Appam, Appam - Telugu

జూలై 06 – ప్రభువు యెదుట నిలబడువాడు

“ఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు”.  (1.రాజులు.17:1).”

ప్రభువు యెదుట నిలబడువాడు అనుటకంటే ఔనత్యముగల మరోక్క పరిచయము లేదు.  ప్రభువు యెదుట నిలబడుటకు అలవాటు గలవాడు రాజులకు ఎదుట నిలబడుటకు భయపడడు. ఏలియా యొక్క జీవితమునందు జరిగిన ఈ సంఘటనను గూర్చి నేను ఆలోచించి చూడగా.

ఏలియా ప్రతి దినమును ఉదయకాలమందు లేచి, అరణ్యమునందు ఒక స్థలమునకు వెళ్లి, దేవాది దేవుని యెదుట నిలబడి, ఆయనను స్తుతించును. రెండు చేతులను ప్రభువు వైపునకు తిన్నగా చాచి,    ‘ప్రభువా నేను నీ యెదుట నిలబడుచున్నాను. నీవు నా యెదుట రాజాది రాజుగాను, ప్రభువుల ప్రభువుగాను నిలబడుచున్నావు. నీవు ఆకాశమును, భూమిని సృష్టించిన సర్వశక్తిగలవాడవైయున్నావు. అధికారమును శక్తియు  నీదైయున్నది’  అని స్తుతించుచూనే యుండియుండును.

ఆ రీతిగా దేవుని సముఖమునందు తరచుగా నిలిచినందున, దేవుని శక్తియు, మహిమయు, మహత్యమును, కృప వరములును ఆయనపై దిగుచూనే ఉండియుండును. అందుచేతనే ఆయన వైరాగ్యముగా ఆహాబు రాజునకు యెదుట రాజనగరమునందు నిలబడి   ‘నా మాట ప్రకారము గాక, యీ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదనియు ఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఆ ఇశ్రాయేలు దేవుడైన  యెహోవాజీవముతోడు సెలవిచ్చుచున్నాను’  అని ప్రకటించ కలిగెను.

“రండి నమస్కారము చేసి సాగిలపడుదము మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము”   (కీర్తన. 95:6) అని కీర్తనకారుడు మనలను ఆసక్తితో ఆహ్వానించుటను చూడుడి. మనము తరచుగా పలు సమస్యలకు గురవుచు, సమాధానమును కోల్పోయి అలమటించుటకు ఇట్టి ఆహ్వానమును మనము అంగీకరించక పోవుటయే కారణము.  దేవుని బిడ్డలారా, మీరు అనుదినమును ఉదయకాలమున ప్రభువు యొక్క సముఖమునకు యెదుట స్తోత్రించుచు నిలబడి నట్లయితే ప్రభువు మిమ్ములను అత్యధికముగా హెచ్చించును. మీరు వైద్యులవద్ద గాని, న్యాయవాదివద్ద గాని చేతులు కట్టుకొని నిలబడేటువంటి పరిస్థితి ఎన్నడును మీకు రాదు.  సైన్యములకు అధిపతియగు యెహోవా ఎదుట నిలబడువాడు అల్పులైన మనుష్యుల ఎదుట ఎన్నడూ నిలబడవలసినది ఉండదు.

తనను గూర్చి చెప్పుకొనుచున్నప్పుడు ఎలిషా కూడా ఇదే మాటలనే సెలవిచ్చుచున్నాడు.    “ఎవని సన్నిధిని నేను నిలువబడి యున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు  సెలవిచ్చుచున్నాను”  అనెను  (2.రాజులు. 3:14). గాబ్రియేలు దేవదూత కూడా తన్ను గూర్చి చెప్పుచున్నప్పుడు నేను దేవుని సముఖమునందు నిలచు గబ్రియేలును అనెను. (లూకా. 1:19). దేవుని సముఖమునందు ఆయన ఎదుట నిలబడువాడను అనుట ఏలియా యొక్క అతిశయము, ఎలిషా యొక్క  మహత్యము, దేవదూత యొక్క అనుభవము. మీరు ఆ రీతిగా చెప్పగలరా?

దేవుని బిడ్డలారా, మీ దేశము మరియు కుటుంబము మొదలగు వాటి యొక్క ఉజ్జీవము కొరకు దేవుని సన్నిధి యందు నిలబడెదరా? దేవుని సముఖమునందు ఏలియా వలె బాధ్యత గలవారై నిలబడుడి. నేటి తరమువారి కొరకు ప్రభువు ఎన్నుకున్న ఏలియా మీరే కదా?

నేటి ధ్యానమునకై: “మనుష్యకుమారుని యెదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు,  ఎల్లప్పుడును ప్రార్థనచేయుచు మెలకువగా ఉండుడి”   (లూకా. 21:36).

  

Leave A Comment

Your Comment
All comments are held for moderation.