No products in the cart.
మార్చి 14 – శ్రేష్టమైన ఐశ్వర్యవంతుడు!
“యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు; ఒక్క ప్రభువే అందరికి ప్రభువైయుండి, తనకు ప్రార్థనచేయు వారందరి యెడల కృప చూపుటకు ఐశ్వర్య వంతుడైయున్నాడు” (రోమీ. 10:12).
మన యొక్క తండ్రి ఐశ్వర్యవంతుడు, మనము ఆయన యొక్క శ్రేష్టమైన పిల్లలము. అబ్బా తండ్రి అని పిలిచేటువంటి దత్తపుత్రు శ్వీకృత ఆత్మను పొందుకున్నవారము. మనము దేవుని యొక్క బిడ్డలమైయున్నాము అని పరిశుద్ధాత్ముడుతానే తన యొక్క ఆత్మ ద్వారా సాక్ష్యమును ఇచ్చుచున్నాడు (రోమీ. 8:15,16).
మీరు శ్రేష్టమైనవారు, రాజాధిరాజు యొక్క పిల్లలు, ప్రభువుల ప్రభువు యొక్క స్వాస్థ్యమునైయున్నవారు. కావున మీరు ఎన్నడను తల దించుకుని సిగ్గుతో నడవవలసిన అవసరము లేదు. ఎవరును మిమ్ములను కించపరచి, ఆల్పముగా తలంచుటకు చోటు ఇవ్వకుడి.
మీరు సర్వోన్నతమైన దేవుని యొక్క పిల్లలైయున్నందున మీ జీవితము యొక్క ఉద్దేశములు, లక్ష్యములు, దర్శనములు మొదలగునవి ఎల్లప్పుడును ఉన్నతమైనదిగా ఉండవలెను. మీరు ప్రభువు యొక్క చిత్తములో నుండి ఆయనకు సంబంధించిన ఉద్దేశములో నుండి కలుగజేయ బడినవారు. మిమ్మల్ని గూర్చిన గొప్ప ఔన్నత్యమైన ప్రణాళికలను ప్రభువు కలిగియున్నాడు.
అవును, నిశ్చయముగానే మహిమకరమైన భవిష్యత్త్కాలము మీకు కలదు. మిమ్ములను హేళన చేసి, చులకనగా ఎంచి, నిర్లక్ష్యము చేయుచున్న వారిని విడిచి తొలగిపోవుడి. వాస్తవమునకు గొప్ప ఔన్నత్యము గల ప్రజలు ఎల్లప్పుడును ఇతరులను కూడాను గొప్ప ఔన్నత్యముగానే తలంచుదురు. ప్రభువు మిమ్ములను గొప్ప ఔన్నత్యముగా తలంచియున్నాడు ఆయన యొక్క సృష్టిలో మీరు గొప్ప ఔన్నత్యమైనవారు.
ఒక భక్తుడు: ‘ప్రభువు ప్రతి మనుష్యుడ్ని వ్యర్ధముగాను, అల్పముగాను సృష్టించలేదు. పనికిమాలిన దానిని సృష్టించినట్లుగా ఆయన తన యొక్క సమయమును కాలమును వ్యర్థముగా ఖర్చుపెట్టలేదు’ అని చెప్పెను. ప్రభువు మిమ్ములను శ్రేష్టమైన వారిగా తలంచుట చేత ఎన్నడును చులకన భావమునకు చోటివ్వకుడి.
మీరు ఆత్మ సంబంధమైన జీవితములో గొప్ప ఔననత్యమైన, ఉన్నతమైన స్థితికి రావలెను అంటే దానికి ఐదు మెట్లు కలవు. మొట్టమొదటిది, మీరు ప్రభువు యొక్క బిడ్డలు స్వాస్థ్యమైనవారు అను సంగతిని జ్ఞాపకమునందు ఉంచుకొనుడి. రెండోవదిగా, ప్రభువు మీకు ఇచ్చియున్న ఏలుబడిని ఉపయోగించుడి.
మూడోవదిగా, ప్రభువు మీకు అనుగ్రహించియున్న శక్తిని వాడుకలోనికి తీసుకొని రండి. నాలుగోవదిగా, క్రీస్తు యేసునందు మీరు కలిగియున్న పరలోక సంబంధమైన ఆశీర్వాదములను, ఐశ్వర్యములను తలంచి చూడుడి. ఐదోవదిగా, మీరు వెళ్లి చేరనైయున్న పరలోకరాజ్యమును తలంచి ఉల్లసించుడి.
దేవుని బిడ్డలారా, ఏమీ లేనివారైయున్న మిమ్ములను తన యొక్క బిడ్డలుగా చేసుకుని, మీకు ఏలుబడిని అధికారమను అనుగ్రహించి, తన యొక్క శక్తిచేత నింప్పి, పరలోక సంబంధమైన సకల ఆశీర్వాదముల చేతను మిమ్ములను నింప్పి, నిత్యా రాజ్యమును మీకు వాగ్దానము చేసియున్న ఐశ్వర్యవంతుడైన ప్రభువును కృతజ్ఞతతో స్తుతించెదరా?
నేటి ధ్యానమునకై: “నా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీప్రతి అవసరమును తీర్చును” (ఫిలిప్పీ. 4:19).
