AppamAppam - Telugu

జూలై 07 – రాజుయొక్క ముఖము!

“అబ్షాలోము, రెండు నిండు సంవత్సరములు యెరూషలేములోనుండియు, రాజదర్శనము చేయక(రాజుయొక్క ముఖమును చూడక ) యుండగా”(2.సమూ. 14:28)”

దావీదును, దావీదుయొక్క కుమారుడైన అబ్షాలోము యెరుషలేములోనే కాపురముఉండిరి. అయితే ఆ అబ్షాలోము రెండు నిండు సంవత్సరములుగా రాజుయొక్క ముఖమును దర్శింపకయే ఉండెను అని బైబిలు గ్రంథము చెప్పుచున్నది. ఇది ఎంతటి వేదనకరమైన అంశము!

ఒకవేళ మీరు సంఘమనే యెరూషలేము లోనే కాపురము ఉండవచ్చును. విశ్వాసులతో ఆరాధనయందు కలుసుకొనకను, బైబిలు గ్రంథము చదువుచున్నాను, ప్రార్థన చేయుచున్నాను అని చెప్పవచ్చును. అయితే మిమ్ములను చూచి ఒక ప్రశ్న అడుగుటకు కోరుచున్నాను. మీరు రాజుయొక్క ముఖమును దర్శించుచున్నారా? రాజాధిరాజు యొక్క కన్నులను నీ కనులు చూచెనా? ఆయన మీతో మాట్లాడెనా?

నేడు విశ్వాసులు అని పేరును కలిగియున్నవారు బహువిస్తారమైనవారు ఉన్నారు. అయితే, వాస్తవమునందు వారికి, ప్రభువునకును ఎట్టి సంబంధము లేకుండా ఉన్నది. ఆయనతో కూడా వ్యక్తిగతమైన ఐక్యతను పెట్టుకొనక, విధిచొప్పున ఆలయమునకు వచ్చుచున్నారు. యెరూషలేము అనుట మహారాజు యొక్క నగరము. అది దేవునిచే ఏర్పరచుకొనబడిన స్థలము. అక్కడ మహిమగల ఆలయము ఉన్నది. ఆలయమునందు పరిచర్యను చేయుచున్న లేవియులును, యాజకులను కలరు. అన్నిటికంటే పైగా రాజు అక్కడ పాలించుచున్నాడు.

మరొక్క భాగమును మీకు సూచించి చూపించాలని కోరుచున్నాను. దావీదు యొక్క కుమారుడు అని పిలువబడుచున్నవాడు యేసుక్రీస్తు. అయితే యేసు ఎల్లప్పుడును తండ్రి యొక్క ముఖమును దర్శించుచూనే ఉండెను. ఉదయముననే అరణ్యప్రాంతమునకు వెళ్లి తండ్రియొక్క ముఖమును దర్శించును. రాత్రియందు గెత్సమనే తోటకు వెళ్లి తండ్రియొక్క ముఖమును దర్శించును. సిలువలో కొట్టబడినప్పుడు రెప్పపాటున తండ్రియైన దేవుడు తన యొక్క ముఖమును మరుగు చేసుకొనినందున క్రీస్తువలన భరించుకొనలేక పోయెను. “నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడితివి?” (కీర్తన.22:1) అని చెప్పి విలపించెను.

ఒక క్రైస్తవుని యొక్క నిజమైన ఔన్నత్యము ఏమిటి? దేవుని దర్శించుటయే. దేవుని దర్శించినందున్న మోషేయొక్క ముఖము సూర్యునివలె ప్రకాశించెను. ప్రభువు మీకును తనయొక్క ముఖమును ప్రకాశింపజేయును బైబిలు గ్రంథము చెప్పుచున్నది, “హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు” (మత్తయి.5:8).

అబ్షాలోము, రాజుయొక్క ముఖమును చూడక ఉండుటకుగల కారణము ఏమిటి? అబ్షాలోముయొక్క పాపమే. ఆ సంగతి అతనియొక్క మనస్సాక్షిని పొడిచెను. రాజుయొక్క సన్నిధికి ఎలాగు వచ్ఛుట అని తెలియకుండా రెండు నిండు సంవత్సరములు రాజును దర్శింపకుండానే యెరురూషలేమునందు కాపురముండెను.

దేవుని బిడ్డలారా, మీరు దేవుని యొక్క ముఖమును దర్శించి ఆయనతో సన్నిహితముగా ఐక్యతనుకలిగి ఉండుటకు మీ పాపములన్నిటిని ఒప్పుకొనుడి. యేసుక్రీస్తుని రక్తము మిమ్ములను పవిత్రులునుగా చేయుటకు శక్తికలిగినది. పాపమును మీ నుండి తొలగించినప్పుడు ప్రభువుయొక్క ముఖమును మీరు దర్శించెదురు. అడ్డుగోడను తొలగించిన్నప్పుడు దేవునియొక్క వెలుగు మీపై ఉదయించును.

నేటి ధ్యానమునకై: “ఇదిగో, రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు; విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు”(యెషయా. 59:1).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.