No products in the cart.
మే 09 – లోకమును జయించియున్నాను!
“లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను” (యోహాను. 16:33).
ఒక మనుష్యుడు మూడు విధములలో శోధింపబడుచున్నాడు. మొదటిగా, అతడు తన సొంత ఇచ్చలచేత ఆకర్షింపబడి, చిక్కబడి శోధింపబడుచున్నాడు (యాకోబు. 1:13). రెండోవది, శోధకుడైన సాతాను వలన శోధింపబడుచున్నాడు (మత్తయి. 4:3, 2. కొరింథీ. 2:11). మూడోవది, ప్రభువు వలన శోధింపబడుచున్నాను.
శోధనతో నిండిన లోకములో మనము జీవించుచున్నాము. నేత్రాశలు, శరీరేచ్చలు, జీవపు డంబము మొదలగునవి ప్రతి దినమును దేవుని యొక్క పిల్లలపై బహు బలముగా దాడి చేయుచు ఉండును. శోధనలో పడిపోయినట్లయితే మనస్సాక్షి నిరారోపణము చేయును. ఉత్సాహము తొలగిపోతుంది, నిరుత్సాహము పట్టిపీడించుచున్నది.
అందుచేతనే సహజముగా ప్రార్ధనలో, “మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము” అని ప్రభువు ప్రార్థించుటకు నేర్పించెను. (మత్తయి. 6:13).
ఆది తల్లిదండ్రులైన ఆదామును, అవ్వయు శోధనకులోనై, పాపములోనికి పడిపోయిరి. ప్రభువు భుజింపకూడదని నిషేధించియున్న మంచి చెడ్డలను తెలియజేయు వృక్షపు ఫలమును భుజించినందున శోధన వారిని ఓడించెను. దానికి ప్రతిఫలముగా భూమియందు శాపమును, రోగమును, మరణమును వచ్చెను.
ఇప్పుడు మీరు శోధనను జెయించవలెనని ప్రభువు తన అమూల్యమైన రక్తము ఇచ్చియున్నాడు. మరోవైపున సాక్షార్థమైయున్న జీవితమును ఇచ్చియున్నాడు. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “గొఱ్ఱెపిల్ల రక్తమును బట్టియు, తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించియున్నారు” (ప్రకటన. 12:11).
శోధన సమయములలో స్థిరత్వము గలవారిగా నిలబడుటకు, పరిశుద్ధులను ప్రభువు పలు రకాల శ్రమలలో పుటమువేసి సువర్ణముగా ప్రకాశించునట్లు అర్హతను కలిగించెను. మోషేకు అరణ్యము వంటి జీవితమును, యోసేపునకు చెరసాలను, దావీదునకు కొండలను, గుహలను గుట్టలను మొదలగు వాటిని యోబునకు తట్టుకోలేని వ్యాధులను, అపో. పౌలునకు శ్రమలను, దెబ్బలను, నిందలను మొదలగు వాటిని సిద్ధపరిచెను.
అపో. యోహానునకు ఒంటరితనమైన పద్మస్ ద్వీపము యొక్క చెర విధించబడెను. ఈలాగున శరీరమునందు అనుభవించుచున్న శ్రమలు అన్నియును ప్రాణమునందు దైవిక బలమును, దృఢత్వమును తీసుకొని వచ్చుచున్నాయి. “శ్రమయైనను, బాధయైనను, హింసయైనను, కరవైనను, వస్త్రహీనతయైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను; ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్న వారమైయున్నాము” (రోమీ. 8:35,37).
దేవుని బిడ్డలారా, పోరాటపు సమయములయందు మీయొక్క కన్నులు క్రీస్తునిపై పోదిగింపబడి ఉండవలెను. మేఘము వంటి విస్తారమైన సాక్షి సమూహము మీరు ఎలాగున శోధనలను దర్శించుచున్నారు అను సంగతిని ఆర్భాటముతో పరలోకము నుండి గమనించుచూనే ఉన్నారు. “శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును” (యాకోబు. 1:12).
నేటి ధ్యానమునకై: “క్రీస్తుయేసునందు జీవమునిచ్చు ఆత్మయొక్క నియమము పాపమరణముల నియమమునుండి నన్ను విడిపించెను” (రోమీ. 8:2).
