No products in the cart.
మార్చి 27 – ఆకాను యొక్క తండ్రి!
“దరిద్రుల మొఱ్ఱ వినక చెవిని మూసుకొనువాడు, తాను మొఱ్ఱపెట్టునప్పుడు అంగీకరింపబడడు” (సామెతలు. 21:13).
ఒక పాస్టర్గారు తన సంఘస్తుల వద్ద ఆకాను యొక్క తండ్రి పేరు ఏమిటి అని అడిగెను. సంఘస్తులకు ఎవరికి తెలియలేదు. ‘ఆకాను అనువాడు శాపగ్రస్తమైన దానిని ఎరికో పట్టము నుండి బంగారపు కమ్మిని షీనారు పైవస్త్రమును తీసుకొని తన గుడారములో దాచి పెట్టుట చేత ఇశ్రాయేలు ప్రజలు అందరును హాయి పట్టణమునందు ఓడిపోయి వెన్నును చూపి పారిపోయిరి.
చివరకు అట్టి ఓటమికి కారకుడు ఆకాను అను సంగతి తెలిసిన వెంటనే అతనిని అతని యొక్క కుటుంబ సభ్యులును చంపబడిరి. అతని యొక్క తండ్రి పేరు కర్మీ అని బైబిలు గ్రంధము చెప్పుచున్నది’ అని ఆ బోధకుడు వివరించెను.
కర్మీ అను తమిళ పదమునకు లోభి, పిసినిగొట్టుతనమును కలిగియున్నవాడు, స్వార్ధపరుడు అని అర్థమునైయున్నది. బైబిలు గ్రంధమునందు చెప్పబడినయున్న ప్రకారము కర్మీ యొక్క కుమారుడే స్వార్థపరుడుగా షీనారు పైవస్త్రమును, బంగారపు కమ్మిని తన గుడారములో దాచి పెట్టుకున్నవాడు.
కార్మీలు వంటివారు ఆకానులను పుట్టింప జేయుచున్నారు. ఆకానులు స్వార్థపరులను పుట్టింప జేయుచున్నారు. చివరకు ఇట్టి వారు ఓటమిని పుట్టింప చేయుచున్నారు. అందువలన దేవుని ప్రజలు కష్టపడి యుద్ధములో ఓటమి పొందుచున్నారు.
ప్రభువు యొక్క పరిచర్య ఆటంకపరచ బడుటకును, క్షీణింప బడుటకును గల కారణము ఆత్మీయ లోకములో ఉన్న కార్మిల వంటివారే. ప్రభువు యొక్క పరిచర్యకు వచ్చి చేరవలసిన సంపాద్యయమును వంచించుచున్న కర్మీలు, సువార్త పనిని ఆటంక పరుచుచున్న కర్మీలు. ఇట్టి వారు ప్రభువునకు వచ్చి చేరవలసిన కానుకలను, సంపాద్యమును ఇవ్వకుండా దాచిపెట్టుకొని చివరకు వ్యాధియును, పేదరికమును పీడించుట చేత మరొక్క రీతిలో ధనమును కోల్పోవుదురు. “నూనె వ్యాపారికి ఇవ్వనివాడు వైద్యునికి ఇచ్చును” అనుటయు “పిసినారి సొత్తు దుష్ఠుల పాలు” అనుటయు సామెతలయైయున్నవి.
జార్జ్ ముల్లర్ గారి యొక్క జీవితములో అతి గొప్ప విజయము ఉండెను. ఆయన గొప్ప సంపన్నుడిగా ఉండలేదు. అయినను ప్రభువునకు ఇచ్చేటువంటి గొప్ప హృదయము ఆయనకు ఉండెను. ఇందు నిమిత్తము ఆయన అడిగే కొలది ప్రభువు ఆయనకు మెండుగా ఇచ్చుచునే ఉండెను. పదివేల మంది అనాధ పిల్లలను పెంచి పెద్ద చేసిన ఆయన అతి గొప్ప ఒక చక్కటి దాతయైయున్నాడు.
పలు క్రైస్తవ సంస్థలకు ఆయన త్యాగపూర్వకముగా విరాళములను ఇచ్చెను. ఇందువలన ఆయన సంపద అనునది వెవేల రెట్లుగా ఆయనకు తిరిగి వచ్చెను. చివరి వరకును ఎట్టి కొదవ లేకుండా ఆయనను అద్భుతముగా త్రోవ నడిపించెను.
బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; అణచి, కుదిలించి, జాలువారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు; మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడును” (లూకా.6:38).
దేవుని బిడ్డలారా, మీరు ప్రభువునకు ఇచ్చుట పరలోకములో మీకు ధనమును కూడబెట్టుట వంటిదైయున్నది. అది సురక్షితమైనది, దొంగలచేత అది దొంగిలించబడదు, చెదలచేత అది తినివేయబడదు.
నేటి ధ్యానమునకై: “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యత అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసికొనవలెననియు ……” (అపో.కా. 20:35).
