SLOT GACOR HARI INI BANDAR TOTO bandar togel bo togel situs toto musimtogel toto slot
Appam, AppamAppam - Telugu

జూలై 29 – ఆత్మయే జీవింపచేయును!

“ఆత్మయే జీవింపచేయుచున్నది; శరీరము కేవలము నిష్‌ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునైయున్నవి”    (యోహాను. 6:63)

అనేక కుటుంభములయందు ఆనందము అను జీవుపునాడి లేదు. అనేక ఆలయములయందు జీవము లేదు. ఒక కాలమునందు ప్రభువు కొరకు ప్రకాశింపబడినవారు నేడు జీవములేక, వెచ్చగానైనను, చల్లగానైనను లేక ఉన్నారు. జీవింపజేయు పరిశుద్ధాత్మకు చోటివ్వక పోవుటయే ఇట్టి జీవము లేని స్థితికి కారణము.

పరిశుద్ధాత్ముని యొక్క గుణాతిశయములయందు ప్రాముఖ్యమైన గుణాతిశయము జీవింపచేయు గుణాతిశయమైయున్నది. లోకమును ప్రభువు సృష్టించినప్పుడు, జీవరాశులను సృష్టించుటకు ముందుగా దేవుని యొక్క ఆత్ముడు జలములపై అల్లాడుచుండెను  అని మనము బైబిలు గ్రంధమునందు చదువుచున్నాము (ఆది. 1:2). ప్రభువు ముందుగానే భూమిని కలుగజేసియుండెను.  అయితే ఆ భూమి నిరాకరముగాను శూన్యముగాను ఉండెను. అంతటా చీకటి ఆవరించియుండెను.

అందుచేత దేవుని యొక్క ఆత్మడు లోకమునందు జీవరాశులను కలుగజేయుటకై జలములపై అల్లాడుచుండెను. గుడ్డులో నుండి జీవము బయలు పడువరకు తల్లి పక్షి గుడ్డుపై కూర్చుండునట్లుగా, ముందుగానే కలుగజేయబడిన శూన్యమైయున్న లోకమునందు జీవము కలుగునట్లుగా పరిశుద్ధాత్ముడు అల్లాడుచూనే ఉండెను. అందుచేతనే లోకమునందు సకల వృక్షములును, మృగ జీవరాశులును, పక్షులును కలుగజేయబడెను.

నరుని యొక్క సృష్టియందును పరిశుద్ధాత్ముని యొక్క వంతు కలదు. ప్రభువైయున్న యెహోవా భూమి యొక్క మట్టిచేత నరుని కలుగజేసెను. అతడు దేవుని పోలికయందు సృష్టింపబడినను, ఆయన యొక్క స్వారూప్యము అతనికి ఇవ్వబడి ఉండినను, జీవము అతనియందు లేదు.  ఆత్మయే అతనిని జీవింప చేయవలెను. కావున ప్రభువు జీవవాయువును అతని నాసికా రంధ్రములో ఊదెను. అప్పుడు నరుడు జీవాత్ముడాయెను  (ఆది. 2:7).

యోబు భక్తుడు సెలవిచ్చుచున్నాడు:   ‌”సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను”    (యోబు. 33:4). అవును ఆత్మీయే జీవింప చేయుచున్నది. జీవము లేకుండా పోయిన కుటుంభములను, సంఘములను, దేశమును జీవింపజేయుటకు గల మార్గము కలదా? పరిశుద్ధాత్మ యొక్క క్రియ బహు బలముగా ఉంటేనే అవి అన్నియును జీవింప చేయబడును. ఈ సంగతిని ప్రభువు తన యొక్క ప్రవక్తయైయున్న యెహేజ్కేలునకు చూపించునట్లు సంకల్పించెను. ఎముకలతో నిండియున్న ఒక లోయ  మధ్యలో నిలబెట్టి,     “నరపుత్రుడా, యెండిపోయిన యీ యెముకలు బ్రదుకగలవా?”   (యెహేజ్కేలు 37:3) అని ప్రభువు అడిగెను అని బైబిలు గ్రంథమునందు చదువుచున్నాము.

జీవము పొందునట్లుగా మార్గమును ప్రభువు చెప్పి ఇచ్చుచున్నాడు. నేను మీయందు నరములను చేర్చి, మీయందు మాంసమును కలుగజేసి, మిమ్ములను చర్మముతో కప్పి, మీయందు ఆత్మను ఆజ్ఞాపింతును అని చెప్పెను. యెహేజ్కేలు ప్రవక్త చూస్తూ ఉండగానే,  నరములును మాంసమును వాటిమీదికి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను, అయినను వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేక పోయెను  (యెహేజ్కేలు. 37:8). ఆత్మలేకుండా ఉండెను. వాటి యందు ఎట్టి ఔన్నత్యమును లేకుండెను. దేవుని బిడ్డలారా, ప్రభువు యొక్క ఆత్ముడు బలముగా మీ పైనను, మీ కుటుంభ సభ్యులపైనను దిగి వచ్చుటకు చోటును ఇచ్చెదరా?

నేటి ధ్యానమునకై: “మృతులలో నుండి యేసును లేపినవాని ఆత్మ మీలో నివసించినయెడల, మృతులలోనుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకులోనైన మీ శరీరములను కూడ మీలో నివసించుచున్న తన ఆత్మద్వారా జీవింపజేయును”    (రోమీ. 8:11).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.