Appam, Appam - Telugu

మార్చి 23 – ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడు!

“ఇశ్రాయేలీయులలో దేవుడు ఒకడున్నాడని లోకనివాసులు అందరును తెలిసుకొనును”    (1.సమూ.17:46) 

జముపొందుటకు ప్రధాన మెట్టు దేవుని మహిమ పరచుటయైయున్నది. ప్రభువు యొక్క నామమును హెచ్చించుటయైయున్నది. సమస్త ఘనతయు, మహిమయు ఆయనకే చెల్లించుటయైయున్నది. ప్రభువు యొక్క నామమునందు విజయ పతాకము ఎగురవేటయైయున్నది. ఆ రీతిగా దేవుని మహిమ పరచుచున్నప్పుడు, మీరు ప్రభువు ఎదుట అత్యధికముగా మనస్సునందు తగ్గింపుగలవారై నడుచుకొనవలెను. మనలను మనము తగ్గించుకుని, ఆయన యొక్క నామమును మహిమపరచి,   “దేవా, నేను తరుగుటయు, నీవు పెరుగుటయు ఉండవలెను. ప్రభువా, మీ యొక్క  నామము మహిమపరచ బడుటకే జయమును దయచేయుము” అని మనము అడగవలెను.

ఒకసారి ప్రపంచ గాలిబంతి పోటీయందు బ్రెజిల్ దేశము విజయము పొందెను. దానికి గల కారణము ఏమిటో తెలియునా?  వారు పోటీయందు ఆడుచున్న సమయమున, ఆ దేశమునందుగల విశ్వాసులందరును ప్రార్థనయందు నిలచియుండెను. క్రీడాకారులు పోటీలలో పాల్గొనుటకు వచ్చినప్పుడు, వారి యొక్క బనియన్లపై    “క్రీస్తునకే మహిమ”   “నూటికి నూరు క్రీస్తునకే”   “యేసు, నిన్నే ప్రేమించుచున్నాను” అనేటువంటి పంక్తులన్నీయు ముద్రించబడి ఉండెను.

విజయమును పొందిన వెంటనే, ఆ క్రీడాకారులందరును ఆ మైదానమునందే చేతులను జోడించి దేవునికి మహిమ చెల్లించిరి.   “మా యొక్క విజయమునకు యేసుక్రీస్తే కారణము”    అని నోరార కీర్తించిరి. యావత్ ప్రపంచమే ఆ సంగతిని వీక్షించెను. మీరు పొందుచున్న విజయముల ద్వారా ప్రభువు యొక్క నామము మహిమ పరచబడవలెను.

“ప్రభువు మహిమ పరచబడవలెను. జీవము గల దేవుడు ఒక్కడు గలడు అను సంగతిని లోకము తెలుసుకొనవలెను. పునాది దృఢముగా ఉంటేనే,  భవనము స్థిరముగా నిలిచియుండును.  ప్రభువునకు మహిమ చెల్లించినట్లయితెనే, కొనసాగించి జయము పై జయము పొందగలము” అనుటయే దావీదు యొక్క తలంపు సరియైనదై ఉండెను.  దావీదు సెలవిచ్చుచున్నాడు,    “యెహోవా కత్తి చేతను, ఈటెచేతను, రక్షించువాడు కాడని యీ దండు వారందరు తెలిసికొందురు”    (1.సమూ. 17:47).

మొట్టమొదటిగా,  ‘దేవుని యొక్క ప్రజలైయున్న ఇశ్రాయేలీయులు అందరును తెలుసుకొందురు’  అని చెప్పెను.  రెండోవదిగా,   ‘ఈ దండు వారిలో అందరును తెలుసుకుందురు’  అని చెప్పెను. అన్యజనులు మాత్రము గాక, ప్రభువు యొక్క సువార్త ఎక్కడెక్కడంతా ప్రకటించబడునో, అక్కడక్కడంతా ఉన్న జనులు, అందరును తెలుసుకొందురు అనుటయే ఆయన చెప్పుటకు గల అర్థము.

అనేక కుటుంబము నందుగల, బిడ్డల యొక్క జీవితమునందు,  విద్యా రంగమునందు ప్రావీనత పొందుట లేక, ఉన్నతమైన ఉద్యోగములయందు అమర్చబడుట లేక, ఇటువంటి ఆశీర్వాదకరమైన కార్యములు జరుగుచున్నప్పుడు, తమ యొక్క బిడ్డలను మెచ్చుకొందురు.    “నా పిల్లవాడు బుద్ధిమంతుడు, రేయింపగళ్ళు కఠినముగా శ్రమపడెను, మరియు ప్రయాసములను సామర్థ్యవంతముగా జరిగించగలిగెను”  అని తల్లిదండ్రులు బిడ్డల యొక్క గొప్పతనమును మాట్లాడుచూనే ఉందురు. వీటినంతటిని ఆశీర్వాదకరముగా జరిగించుచు వచ్చిన ప్రభువు యొక్క నామమును వారు మహిమ పరచుటకు తప్పిపోవుదురు. అందుచేత బిడ్డలకు కొనసాగించి రావలసిన ఆశీర్వాదములు ఆటంకపరచబడుచున్నాయి. దేవుని బిడ్డలారా, ప్రభువు మీకు కనపరచిన కృపలను అన్ని వేళలయందు తలచుకొనుచు, ఆయనను హెచ్చించుడి. అప్పుడు ప్రభువు మరి అత్యధికముగా మిమ్ములను ఆశీర్వదించును.

నేటి ధ్యానమునకై: 📖”దేవుని మూలముగా పుట్టినవారందరును లోకమును జయించుదురు; లోకమును జయించిన విజయము మన విశ్వాసమే”    (1.యోహాను. 5:4).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.