AppamAppam - Telugu

జూన్ 23 – తెలియని మరుగైనసంగతులు!

“తెలియని మరుగైన క్రొత్తసంగతులు నేనికమీదట నీకు తెలియజేయుచున్నాను” (యెషయా.48:6)

ఒక సంగతి ప్రకటింపబడకుంటే ఇతరులకు అది ఎలాగు తెలియును?  ప్రభువు మీకు బయలుపరచుటకుంటే మరుగైన సంగతులను గూర్చి మీరు గ్రహించలేరు. ప్రభువు ప్రేమతో మిమ్ములను చూచి, ‘ఇది మొదలుకొని, తెలియని మరుగైన క్రొత్తసంగతులు  నీకు తెలియజేయుచున్నాను’ అని చెప్పుచున్నాడు.

పూర్వ దినములయందు ప్రభువు తమ యొక్క ప్రవక్తలద్వారా తెలియని పలు మరుగైయున్న సంగతులను బయలుపరచుటకు సంకల్పము కలిగియుండెను. ఉదాహరణమునకు, క్రీస్తుయొక్క పుట్టుకను గూర్చి ఎన్నో వందల సంవత్సరములకు పూర్వము జీవించిన యెషయా ప్రవక్తద్వారా స్పష్టముగా బయలుపరిచెను. ప్రవక్తలైయున్న తన యొక్క సేవకులకు తన రహస్యమును తెలియజేయుక దేనిని చేయడు అని బైబిలు గ్రంథము చెప్పుచున్నది.

మొదట ప్రవక్తల ద్వారా రహస్యములను బయలుపరిచెను. ఈ చివరి దినములయందు క్రీస్తుని ద్వారా మీకు మరుగైయున్న సమస్తమును బయలుపరచుటకు సంకల్పమును కలిగియున్నాడు. మీ యొక్క భవిష్యత్తు కాలమును మీకు బయలుపరచుటకు ప్రభువు ఎల్లప్పుడును ఆసక్తి కలిగియున్నాడు అనుట ఎంతటి ఆనందదాయకమైన అంశము!

దేవుని బిడ్డలారా, దేవుని చిత్తమును ఎరిగినవారై, రానున్నకాలమునందు మీ కుటుంబమును నడిపించుటకు ప్రభువునందు ఆలోచనను అడుగుడి. “నాకు మొఱ్ఱపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును” (యిర్మీయా.33:3) అని ప్రభువు వాక్కు నిచ్చియున్నాడు కదా.

మీరు ఎరిగియున్నది భూతకాలము, వర్తమానకాలము మాత్రమే. అయితే ప్రభువునకు భవిష్యత్కాలము తెలియును. భవిష్యత్కాలమునందు మీరు ఎలాగూ నడుచుకొనవలెను అనుటకు ఆలోచనను ఇచ్చుటకు ఆయన వలన అగును. “రాగలవాటినిగూర్చి నా వద్ద అడుగుడి; నా కుమారులను గూర్చియు నా హస్త కార్యములు గూర్చియు నాకే ఆజ్ఞాపించుడి” (యెషయా.45:11) అని ప్రభువు చెప్పుచున్నాడు.

రాత్రివేళయందు నిద్రించుటకు వెళ్లుచున్నప్పుడు, నా యొక్క రేపటి కాలమును గూర్చి స్వప్నము ద్వారా నాకు బయలుపరచుము అని ప్రార్ధించుడి. యోసేపుతో కూడా సప్నమునందు మాట్లాడినవాడు, సమూయేలుతో దర్శనమునందు మాట్లాడినవాడు, నెబుకద్నేజరునకు రానున్నవాటి సంగతులను బయలుపరచినవాడు, అలాగునే మీకును చేయును.

ఈ దినములయందు ప్రభువు మీతోకూడా మాట్లాడుటకు సిద్ధముగాఉన్నాడు. రానున్నకాలమును బయలుపరచి మిమ్ములను అమోఘమైన త్రోవలయందు నడిపించుటకు సంకల్పమును కలిగినవాడైయున్నాడు. దేవుని బిడ్డలారా, మీరు చేయవలసినదెల్లా ప్రభువు తట్టున చూచి మొరపెట్టుటయే(కీర్తన.91:15).

 

నేటి ధ్యానమునకై: “నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు; ఆయన నీ మొఱ్ఱ విని నిశ్చయముగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును”(యెషయా. 30:19).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.