AppamAppam - Telugu

జూన్ 17 – ఊరకుండుడి!

“ఊరకుండుడి, నేనే దేవుడనని తెలిసికొనుడి” (కీర్తన.46:10)

ప్రభువుయొక్క పాదాల చెంత కూర్చుండు అనుభవము ఒక ఆశీర్వాదకరమైన అనుభవము. ప్రభువుయొక్క ప్రసన్నతయందు ప్రశాంతముగా కూర్చుండుట, మీయొక్క విశ్వాసమును చూపించుచున్నది. ఆయనను నమ్మి, మీయొక్క భారములన్నింటిని ఆయనపై మోపివేసి, స్తొత్రించుచు విశ్రమించుట మీరు ఆయనను ఎంతగా ప్రేమించుచున్నారు అనుటను బయలుపరచుచున్నది.

మానవ జీవితమునందు,  దేవుని సన్నిధియందు కూర్చుండు అనుభవము మిక్కిలి అవశ్యము. మన ప్రియ ప్రభువుకూడా మిమ్ములను శాంతికరమైన జలములయొద్ద నడిపించువాడు కదా?  వేగముతో కూడిన ఈ కలియుగమునందు కూర్చుండుటకు మనుష్యుడు ఇష్టపడుటలేదు. భారములన్నిటిని తనయొక్క శిరస్సున ఎత్తిపెట్టుకొని, బాధలను భరించుచున్నాడు.

నూతనముగా పరిచర్యకు వచ్చిన ఒక సేవకుడు, తాను చేయవలసిన బాధ్యతలన్నిటిని వివరించుచు వచ్చెను. “ఈ వారమునందు నేను ఐదు ప్రసంగములను సిద్ధపరచుకొనవలెను.  మూడు వివాహములను జరిపించవలెను. అక్కడ దేవుని సందేశమును ఇవ్వవలెను,  ఇక్కడ జన్మదిన వేడుకయందు ప్రసంగించవలెను. అనేక వ్యాధిగ్రస్తులను సంధించవలెను. పై అధికారమునందు నిర్వహించబడుచున్న పలు సదస్సులలో ప్రసంగించవలెను’ అని అంతా వరుసగా చెప్పుచు వచ్చెను.

అక్కడ ఉన్న ఒకరు ఆయనను చూచి, ‘అయ్యా, మీరు ఇన్ని కూడికలయందు ప్రసంగించుచూనే ఉండినట్లైతే, ప్రభువు మీతో మాట్లాడుటను వినుటకు మీకు సమయము ఉండదే’ అడిగెను. ఇది ఆ యవ్వన సేవకునికి చూచి అడిగేటువంటి ప్రశ్న కాదు; మనలో ప్రతిఒక్కరిని చూచి అడుగబడుచున్న ప్రశ్నయు ఇదియే. మీరు ఏమని జవాబు చెప్పుదురు?

యేసును తేరి చూడుడి! ఆయన విరామము లేకుండా రాత్రింబగళ్ళు పరిచర్యను చేసెను. అయినను అప్పుడప్పుడు జనుల మధ్యనుండి ప్రత్యేకింపబడి తండ్రితోకూడా ఏకాంతమునందు సంభాషించుటకై సమయములను ఆయన పెట్టుకొనియుండెను. తండ్రిని దర్శించుటకై ఏకాంతమునందు కొండపైకి ఎక్కి, రాత్రి అంతయు ఒంటరిగా ప్రార్ధించునట్టి అలవాటు అనుట, ఆయనయొక్క అంతరంగ పురుషునియందు శక్తిని,  బలమును,  తాజాతనమును, వేగమును ఇచ్చెను. అరణ్యమునకు వెళ్లి తండ్రియొక్క సన్నిధియందు కూర్చుండెను. గెత్సమనే తోటకు వెళ్లి ఆసక్తితో ప్రార్ధించెను.

ఆనాడు దైవసన్నిధియందు కూర్చుండుటకు సమయములేకుండిన మార్తనుచూచి యేసు, “మార్తా, మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారముకలిగి తొందరపడుచున్నావు; గాని అవసరమైనది ఒక్కటే; మరియ అది ఆమె యొద్దనుండి తీసివేయబడనిదైన, ఉత్తమమైనదానిని ఏర్పరచుకొనెను” (లూకా 10: 41-42) అని చెప్పెను.

దేవుని బిడ్డలారా, ప్రభువుయొక్క పాదములయందు కూర్చుండవలసిన సమయములను కుదుర్చుకొనుడి. ఉదయమునందు లేచినవెంటనే ప్రభువుయొక్క సన్నిధికి వెళ్లి కూర్చుండుడి.

 

నేటి ధ్యానమునకై: “యోబూ, ఈ మాట ఆలకింపుము ఊరకుండి దేవుని అద్భుతక్రియలను ఆలోచింపుము.” (యోబు.37:14).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.