AppamAppam - Telugu

జూన్ 25 – పిలుపును చూడుడి!

“సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి; మీలో శరీరరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశమువారైనను అనేకులు పిలువబడలేదు గాని; జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొని యున్నాడు”(1.కొరింథీ.1:26,28)

ప్రభువు ఎంత ప్రేమతో మిమ్ములను ఏర్పరచుకొనియున్నాడు అనుటను, మీపై ఆయన ఎంతటి కృపను కనబరెచెను అనుటను, ఎంతటి ఔనత్యముతో పిలిచెను అనుటను తలంచి చూడుడి. మీయొక్క ఔన్నత్యమంతయు ప్రభువు మీతో కూడ ఉండుటయే. యేసు క్రీస్తు మీతో కూడా ఉండుటచేతనే, మీరు అతిగొప్ప కార్యములు చేయగలరు. ప్రభువు మీతో కూడా ఉన్నప్పుడు, మీకంటే జ్ఞానులు ఎవరుంటారు? మీకంటే బలవంతులు ఎవరుంటారు? మీకంటే శక్తిగలవారు ఎవరుంటారు? బైబిలు గ్రంథము చెప్పుచున్నది,”దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయెను”(1.కొరింథీ.1:31).

ప్రభువు మోషేను ఏర్పర్చుకొనిన్నప్పుడు, తనయొక్క చేతకానితనమును  ప్రభువుయొద్ద వివరించి, “నేను మాటనేర్పరిని కాను,  నేను నోటి మాంద్యమును, నాలుక మాంద్యమును గలవాడను” అని చెప్పెను. అయితే ప్రభువు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరినీ నలభై సంవత్సరములు అరణ్యమునందు నడిపించుటకు శక్తిమంతుడైయుండెను.

ప్రభువు యిర్మీయా ప్రవక్తను పిలిచినప్పుడు,  యిర్మీయా తన్ను తగ్గించుకుని చెప్పిన సంగతి ఏమిటో తెలుసా? ” అయ్యో  ప్రభువగు యెహోవా, చిత్తగించుము మాటలాడుటకు నాకు శక్తి చాలదు; నేను బాలుడనే” అని చెప్పెను. అయినను ప్రభువు, తన మాటలను  యిర్మీయా నోటికి అందించి, ప్రవక్తగాచేసి బహుబలముగా  వాడుకొనెను.

ప్రభువు చాపలు పట్టుచున్న, విద్యజ్ఞానము లేకున్న పేతురును పిలిచినప్పుడు, ‘ ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడను’ అని చెప్పెను. అయినను ప్రభువు, పేతురును శిష్యునిగాచేసి, ఆత్మసంబంధమైన వరములను ఇచ్చి గొప్ప అపోస్తులునిగా చేసెను. మెథడిస్ట్ సంఘములను స్థాపించిన జాన్వెస్లీ బహు పొట్టివాడై అందరిచేత హేళనముచేయబడిన స్థితియందు ఉండినవాడైయుండెను. అయితే ప్రభువు, ఆయనను అగ్నిజ్వాలగాను బహుబలముగాను వాడుకొనెను.

ప్రపంచమునే కదిలించివేసిన డి.ఎల్ మూడీ అను భక్తుడు విద్య లేని పామరుడైయుండెను. ఆయన మాట్లాడుతున్న ఆంగ్లభాషను అనేకులు గేలిచేసేటివారు. అయినప్పటికీ ఆయన యొక్క పరిచర్య ద్వారా ఆశీర్వదింపబడిన వారు లక్షలకొలదిగా ఉన్నారు. నేడును క్రైస్తవ  చరిత్రయందు ఆయనకుంటు ఒక ప్రత్యేక స్థానము ఉన్నది.

దేవుని బిడ్డలారా, దేవునిచే పిలువబడిన గొప్ప పరిశుద్ధులకు శరీరమునందు లోపములు ఉండినట్లుగా, మీకును ఉండవచ్చును. ఆత్మీయ జీవితమునందు ముందుకు కొనసాగకుండునట్లు పలు ఆటంకములు రావచ్చును. మనస్సునందు సోమ్మసిల్లకుడి. జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు మిమ్ములనే ఏర్పరచుకొనియున్నాడు. కావున బలమును పొంది,  స్థిరత్వమును నొంది లేచి ప్రకాశించుడి.

నేటి ధ్యానమునకై: “యెహోవా నిన్ను తలగా నియమించునుగాని తోకగా నియమింపడు, నీవు పైవాడ వుగా ఉందువుగాని క్రింది వాడవుగా ఉండవు”(ద్వితీ.28:14).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.