No products in the cart.
ఆగస్టు 03 – దేవుని సన్నిధి వలన విశ్రాంతి!
“ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసెదననగా” (నిర్గమ. 33:14)
పాత నిబంధన మరియు కొత్త నిబంధన అను వాటి రెండిటిలోను మనకు దైవీక విశ్రాంతి వాగ్దానము చేయబడియున్నది. ఆశీర్వాదముల అన్నిటిలోను అతి గొప్ప ఆశీర్వాదము విశ్రాంతియైయున్నది. ఆంగ్ల బైబిలు గ్రంధమునందు విశ్రాంతి అను మాట ‘Rest’ అని భాషాంతరము చేయబడియున్నది. ఇట్టి విశ్రాంతి యొక్క మార్గము ఏమిటి? మొట్టమొదటి మార్గము దేవుని సముఖమునైయున్నది.
దేవుని ప్రసన్నతయందు మీరు కూర్చున్నప్పుడు. ప్రభువు యొక్క అత్యంత ప్రేమగల సముఖము మిమ్ములను సంపూర్ణముగా నింపి ఆనందింప చేయును. ఆయనను ఆడి పాడి స్తుతించుచున్నప్పుడు, ఆయన మీ ముందుకు తరలి వచ్చును. ఆత్మతోను, సత్యముతోను ప్రభువును ఆరాధించుచున్నప్పుడు, ఆయన యొక్క మధురమైన ప్రేమ మీయందు నిండి పొర్లును.
ప్రభువు మీ యొక్క కాపరిగా ఉండినట్లయితే, శాంతికరమైన జలముల యొద్దకు మిమ్ములను నడిపించును. ‘శాంతికరమైన జలము’ ప్రభువు ఇచ్చుచున్న విశ్రాంతిని సూచించుచున్నది. తేట లేని నీళ్లను మేకలు కూడా కోరుకొనవు. ప్రభువు మీకు విశ్రాంతిని కలుగజేయుటకే మంచి కాపరిగా మీకు ముందుగా వెళ్ళుచునే ఉన్నాడు.
విశాంతిని ఇచ్చునట్లుగా ప్రభువుతో కూడా దేవుని దూతలు, కెరూబులు, సెరాపులు అందరును ముందు వెళ్ళుచున్నారు. ఆయన యొక్క శక్తి పరాక్రమమును మీకు ముందుగా వెళ్ళును. మేఘస్తంభములును, అగ్నిస్తంభములును మీకు ముందుగా వెళ్ళును. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువైనవాడు ముందుగా వెళ్లి విశ్రాంతిని దయచేయును.
దేవుని సన్నిధి మీకు ముందుగా వెళుచున్నప్పుడు ఎట్టి ఫరో అయినను మిమ్ములను అడ్డగించలేడు. సముద్రము మీకొరకు మార్గమును తరచి ఇవ్వవలసినదే. ఉప్పొంగుచు వచ్చుచున్న వరదలైనను, గొప్ప ప్రవాహముతో ప్రవహించుచున్న యుర్ధానులైనను వెనుతిరిగి వెళ్ళవలసినదే. ఎంతటి గొప్ప ఇనుప గొళ్ళములను, ఇత్తడి తలుపులను కలిగియున్న ఎరికో ప్రాకారములును కుప్పకూలి పడిపోవలసినదే.
దేవుని సన్నిధిని తీసుకుని వచ్చుట ఎలాగు? అవును, ప్రభువును స్తుతించే స్తుతియే దేవుని సన్నిధిని మీ మధ్యలోనికి తీసుకొని వచ్చును. ఆయన ఇశ్రాయేలీయులు చేయు స్తోత్రములమీద ఆసీనుడైయున్న దేవుడు కదా? (కీర్తనలు. 22:3). ఏ సంఘము ఆత్మతోను, సత్యముతోను ప్రభువును ఆరాధించుచున్నదో, అట్టి సంఘమునందు దేవుని యొక్క సన్నిధి కొలత లేకుండా దిగి వచ్చుట నిశ్చయము.
అపోస్తులుడైన పౌలును, సీలను తేరి చూడుడి. వారు కోడాలతో బహు భయంకరముగా కొట్టబడిరి. చెరశాలయందు వెయ్యబడి గొలుసులతో బంధించబడిరి. వారికి కాళ్లు బొండమునకు బిగించబడెను. అయితే అంతరంగము దైవీక విశ్రాంతియందు ఆనందించుచునే ఉండెను. అందుచేతనే సమాధానముతో ప్రభువును స్తుతించి పాడి ఆరాధించిరి. చెరశాలయందు గల మిగతా వారు కూడా దానిని వింటూ ఉన్నప్పుడు, వారి యొక్క అంతరంగము నందును ఒక గొప్ప విశ్రాంతి కలిగియుండ వచ్చును కదా?
దేవుని బిడ్డలారా, ప్రతిపరుస్థుతుల యందును ప్రభువును స్తుతించుడి. మీరు ప్రభువును కొనసాగించి స్తుతించుచు దైవీక విశ్రాంతియందు ప్రవేశించుడి.
నేటి ధ్యానమునకై: “కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచియున్నది” (హెబ్రీ. 4:9).