No products in the cart.
మార్చి 23 – కావలికాయు ప్రభువు!
“యెహోవా మీ ముందర నడచును; ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును” (యెషయా. 52:12).
ఎంతటి చక్కని వాగ్దానమును ప్రభువు మనకు నేడు ఇచ్చుచున్నాడు! ఆయన మనలను కావలికాయు ప్రభువు. పక్షిరాజు తన రెక్కలను చాపి ఎగురుచు వచ్చి తన పిల్లలను కాయునట్లుగా ఆయన మిమ్ములను కాయను. కోడి తన పిల్లలను తన రెక్కలతో కప్పి తన ఈకలతో కాయునట్లుగా ఆయన మిమ్ములను కాయును.
ఎర్ర సముద్రము యొక్క తీరమున ఇజ్రాయేలు ప్రజలను ప్రభువు ఎలాగున కాచి కాపాడెను అను సంగతిని కొద్దిగా ఆలోచించి చూడుడి. ముందు హోరెత్తున లేచుచున్న అలలు గల గొప్ప ఎర్ర సముద్రము; వెనుక క్రూరమైన వేట కుక్కల వంటి ఐగుప్తుల యొక్క సైన్యము. తప్పించుకొనుటకు త్రోవ ఏమియు లేక, అన్ని వైపులను ఇరికించబడ్డ ఒక పరిస్థితి.
అప్పుడే ప్రభువు మోషేను చూచి ఆయన చేతిలో ఉన్న కర్రను ఎర్రసము తట్టున చాపునట్లుగా చెప్పెను. ఎంతటి ఆశ్చర్యము! ఆ ఎర్ర సముద్రము రెండుగా చీలి త్రోవను ఇచ్చెను. ఇశ్రాయేలు ప్రజలు ఆరిన నేలపై నడుచునట్లుగా సంతోషముగా నడిచి వెళ్ళుటకు ప్రారంభించిరి.
అయితే, వెనుకకు చూచినప్పుడు ఐగుప్తుయ్యుల యొక్క రధములు, గుర్రములు, సేనలు, తమ్మును తరుముచూ వచ్చుచున్న సంగతిని చూచిరి. ఇప్పుడు ఏమి చేయుట? ఇప్పుడు ఇరువైపులను సముద్రము, తప్పించుకుని పోవుటకు చోటు లేదు.
అయితే అట్టి పరిస్థితుల యందును ప్రభువు వారిని కాయుటకు శక్తిగలవాడైయుండెను. అప్పటివరకు ఇశ్రాయేలీయులకు ముందుగా వెళ్లిన దేవదూత ఇప్పుడు వారికి వెనకకు వెళ్లి నడిచెను. ఇంతవరకు ముందు వెళ్లిన మేఘస్తంభము వారికి భద్రతను ఇచ్చుటకై వెనుక భాగమునకు వచ్చెను. అది ఇశ్రాయేలు ప్రజలకు రాత్రిని పగలుగా మార్చెను. అయితే, పరో యొక్క సైన్యమునకు అంధకారమును కమ్మించెను.
ఇశ్రాయేలు ప్రజలను ప్రభువు ముందును వెనకను ఉండి కావలి కాసేను. దేవదూత కూడాను, మేఘస్తంభములును కావలిగా వచ్చిరి. అట్టి ప్రియమైన ప్రభువు నేడును మారలేదు. ఆయన మీ యొక్క తండ్రి కదా! మీరు ఆయన యొక్క పిల్లలు కదా! మిమ్ములను కూడాను ఆరీతిగా కాయును.
ఎంతటి దుష్టులైన మనుష్యులు మీకు విరోధముగా లేచినను కలవరపడకుడి. ఎంతమంది మీ యొక్క కుటుంబమును నాశనము చేయవలెనని కుతంత్రము పన్నినను సోమ్మసిల్లిపోకుడి. తండ్రి తన యొక్క పిల్లలను కాయునట్లుగా ప్రభువు మిమ్ములను కాయును. తల్లి ఆదరించునట్లుగా ఆయన మిమ్ములను ఆదరించును.
సమస్యలును, పోరాటములును వచ్చుచున్నప్పుడల్లను 121 ‘వ కీర్తననం తీసి ప్రార్థనతో చదువుడి. అందులో ఎంతటి చక్కని వాగ్దానములను ప్రభువు మనకు ఇచ్చియున్నాడు!
కీర్తనకారుడు సెలవిచ్చుచున్నాడు, “యెహోవాయే నిన్ను కాపాడువాడు; నీ కుడిప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బయైనను, నీకు తగులదు. రాత్రి వెన్నెల దెబ్బయైనను, నీకు తగులదు. ఏ అపాయమును రాకుండ యెహోవా నిన్ను కాపాడును; ఆయన నీ ప్రాణమును కాపాడును” (కీర్తనలు. 121:5-7). దేవుని బిడ్డలారా, ఇట్టి వాగ్దానములను విశ్వాసముతో స్వతంత్రించుకొనుడి.
నేటి ధ్యానమునకై: “దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునైయున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు” (కీర్తనలు. 46:1).
