Appam, Appam - Telugu

జనవరి 31 – కృపగల పిలుపు!

“యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, కన్నులెత్తి చూచి, అతనిని కనుగొని: జక్కయ్యా, త్వరగా దిగిరమ్ము, నేడు నేను నీ యింట నుండవలసియున్నదని అతనితో చెప్పగా”    (లూకా. 19:5)

యేసుక్రీస్తు, జక్కయ్యను పిలిచిన పిలుపు, కృపగల పిలుపైయున్నది. ఆయన జక్కయ్య యొక్క అంతస్తుని చూడలేదు, చదువును చూడలేదు. సుంకరిగాను, పాపిగాను ఉండిన అతనిని యేసు ప్రేమతో తేరి చూచెను, కన్నులెత్తి పార చూచెను.

ఆకాశ మహాకాశములను కలుగజేసిన సర్వశక్తిమంతుడైన దేవుడు, కన్నులెత్తి జక్కయ్యను పారచుచుచున్నాడంటే, అట్టి చూపే కృపతో నిండియున్న చూపైయున్నది. అట్టి చూపు నుండి ప్రేమయు, జాలియు, అతనిపై దిగివచ్చెను.   “జక్కయ్యా త్వరగా దిగిరమ్ము, నేడు నేను నీ యింట నుండవలసియున్నది”  అని యేసుని యొక్క కృపగల పిలుపునకు ఏమని జవాబు చెప్పుట? ఎంతోమంది ధనికులు ఉన్నప్పుడు, ప్రభుత్వపు అధికారులు ఉన్నప్పుడు, నా ఇంటినా క్రీస్తు ఉండుటకు ఎన్నుకొనెను  అని క్రీస్తుని ప్రేమను తలంచి ఆనందముతో కేరింతలు కొట్టియుండును. అట్టి కృప మహా గొప్పది.

ప్రభువు ఎలాగున మిమ్ములను రక్షించెను? ఎలాగున మీకు తన్ను తాను బయలుపరచుకొనెను? మీ యొక్క అర్హతను చూచి కాదు. మీ యొక్క సత్క్రియలను చూచి కాదు. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది,   “మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు  మనలను క్రీసుతో కూడ బ్రదికించెను.  కృపచేత మీరు రక్షింపబడియున్నారు”   (ఎఫెసీ. 2:5).   “దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తమువలన మనకు విమోచనము,మనకు కలిగియున్నది. మనకు సంపూర్ణమైన జ్ఞానవివేచన కలుగుటకు, ఆ కృపను మనయెడల విస్తరింపజేసెను”   (ఎఫెసీ 1:7,9).

ప్రభువు ఎలాగు మిమ్ములను నీతిమంతులుగా చేయుచున్నాడు.  కృపచేతనే, నీతిమంతులుగా తీర్చబడియున్నారు   (రోమీ. 3:24). మీరు ఎలాగున లోకముయొక్క చెరుపునకును, నాశమునకును తప్పింపబడుచున్నారు? అది క్రీస్తును ఎరుగుచున్న జ్ఞానము చేతను, కృప చేతను అది సాధ్యమగుచున్నది.

సుంకరియైన జక్కయ్య యేసుని సంధించి, తన ఇంటికి వెంటపెట్టుకొని తీసుకొని వెళ్ళినప్పుడు, అందరును ఆశ్చర్యపడిరి. అతనిని సుంకరి అనియు, పాపి అనియు చెప్పిన వారే తప్ప, క్రీస్తు యొక్క కృపా మహదైశ్వర్యమును యెరుగనులేదు. జక్కయ్యను పిలిచిన పిలుపు యొక్క కృప యొక్క ఔనత్యమైన పిలుపు అను సంగతిని గ్రహించను లేదు.    “పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను”  ‌ (రోమీ. 5:20)  అని బైబిలు గ్రంథము చెప్పుచున్నది.

జక్కయ్య యొక్క ఊరు, ఎరికో అని పిలవబడుచున్నది. కజ్జూరపు చెట్ల యొక్క పట్టణ మది. ఆ స్థలము శాపపు స్థలముగా ఉండును. యెరికోనందుగల సమస్త ఖర్జూరములును శాపపు చిహ్నములుగా ఉండునని యెహోషువ సెలవిచ్చెను. ప్రభువైతే తన యొక్క కృపచేత, శాపపు చిహ్నమైయున్న అట్టి యెరికోకు వచ్చెను.  యెరికోనందుగల అడవి మేడిచెట్టున ఎక్కియున్న జక్కయ్య యొక్క శాపమును మార్చుచున్నవాడై కనికరించెను.

దేవుని బిడ్డలారా, జక్కయ్యను కనికరించిన ప్రభువు మీపట్ల  కనికరింపకపోవునా?

నేటి ధ్యానమునకై: “ఇకమీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు, దేవుని యొక్కయు గొఱ్ఱెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును”   (ప్రకటన. 22:3).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.