No products in the cart.
మార్చి 30 – ప్రతిష్టగల చూపు
“నీ కన్నులెత్తి, నీవు ఉన్నచోటనుండి ఉత్తరపుతట్టు, దక్షిణపుతట్టు, తూర్పుతట్టు, పడమరతట్టును చూడుము” (ఆది.కా. 13:14).
అబ్రహామును ఆశీర్వదించునట్లుగా ప్రభువు రెండు అంశములను ప్రాముఖ్యముగా చెప్పెను. మొదటిది, నీవు ఉన్నచోట నుండి ఉత్తరపుతట్టు, దక్షిణపుతట్టు, తూర్పుతట్టు, పడమరతట్టును తేరి చూడుము అనియు, రెండోవదిగా, నీవు లేచి యీ దేశము యొక్క పొడుగును వెడల్పును ఎంత ఉన్నదో, అంత మట్టుకు దానిలో నడిచి సంచరించుము; అని చెప్పెను.
ప్రభువు చేయవలసిన అంశము ఏమిటి? కనుచూపు మేరయంత భూమిని, కాళ్లు మోపు దేశమును అబ్రహామునకును అతని యొక్క సంతతికిని ఇచ్చుటయైయున్నది. ప్రభువు: “ఎవడును తెలిసికొనలేని మహత్తయిన కార్యములను, లెక్కలేనన్ని అద్భుతక్రియలను ఆయన చేయుచున్నాడు” (యోబు. 9:10). అలాగున ప్రభువు మీకు చేయుటకు మీరు చెయ్యవలసినది ఏమిటి అని ప్రభువు వద్ద అడుగుడి.
ఉదాహరణముగా, ఎర్ర సముద్రమునకు తిన్నగా చేతి కర్రను చాప వలసినది మోషే యొక్క బాధ్యత. ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చీల్చుట ప్రభువు యొక్క బాధ్యత. ఎండిన ఊచ చెయ్యి గల మనుష్యుడు, తన చెయ్యిని విశ్వాసముతో చాప వలసినది అతని యొక్క బాధ్యత. అతని యొక్క చెయ్యిని మరొక్క చేయవలె మార్చవలసినది ప్రభువు యొక్క బాధ్యత. నయమాను యోర్థాను నదిలో ఏడుసార్లు మునగవలసినది అతని యొక్క బాధ్యత. కుష్టి వ్యాధిని తొలగించి, నూతన శరీరమును ఇవ్వవలసినది ప్రభువు యొక్క బాధ్యత. దశమ భాగములను ప్రభువు యొక్క ఆలయమునకు తీసుకొని రావలసినది మన యొక్క బాధ్యత. ఆకాశపు వాకిండ్లను తెరిచి, ఆశీర్వదించవలసినది ప్రభువు యొక్క బాధ్యత.
నేడు కూడాను ప్రభువు మీకు ఏమి చేయవలెనని కోరుచున్నారు? ఆయనను విశ్వాసముతో తేరి చూడుడి. కొందరు ఉదయమునందు లేచినా కూడాను వార్తాపత్రికలనే తేరిచూచుచున్నారు. దేవుని యొక్క వచనములను తేరిచూచుటలేదు.
మీ చుట్టూతా ప్రతిచోట ప్రభువు యొక్క నామము మహిమ పడునట్లుగా మీయొక్క కన్నులను ఎత్తిచూడుడి. మాంసపు కన్నులు వంద అడుగుల వరకు చూడగలిగినది. అయితే, ఆత్మీయ దర్శనపు కన్నులైయితే, లోకమునంతటిని తేరి చూడగలిగినది. కావున, మీ యొక్క దర్శనపు సరిహద్దులను పొడిగించి, ప్రభువు మీకు ఉంచియున్న ఆశీర్వాదములను తేరి చూడుడి.
ఆ తరువాత దర్శనపుకన్నులచే మీరు ఊహించుకొని చూచేటు వంటి స్థలముల తట్టున, విశ్వాసపు పయనమును ప్రారంభించుడి. “కాళ్ళను మోపు ప్రతి దేశమును మీకు సొంతముగా ఇచ్చేదెను” అని ప్రభువు సెలవిచ్చియున్నాడు. లోకమునందు ఎట్టి ప్రభుత్వమును ఇంత గొప్ప బ్రహ్మాండమైన తీర్మానమును ప్రకటించలేదు. కావున మీ యొక్క దర్శనపు సరిహద్దులను పొడిగించి, విశ్వాసముతో నడువసాగుడి.
ప్రభువు అబ్రహాముతో అట్టి మాటలు చెప్పిన వెంటనే, అబ్రహాము చేసిన పని ఏమిటి? అలాగునే లోబడి తన గుడారమును తీసుకొని వెళ్లి హెబ్రోను నందుగల మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షవనము లోదిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను (ఆది.కా. 13:18). అక్కడ ప్రభువును ఆరాధించెను. దేవుని బిడ్డలారా, అబ్రహాము యొక్క వాగ్దానములు మీకు చెందినది. మీరు అబ్రహాము యొక్క పిల్లలుగాను, సంతతిగాను ఉన్నారు.
నేటి ధ్యానమునకై: “అబ్రాహాము బహు కాలము గడిచిన వృద్ధుడైయుండెను. యెహోవా అబ్రాహామును అన్ని విషయములలోను ఆశీర్వదించెను” (ఆది.కా. 24:1).
