situs toto musimtogel toto slot musimtogel link musimtogel daftar musimtogel masuk musimtogel login musimtogel toto
AppamAppam - Telugu

జూన్ 30 – ఆశీర్వాదము పొందుదువు!

“నీవు ఆశీర్వాదము పొందుదువు గాక; నీవు ఘనకార్యములను పూనుకొని; విజయము నొందుదువుగాక”(1.సమూ.26:25)

బైబిలు గ్రంధమునందుగల ఈ చక్కటి వచనమునందు, ఒకదానితో ఒకటిగా వాగ్దానములు ఏకమైయున్నవి. “నీవు ఆశీర్వాదము పొందుదువు గాక; నీవు ఘనకార్యములను పూనుకొని; విజయము నొందుదువుగాక” అని బైబిలు గ్రంథము చెప్పుట ఎంతటి ఆనందకరమైనది!

ఈ ఆశీర్వాదము యొక్క కారణము ఏమిటి అనుటను, దీనికిగల ముఖాంతరము ఏమిటి అనుటను, మీరు ఆలోచించి చూచినట్లయితే, ఈ ఆశీర్వాదములను మీరును స్వతంత్రించు  కొనవచ్చును. దావీదును తరుముతూ వెంటాడునట్లు రాజైన సౌలు బహు తీవ్రతను కలిగియుండెను. అలాగున ఒక అడవి ప్రాంతమునకు వచ్చినప్పుడు, సౌలు అలసిపోయి రథము ప్రక్కనే నిద్రించెను. దావీదును అతని సైన్యాధిపతియగు అభిషైను దానిని చూచెను.

అభిషై దావీదును చూచి, ‘దేవుడు ఈ దినమున నీ శత్రువును నీయొక్క చేతులకు అప్పగించెను. ఒక్క పోటీతో సౌలును పొడిచెదను’ అని చెప్పినప్పుడు, అందుకు దావీదు ఏమి చెప్పెనో తెలుసా?  “నీవతని చంపకూడదు, యెహోవాచేత అభిషేకము నొందినవానిని చంపి నిర్దోషియగుట యెవనికి సాధ్యము?”(1.సమూ.26:9) అని చెప్పి సౌలు యొక్క ఈటెను, నీళ్లబుడ్డిని తీసుకొని పోయిరి. ఎవడు వారిని చూడలేదు, జరిగినదానిని గుర్తుపట్టినవాడొక్కడునులేడు, వారిలో ఎవడును నిద్రమేలుకొనలేదు.

ప్రభువు తనను దావీదు చేతులకు అప్పగించినను, దావీదు తనను చంపక తప్పించిన అట్టి చర్య సౌలుయొక్క హృదయమును బద్దలుచేసెను. అందుచేతనే సౌలు దావీదును చూచి, “నేను పాపము చేసితిని, ఈ దినమున నాప్రాణము నీ దృష్టికి ప్రియముగా నుండినదానిబట్టి నేను నీకిక కీడుచేయను; దావీదా నాయనా, నాయొద్దకు తిరిగిరమ్ము; వెఱ్ఱి వాడనై నేను బహు తప్పు చేసితి”(1.సమూ.26:21) అని  చెప్పెను.

అది మాత్రమే కాదు, సౌలు, మనస్సునందు ఉల్లసించి “దావీదా నాయనా (నా కుమారుడా),నీవు ఆశీర్వాదము పొందుదువు గాక; నీవు ఘనకార్యములను పూనుకొని; విజయము నొందుదువుగాక” అని చెప్పి ఆశీర్వదించెను. దేవుని బిడ్డలారా, ప్రభువు ఇదే మాటలను చెప్పి మిమ్ములను ఆశీర్వదించవలనంటే, అభిషేకింపబడిన వారిపై చేతులు వేయకుడి. వారికి విరోధముగా మాట్లాడుటయు, వ్రాయుటయు చేయకుడి. ఎందుకనగా, అభిషేకింపబడినవారు ప్రభువునకు బహు శ్రేష్టులు.

దేవుని బిడ్డలారా, భక్షించువారి యొద్దనుండి భక్షనను, బలవంతులయొద్దనుండి ఉదారత్వమును తెచ్చుచున్నవాడు,  మనయొక్క ప్రభువు. కీడుచేయుచున్న హస్తములను కూడా మీకు సహాయము చేయు హస్తముగా మార్చును. ఈ లోకముగుండా ఒకేఒక్కసారి సాగిపోవుచున్నారు. ఎవరివద్దను ఎట్టి విరోధమైనను సంపాదించుకొనకుడి. మీరు ఎదిరించి నిలబడవలసిన ఒకేఒక్క శత్రువు సాతాను మాత్రమే. మీయొక్క యుద్ధము వానితో మాత్రమే ఉండునుగాక.

 

నేటి ధ్యానమునకై: “ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు, ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును”(సామెత.16:7).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.