  తనవద్ద శిక్షణ పొందుకొనిన ఆత్మీయ కుమారుడైన తిమోతిని చూచి  నీవు  యౌవనేచ్ఛలనుండి పారిపొమ్ము (2. తిమోతి.2: 22)  అని చెప్పెను.

అదే విధముగా అధికారము లేక అతిశయము అను గొయ్యిలో ఆయన పడిపోలేదు.  ఎల్లప్పుడు తన్ను తాను తగ్గించుకొని పాపులలో ప్రధాన పాపిని నేను అనియు, దౌర్భాగ్యమైన మనుష్యుడను నేను అనియు చెప్పుచూ తనను సమర్పించుకొనెను. సహజముగా ఆత్మసంబంధమైన సమాజమునందు అతిశయముతోను, అధికారముతోను తమ్మును మలిన పరుచుకొనువారు అనేకులు కలరు. పూర్తి అధికారము ఒకనిని పూర్తిగా మలినపరుచుచున్నది.

ఇతర పాపముల యందు పడిపోయిన పరిశుద్ధుల కంటెను, అతిశయమునందు పడిపోయిన పరిశుద్ధులు అధికమైన వారు. ఇటువంటి శోధనలబారి నుండి అపోస్తుడైన పౌలు తనను కాపాడుకొనుటకు జాగ్రత్తగాలవాడై ఉండెను. విశ్వాసులను చూచి, మీ విశ్వాసమునకు నేను అధికారిని కాను. దానికి తోటి చేతి సహాయకుడనై ఉండుటకు దేవుడు నన్ను కృపతో పిలిచెను అని తన్నుతాను తగ్గించుకొని చెప్పుచున్నాడు

దేవుని బిడ్డలారా, మీ యొక్క జీవితము ప్రార్ధనతోను పరిశుద్ధముగా కాపాడుకొనుడి. మీ యొక్క పాపములను దేవుని వద్ద ఒప్పుకొనుడి. ప్రభువు నిశ్చయముగానే మీ యొక్క పరుగును విజయవంతముగా పరిగెత్తి ముగించుటకు సహాయము చేయును.

 నేటి ధ్యానమునకై: “ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును”   (1.యోహాను. 1:7).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.