AppamAppam - Telugu

జూలై 07 – రాజుయొక్క ముఖము!

“ఆ స్త్రీ ఏలీయాతో; నీవు దైవజనుడవై యున్నావనియు, నీవు పలుకుచున్న యెహోవామాట నిజమనియు ఇందుచేత నేనెరుగుదుననెను”(1.రాజులు.17:24)

కొందరు తమ్మును గూర్చి తామే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు. కొందరి గూర్చి ఇతరులు సాక్ష్యము చెప్పుచున్నారు. అయితే కొందరిని గూర్చి  ప్రభువే  స్వయముగా సాక్ష్యము ఇచ్చుచున్నాడు. ఏలియాయొక్క యథార్థతను గూర్చి ఇతరులు సాక్ష్యము ఇచ్చుచున్నారు. ప్రభువుకూడా సాక్ష్యమిచ్చెను. “నీవు దైవజనుడవై  యున్నావు” అనుట ఆమెయొక్క మొదటి సాక్ష్యము. “నీ నోటినుండి పలుకుచున్న యెహోవామాట నిజమని” అనుట తరువాతి సాక్ష్యము.

మిమ్ములను గూర్చి ఇతరులు ఏమని సాక్ష్యమిచ్చుచున్నారు? మీరు రెండు కన్నులతో ఇతరులను చూచుచున్నారు. అయితే ఇతరులు వేలకొలది కన్నులతో మిమ్ములను చూచుచున్నారు. అలాగునే మిమ్ములను చూచునప్పుడు మీరు దైవజనునిగా కనబడుచున్నారు? మీ నోటనుండి వచ్చుచున్న మాటలు ప్రభువుయొక్క మాటలనియు, అవి యధార్థమైన మాటలనియు సాక్ష్యము ఇచ్చుచున్నారా?

ఏలియాయొక్క యధార్ధత ఏమిటి? ఆయన దైవజనుడు అనుటయే, దేవుని ఎదుట నిలబడుచున్నవాడు అనుటయే ఆ యధార్ధత. ఏలియా మనవంటి శ్రమానుభవముగలవాడే. అయితే ఆయన దేవునిని వెంబడించునప్పుడు ప్రతి అంశమునందును యధార్ధముగా ఉండుటకు తీర్మానించెను. ప్రతి దినమున తెల్లవారుజామునే దేవుని సముఖమునందు ప్రభువు ఎదుట నిలుచుట ప్రారంభించెను.

ఆయన మొదటిసారిగా ఆహాబు ఎదుట చెప్పుచున్న మాటలను గమనించి చూడుడి. “ఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవాజీవముతోడు;… ప్రకటించుచున్నాను” అని చెప్పెను(1.రాజులు. 17:1). “ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా యెదుట నిలబడియన్న నేను”.  అదే ఏలీయాయొక్క పరిచయము. అదే  ఏలీయాయొక్క ఔనత్యము.  అదే ఏలియాయొక్క బలమునకుగల రహస్యము. అదే ఏలియాయొక్క యధార్ధత!

దేవుని ఎదుట ప్రతిదినము ఏలియా నిలబడుటచేత రాజైన ఆహాబు యెదుట నిలబడుటకు భయపడలేదు. “నేను ఆకాశమును మూసివేయిచున్నాను. నా మాట ప్రకారముగాక, వర్షము పడదు”  అని దిట్టముగా ప్రకటించు విశ్వాసము ఆయన దేవుని ఎదుట యధార్ధముగా నిలుచుటకుగల ప్రతిఫలముగా కలిగెను. మీరు అనుదినమును ఉదయముననే ప్రభువు యొక్క సన్నిధిలో స్తోత్రముతో నిలబడినట్లయితే, ప్రభువు మిమ్ములను అత్యధికముగా హెచ్చించును. మీరు వైద్యుల యెదుటగాని, న్యాయవాదుల యెదుటగాని చేతులు కట్టుకొని నిలుచుటగాని, నిలబడుటగాని ఎన్నడును అట్టిస్థితి రానేరాదు.

ఎలీషా కూడా అటువంటి మాటలే తన్ను గూర్చి చెప్పుచున్నాడు, “ఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవాజీవముతోడు;… ప్రకటించుచున్నాను”అని చెప్పెను(2.రాజులు. 3:14). గాబ్రియేలు దూత తన్నుగూర్చి చెప్పుచున్నప్పుడు,  ‘నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును'(లూకా.1:19)  అని అతిశయోక్తిగా చెప్పుచున్నాడు. దేవుని బిడ్డలారా, ఏలియాయొక్క యధార్ధత అదే,  ఎలీషాయొక్క విజయమునకు కారణము అదే, గాబ్రియేలుయొక్క అతిశయోక్తి అదే, మీరు కూడా ప్రభువు యెదుట బహు నమ్మకమైన యధార్ధతతో నిలబడెదరా?

 

నేటి ధ్యానమునకై: “నామాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నది; నా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును”(యోబు.33:3).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.