Appam, Appam - Telugu

“వ్యర్ధమైన తలంపులను (ద్విమనస్కులను) నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రమును (నాకు ప్రీతికరము) నేను ప్రేమించుచున్నాను”      (కీర్తనలు. 119:113).

మనిష్యుని యొక్క కార్యసాధకములన్నియును తలంపులయందే ప్రారంభించుచున్నది. తలంచుచున్నాడు, మాట్లాడుచున్నాడు, ఆ తర్వాత కార్యసాధకము చేయుచున్నాడు. తలంపు పవిత్రముగా ఉండినట్లయితే, కార్యసాధకము కూడా పవిత్రముగా ఉండును. తలంపులయందు స్పష్టతయు, జ్ఞానమును ఉండినట్లయితే, అతని యొక్క జీవితము మధురముగా అమర్చబడును.

తలంపు ఎక్కడినుండి వచ్చుచున్నది? కొందరు మనస్సు నుండి వచ్చుచున్నది అనియు, కొందరు అంతరంగము నుండి వచ్చుచున్నది అనియు, కొందరు మెదడు యొక్క జ్ఞానము నుండి వచ్చుచున్నది అనియు చెప్పుచున్నారు. దిట్టముగాను, స్పష్టముగాను, ఎక్కడ నుండి వచ్చుచున్నది అని ఖచ్చితముగా ఎవరును చెప్పలేరు. అయితే ఈ తలంపులు మనుష్యుని కార్యసాధకము చేయునట్లు ప్రేరేపించుచున్నది (యోబు. 20:2).

ఒకనికి తన యొక్క తలంపును స్వాధీనమందు ఉంచుకొనుటకు తెలియవలెను. తలంపు మనస్సునకు వేరు వలె ఉన్నది. వేరు చక్కగా ఉంటేనే వృక్షము సస్యశ్యామలముగా ఉండును. నేడు జనులు  వ్యర్థమైనదానిని తలంచుచున్నందున (కీర్తనలు. 2:1) కీడును చేయుటకు త్వరపడుచున్నారు. కొందరికి వ్యభిచారపు తలంపులు ఉండుట చేత, ప్రభువును విడిచి జీవ మార్గమును విడిచి, మార్గము తప్పిపోవుచున్నారు (సామెతలు. 5:6).

దావీదు ఒక దినమున ఒక తీర్మానమునకు వచ్చెను.    “వ్యర్ధమైన తలంపులను (ద్విమనస్కులను) నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రమును (నాకు ప్రీతికరము) నేను ప్రేమించుచున్నాను”  అని చెప్పెను  (కీర్తనలు. 119:113). ఇక్కడ ఆయన యొక్క రెండు తీర్మానములను చూచుచున్నాము. వ్యర్ధమైన తలంపులను ద్వేషించుట, మొదటి తీర్మానము. ప్రభువు యొక్క ధర్మశాస్త్రనందు ప్రీతికలిగి ఉండుట, రెండోవ తీర్మానము. వ్యర్థమైన తలంపులకు కావలిగా ప్రభువునే ఉంచుచున్నాడు.    “దేవా,….. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసికొనుము”   అని ప్రార్థించెను (కీర్తనలు. 139:23). యేసు, పరిసయ్యులు, సదుకయ్యులు మొదలగు వారియొక్క తలంపులను కూడా ఎరిగినవాడైయుండెను. (మత్తయి. 12:25).  పేతురు, దేవునికి తగిన సంగతులను తలంపక, మనుష్యులకు తగిన సంగతులనే తలంచుచున్నందున ప్రభువు ఆ తలంపులను గద్దించెను (మత్తయి. 16: 23).

కీడైన తలంపులు వచ్చుచున్నప్పుడెల్లా పరిశుద్ధాత్ముడు అట్టి తలంపులను అడ్డగించి ఆపి, పరలోకపు తలంపులను తెచుచున్నాడు.  బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది:    “శరీరాను సారమైన మనస్సు మరణము; ఆత్మానుసారమైన మనస్సు జీవమును, సమాధానమునైయున్నది. ఏలయనగా, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; …. శరీరస్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు.

దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల, మీరు ఆత్మస్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు యొక్క ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు”     (రోమీ. 8:6-9).

వ్యర్ధమైన తలంపులను ద్వేషించుటకు దావీదు రాజు కనుగొనిన మార్గము, ధర్మశాస్త్రము పై ప్రీతికరముగా ఉండుటయే. బైబిలు గ్రంథమును పాఠించుటయును, ధ్యానించుటయును, లేఖన వాక్యముల చొప్పున జీవితమును అమర్చుకొనుటయును, వ్యర్ధమైన తలంపులను మిమ్మల్ని విడిచి తొలగించును. లేఖన వాక్యములన్నియును పరిశుద్ధాత్మునిచేత అనుగ్రహింపబడియున్నది. అవి ఆత్మయు, జీవమైయున్నది. లేఖన వాక్యములను ధ్యానించి, తలంచుచున్నప్పుడు,   “సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తువలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును”    (ఫిలిప్పీ. 4:7).

నేటి ధ్యానమునకై: “ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక, యితరుల కార్యములను కూడ చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ (మనస్సు) తలంపు మీరును కలిగియుండుడి”     (ఫిలిప్పీ. 2:5).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.