No products in the cart.
మార్చి 16 – ద్వారములను తెరచువాడు!
“పరిశుద్ధుడును, సత్యస్వరూపి యగువాడును, దావీదు తాళపుచెవి కలిగి, యెవడును వేయలేకుండ తీయువాడును, ఎవడును తీయలేకుండ వేయువాడునైనవాడు చెప్పు సంగతులేవనగా” (ప్రకటన. 3:7).
మనము ఆరాధించుచున్న దేవుడు ఎటువంటి వాడు? ఆయన దావీదు తాళపుచెవిని కలిగినవాడును, మూసివేయ జలకుండా తెరచువాడను, తెరవ జాలకుండా మూసివేయువాడు. ఆయన ఒక ద్వారమును తెరిచినట్లయితే ఎట్టి మనుష్యుడైనను దానిని మూయజాలడు. అలాగునే ఆయన ఒక ద్వారమును మూసివేసినట్లయితే ఎట్టి దేవదూతయైనను సరే దానిని తెరవజాలడు.
ప్రభువు సెలవిచ్చుచున్నాడు: “నేను దావీదు ఇంటితాళపు అధికారభారమును అతని భుజముమీద ఉంచెదను; అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు” (యెషయా. 22:22).
నేడు గృహములను తాళము వేయుటకును తాళము తీయుటకును పలురకములైన తాళపు చెవులు వచ్చియున్నాయి. పూర్వకాలమునందు భుజములపై మోసుకుని వెళ్లేటువంటి అతిపెద్ద తాళపుచెవులను ఉపయోగించిరి. అందులోను దావీదు యొక్క ఇంటికి ఎంత పెద్ద తాళపు చెవి ఉండి ఉండవచ్చును? నేడు దావీదు యొక్క కుమారుడైన యేసు క్రీస్తు తన చేతులలో అనేక తాళపుచెవులను కలిగయున్నాడు.
మన యొక్క జీవితములో మొట్టమొదటిగా ఆయన తరచి ఇచ్చిన తాళపు చెవి పాప క్షమాపణయగు రక్షణయైయున్నది. తరువాత దైవీక సమాధానము అను తాళపు చెవిని ఉపయోగించి నిజమైన సమాధానమును ఇచ్చుచున్నాడు. మూడోవదిగా, నిత్యా జీవము. నాలుగోదిగా, పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకము. తరువాత దైవీక స్వస్థత, ఆత్మీయ వరములు మరియు ఫలములు మొదలగువన్నియును మనకు తెరచి ఇచ్చియున్నాడు.
ఒక వైపున ఆయన యొక్క తాళపుచెవి అనునది మోయబడియున్న ద్వారములను మనకు తెరచి ఇచ్చుచున్నది. అవును, పరలోకపు ద్వారమును, ఆయన మన కొరకు తెరిచెను. దేవునితో ఉన్న సహవాసమును తెరిచి ఇచ్చెను. మన యొక్క ప్రార్ధన ఆలకించబడేటువంటి అనుకూలమైన ద్వారమును తెరిచెను.
అదే సమయమునందు తాళపు చెవిని ఉపయోగించి అనవసరమైన అంశములను మూసి వేసెను. మరణపు ద్వారమును మూసెను. పాతాళ ద్వారమును మూతవేసెను. మనకు విరోధముగా ఉన్న సమస్త విధములైన కీడైన శక్తులను కూడా మన నుండి తొలగించి అంధకారములోనికి వాటిని త్రోసివేసి మూతవేసెను. “మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి” (ప్రకటన. 1:18).
నేడు మీకు ఒక నూతన ద్వారమును తరవబోవుచున్నాడు. అది ఆశీర్వాదకరమైన ద్వారము. పారసీకపు దేశమునందు ఎస్తేరు కొరకు అనుకూలమైన ద్వారమును తెరిచెను. దానియేలునకు బబులోనునందు గొప్ప ఔన్నత్యమైన ద్వారమును తెరిచెను. షద్రకు, మేషాకు, అబేద్నెగోలకు అగ్నిగుంఢములో నుండి బయటకు వచ్చునట్లుగా ద్వారమును తెరిచెను. శిర్స్ఛేదము చేయుట కొరకు చెరసాలలో అపో. పేతురు బంధించబడి ఉండినప్పుడు, దాని తలుపులను విరచి విడుదల అను ద్వారమును తెరిచెను.
దేవుని బిడ్డలారా, మీకు కూడాను అటువంటి అనుకూలమైన ద్వారములను తెరచున్నట్లుగా దేవుడు సంకల్పించియున్నాడు.
నేటి ధ్యానమునకై: “ఇదిగో, నేను (తలుపు) ద్వారమునొద్ద నిలుచుండి తట్టుచున్నాను; ఎవడైనను నా స్వరము విని, తలుపుతీసిన యెడల, నేను అతని యొద్దకు వచ్చి, అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము” (ప్రకటన. 3:20).
