No products in the cart.
మార్చి 20 – పదునుగల!
“ఇదిగో, కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించియున్నాను; నీవు పర్వతములను నూర్చుదువు వాటిని పొడిచేయుదువు, కొండలను పొట్టువలె చేయుదువు” (యెషయా. 41:15).
ప్రభువు యొక్క ఇట్టి వాగ్దానము ఎంతటి మధురమైనది! ఆయన మనలను చూచుచున్నప్పుడు పదునుగల నూర్పిడి మ్రానువలె చూచుచున్నాడు. పర్వతములను త్రొక్కి నూర్చునట్లు శక్తిగలవారిగా చూచుచున్నాడు.
ఒక గొడ్డలిని తీసుకొని చెట్టుని నరుకుటకు కోరువాడు ఆ గొడ్డలి పదును గడలదిగా ఉన్నదా అను సంగతిని మొదట పరిశీలించి చూచుచున్నాడు. అలాగున పదును లేకుండా మొద్దుభారి ఉండినట్లయితే చెట్టును నరుకుచున్నప్పుడు అతని యొక్క బలమే వ్యర్థమగును గాని చెట్టు నరకబడకుండును.
మీరు ఏ అంశము చేయుచున్నప్పుడు కూడాను మొదట ప్రార్ధించి చేసినట్లయితే ఆ అంశము వెంటనే సఫలమగుటను చూడ వచ్చును. ప్రార్ధించకుండా చేసినట్లయితే మీరు మొద్దు బారిన గొడ్డలివలె మీ యొక్క అంశము ఏమియు సఫలము కాకుండా దుఖించుచు మల్లుదురు.
ఉదాహరణముగా, మీరు ఒక వ్యక్తిని దర్శించుటకు వెళ్ళుచున్నారు అని అనుకోనుడి. బస్సెక్కి ప్రయాణము చేసి ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఇప్పుడే బయటకు వెళ్ళిపోయెను అని చెప్పినట్లయితే, మరల సాయంత్రము కూడా వెళ్లుదురు. ఇలాగున పలుసార్లు మరలా మరలా ఆయనను కలుసుకొనుటకు వీలుకాకపోయెను అని అనుకోనుడి.
అప్పుడు మీరు చేయవలసినది ఒక్కటే. మోకరించి ప్రార్ధించుడి, ‘ప్రభువా, నేను ఆయనను దర్శించుటకు కోరుచున్నాను. ఇంతవరకు ప్రార్థించకుండా వెళ్లినందున ఆయనను నేను దర్శించలేకపోయాను. ఇప్పుడు మీరు బాధ్యతను వహించుడి నేను ఆయనను దర్శించుటకు సహాయము చేయుడి’ అని ప్రార్ధనలో అడుగుడి. మీరు దర్శించాలని అనుకున్న వ్యక్తి మిమ్మలను వెతుకుచు మీ యొక్క ఇంటికి ఆయనే వచ్చును. ఇదియే మొద్దు బారిన గొడ్డలిచేత చెట్టును నరుకుటకును, పదును గల గొడ్డలి చేత చెట్టును నరుకుటకును గల వ్యత్యాసమునైయున్నది!
మీ యొక్క ఆత్మీయ జీవితమును పదును పరచి, ప్రభువు యొక్క పాదములయందు కనిపెట్టుకొనియుండుడి. మిమ్ములను మీరే పరిశీలించి చూచుకొనుడి, సరి చేసుకొనవలసిన అంశములను సరి చేసుకొనుటకు సమయమును కేటాయించుడి. ప్రభువునకై కనిపెట్టుకొని ఉండుడి. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు; వారు పరుగెత్తినను అలయకుందురు, నడిచినను సొమ్మసిల్లకుందురు” (యెషయా. 40:31).
పలు సమయములయందు మన యొక్క శరీరము అలసిపోవచ్చును, సోమసిలిపోవచ్చును, ప్రార్థించలేక బడలిక చెందవచ్చును. అప్పుడు మీరు మొద్దు భారిపోయిన గొడ్డలి వలె ఉండకూడదు.
దేవుని బిడ్డలారా, మీరు ప్రార్థించలేని పరిస్థితులయందు కూడాను ప్రభువును తేరిచూచి స్తోత్రించుడి. నిదానముగా అన్యభాషలలో మాట్లాడి ప్రభువును మహిమ పరచుడి. అప్పుడు ప్రభువు మీకు నూతన హృదయమును ఇచ్చి, మీ అంతరంగమునందు నూతన ఆత్మను ఆజ్ఞాపించును (యెషయా. 36:26).
నేటి ధ్యానమునకై: “కాగా, ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను” (2. కోరింథీ. 5:17).
