AppamAppam - Telugu

జూలై 11 – అనుకూల సమయము!

“యెహోవా, అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను; దేవా, నీ కృపాబాహుళ్యమునుబట్టి నీ రక్షణ సత్యమునుబట్టి నాకుత్తరమిమ్ము”(కీర్తన. 69:13)”

దేవునియొక్క కనికరము, అనుకూలత మిమ్ములను ఆవరించియున్న కాలమే ఈ కృపాకాలము. ప్రభువు మీకు అనుగ్రహించుచున్నాడు. యేసు చెప్పెను, “అనుకూల సమయమందు నీ మొర నాలకించితిని; రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటిని”(2. కొరింథీ.6:2). దీనిని గూర్చి బైబిలు గ్రంథము చెప్పుచున్న అంశమును చదివి చూడుడి. క్షామకాలము వచ్చుటకు ముందుగా ప్రభువు అనుకూల దినములను ఆజ్ఞాపించుచున్నాడు. ఐగుప్తునందు ఏడేండ్లు భయంకరమైన క్షామము వచ్చుటకు ముందుగా ఏడేండ్లు సంపూర్ణతయు, పరిపూర్ణతయు  ఉండెను.

ఆ అనుకూల సమయమునందు యోసేపు యొక్క ఆలోచనచొప్పున, పరో గిడ్డంగులను కట్టించి దాన్యములను సమకూర్చి పెట్టుకొనెను. అట్టి అనుకూల సమయమును ఫరో సద్వినియోగ పరచుకొనక ఉండినట్లైతే ఏమి జరిగి ఉండేది  అనుటను కొద్దిగా తలంచి చూడుడి, అతడును అతని జనులను నశించిపోయియుండేవారు!

అనుకూల సమయము తరువాత క్షామకాలము వచ్చుచున్నది.”రాబోవు దినములయందు దేశములో నేను క్షామము పుట్టింతును; అది అన్న పానములు లేకపోవుటచేత కలుగు క్షామముకాక యెహోవా మాటను వినకపోవుటవలన కలుగు క్షామముగా ఉండును”(ఆమోసు 8:11). కావున ఈ అనుకూల సమయమునందు ప్రాణమునకు కావలసిన కనికరమును కృపను ప్రభుని వద్దనుండి పొందుకొందుము. అపోస్తులుడైన పౌలు: “దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుడి”(ఎఫెసీ. 5:15) అని వ్రాయుచున్నాడు.

ఒకసారి ఒక యవ్వనస్తుడు ఎదురుచూడని రీతిలో హత్యా నేరమునందు చిక్కుకొనెను. న్యాయస్థానము అతనికి మరణశిక్షను విధించెను. అయితే ఆ దేశముయొక్క గవర్నర్ గారు అతని యొక్క ప్రాణభిక్ష మనవిని పరిశీలించి అతడు నిర్దోషి అనుటను గ్రహించి, అతనిని విడుదలచేయు పత్రమును చేతపట్టుకొని అతనిని చూచుటకై చెరసాలకు వెళ్ళను.

అది ఆ యవ్వనస్తునికి లభించిన అనుకూలసమయము, కృపయొక్క తరుణము. అయితే అతడు ఆ సంగతిని గ్రహించక బోధకునివలె వచ్చియున్న ఆ గవర్నర్ గారిని చూచి కోపముతో మండిపడెను. తన మనస్సునందుగల ద్వేషమంతటిని  ఆయనపై చూపించెను. “బయటకు పో నేను నీతో మాట్లాడటకు ఇష్టములేదు” అని చెప్పి ఆయన చేతులలో ఉన్న కాగితమును పట్టుకుకొని చింపివేసెను. ఆ గవర్నర్ గారు బహు దుఃఖముతో ఇంటికి తిరిగి వెళ్లెను.

చరసాల అధికారులు ఆ యవ్వనస్తుని వద్దకు వచ్చి, “నీవెందుకు ఆయనను అలా కానిమాటలతో మాట్లాడావు? ఆయన గవర్నర్ కదా? నిన్ను క్షమించునట్లు క్షమాపణ పత్రమును తీసుకొచ్చినవాడు కదా? అని చెప్పిరి. చివరకు అతడు ఉరితాడు వైపు నడుచుచున్నప్పుడు దుఃఖముతో,  “నేను నా హత్యానేరము కొరకు కాదు; నాకు లభించిన అనుకూల తరుణము తృణీకరించినందున మరణించుచున్నాను” అని చెప్పెను.

 

నేటి ధ్యానమునకై: “అతడు తృణీకరింపబడినవాడును ఆయెను, మనుష్యులవలన విసర్జింపబడినవాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధి(శ్రమ) ననుభవించినవాడు గాను, మనుష్యులు చూడనొల్లనివాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని ఎన్నికచేయకపోతివిు”(యెషయా.53:3).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.