No products in the cart.
జూన్ 29 – పడద్రోయబడుట యందు ఆదరణ
“పడద్రోయబడినను నశించువారము కాము” (2. కొరింథీ. 4:9).”
“క్రిందకు త్రోసి వేసిన గుర్రమే గుంతను త్రవ్వినట్లు” అనేకులు మిమ్ములను క్రిందకు త్రోసివేసి, మిమ్ములను అవమానపరిచి, మీరు పైకి లేవకుండునట్లు చేయుచున్నారు. అయితే అపోస్తులుడైన పౌలు, ” ” మేము క్రిందకు పడద్రోయబడినను నశించువారము కాము” అని చెప్పుచున్నాడు. ఆపత్కాలమునందు నీవు నాకు మొఱ్ఱపెట్టుము. నేను నిన్ను విడిపించెదను అని ప్రభువు చెప్పియుండుటను చూడుడి.
కీర్తనకారుడు సెలవిచ్చుచున్నాడు, “నరులు మా నెత్తిమీద ఎక్కునట్లు చేసితివి, మేము నిప్పులలోను నీళ్లలోను పడితివిు, అయినను నీవు సమృధ్ధిగలచోటికి మమ్మును రప్పించియున్నావు” (కీర్తనలు. 66:12).
నేడు పలువురు మిమ్ములను క్రిందకు పడద్రోయుటకు ప్రయత్నించవచ్చును. అవమాన పరచవచ్చును. నెత్తి మీదకు ఎక్కి వెళ్ళవచ్చును. ధూళి వలె దులిపి వేయవచ్చును. అయితే ఎంత మట్టుకు ఇతరుల చేత మీరు క్రిందకు పడద్రోయబడినను, ప్రభువు మిమ్ములను నిలబెట్టుటకు శక్తిమంతుడైయున్నాడు. కావున పడద్రోయబడిన స్థలమునందు పడినట్లుగానే ఉండకుడి. యేసు నామమునందు అధైర్యమును, అవిశ్వాసమును దులుపుకొని లేచి నిలబడుడి.
ప్రభువు సెలవిచ్చుచున్నాడు, “ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండుము, చెరపట్టబడిన సీయోను కుమారీ, నీ మెడకట్లు విప్పివేసికొనుము. మీరు ఊరకయే అమ్మబడితిరి గదా, రూకలియ్యకయే మీరు విమోచింపబడెదరు” (యెషయా. 52:2,3).
మీయొక్క సమస్యలు, పోరాటములు, మరియు నిందింపబడిన సందర్భములయందు యేసును యెదుట నిలబెట్టుకొనుడి. ఆయన తృణీకిరింప బడినవాడును, విసర్జింప బడినవాడైయుండెను (యెషయా.53:3) అనియు, ” ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు” (యోహాను. 1:11) అనియు బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది.
యేసుక్రీస్తు మనుష్యులచే త్రోయబడి విసర్జించబడెను. అయితే, “ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. ఇది ప్రభువు వలననే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యమునైయున్నది” (మత్త యి. 21:42) అని బైబిలు గ్రంథము చెప్పుచున్నది.
“మనుష్యులచేత విసర్జింపబడినను, దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారైన మీరు, యేసుక్రీస్తుద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్లవలెనుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు” (1.పేతురు. 2:4,5).
దేవుని బిడ్డలారా, మీరు పడద్రోయబడిన ఆ మూలరాయితో నేడు జత పరచబడి యున్నారు. ఒక మందిరము లేపబడునట్లు జీవముగల రాళ్లుగా ఆయనతో కట్టబడుచు లేపబడుచున్నారు. ప్రభువు యొక్క ప్రేమ, అయన దైవిక ప్రసన్నతయు మిమ్ములను ఆదరించి ఓదార్చనుగాక.
నేటి ధ్యానమునకై: “ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే; ఆ రాయి మూలకు తలరాయి ఆయెను” (అ.పో. 4:11).