AppamAppam - Telugu

జూన్ 22 – సౌందర్యమునందు శ్రేష్టుడు!

“నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు; పదివేలమంది పురుషులలో అతని గుర్తింపవచ్చును ” (పరమగీతము 5:10)

యేసును చూడవలెను, యేసును చూడకోరుచున్నాము అని అనేకులు ఆశించుచు యేసునియొద్దకు వచ్చుచున్నారు. ఆయనను చూచుచున్నప్పుడు, ఆయనను  గూర్చి సాక్ష్యము ఇచ్చుచున్నారు. ఆయన యొక్క రూపము  ఎట్లు ఉండునని వర్ణించుచున్నారు. “నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు; పదివేలమంది పురుషులలో అయన ప్రత్యేకమైనవాడు” అని చెప్పి  పొగడుచున్నారు.

ఆయన ధవళవర్ణుడు అనుటచేత, బైబిలు గ్రంథము ఆయనను తెల్లని వల్లిపద్మమునకు పోల్చి చెప్పుచున్నది. తెల్లని వల్లిపద్మము లోయలయందు పెరిగి, సువాసనను వెదజల్లుచున్నట్లుగా, క్రీస్తు తన్నుతాను రిక్తునిగా చేసుకొని, తన పరిశుద్ధతను పరిమళించువాడైయున్నాడు.

అయన రత్నవర్ణుడుకూడా రత్నవర్ణము అనుట, ప్రభువుయొక్క త్యాగమునకును,  కల్వరియొక్క రక్తమునకును సాదృశ్యమునైయున్నది. పరిపూర్ణ సుందరుడైన ఆయన, మనకొరకు కల్వరి సిలువయందు రక్తమును చిందించి రక్తవర్ణుడుగా మారెను. అందములేక, సౌందర్యములేక స్వరూపమును కొల్పోయెను. అట్టి రక్తవర్ణమును తేరి చూచునప్పుడెల్లా క్రీస్తు మనకొరకు శ్రమలను, మన కొరకు ఆయన చేసిన త్యాగములను మన మనస్సును పరవశింపచేయుచునే ఉన్నది.

ప్రభువు యొక్క ధవళవర్ణమును బైబిలు గ్రంథము వల్లిపద్మమునకును, ఆయన యొక్క రత్నవర్ణమును కల్వరి రక్తమునకును పోల్చుటను చూచితిమి. బైబిలు గ్రంథము ఆయనయొక్క రక్తవర్ణమును షారోను రోజాపుష్పమునకు పోల్చి చెప్పుచున్నది. షారోను రోజాపుష్పమును చూచున్నప్పుడెల్లా, కల్వరియొక్క గొప్పదారాలుగల రక్తవర్ణము మన మనస్సులను కదిలించివేయునదై యున్నది. ఆయనే దేవునికుమారుడు, ఆయనే మనుష్యకుమారుడు. ఆయనే మనకొరకు తండ్రి కుడిపాశ్వమందు విజ్ఞాపన చేయుచున్నాడు.

అట్టి మంచి రక్షకుని తేరి చూడుడి, ఆయన ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, పదివేలమంది పురుషులలో శ్రేష్ఠుడు. అంత మాత్రమేగాక, ఆయన మీవాడు. మీరు ఎప్పుడైతే, మిమ్ములను ఆయన వారిగా ఆయన హస్తమునందు అర్పించుకొంటీరో, అప్పుడే ఆయన మీవాడైయున్నాడు. ఆకాశము నా సింహాసనము భూమిని నా పాదపీఠము (యెషయా. 66:1) అని చెప్పిన, అంత గొప్పదేవుడు. మీవాడై మీతోకూడా ఉండి మిమ్ములను ఆయన నడిపించుట ఎంతగొప్ప భాగ్యమునైయున్నది!

దేవుని బిడ్డలారా, ఇంత మంచి రక్షకుని మీయొక్క ప్రాణ ప్రియునిగా అంగీకరించినట్లయితే, ఆయన మీయొక్క మనస్సునంతా నింపును. పరలోకపు మహిమను మీలోనికి తీసుకొచ్చును. పరలోకపు పరిశుద్ధతను, పరలోకపు దైవీక ప్రేమను మీయందు ఆయన స్థాపించును. పదివేలమంది పురుషులలో ఆయన ప్రత్యేకమైనవాడు నిశ్చయముగానే  మిమ్ములను కూడా ప్రత్యేకమైనవారిగా చేయును.

 

నేటి ధ్యానమునకై: “ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను, ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పునొందెను, దేవదూతలకు కనబడెను,  రక్షకుడని జనములలో ప్రకటింపబడెను,  లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యెను”(1 తిమోతి. 3:16).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.