Appam, Appam - Telugu

జూన్ 25 – గాయములయందు ఆదరణ

“నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను, నీ గాయములను మాన్పెదను; ఇదే యెహోవా వాక్కు”   (యిర్మీయా. 30:17).”

గాయముల యందు వెలుపటి గాయములును కలదు, లోపటి గాయములును కలదు. శరీరమందు లోపటి గాయములును కలదు, ప్రాణము నందు కలుగుచున్న గాయములును కలదు. త్వరగా మానేటువంటి గాయములును కలదు, మానని గాయములును కలదు.

ప్రభువు ప్రేమతో మీ చెంతకు వచ్చి,  “నా బిడ్డలారా, నేను మీకు ఆరోగ్యమును కలుగజేసెదను, మీ గాయములను మాన్పెదను”  అని చెప్పి ఆదరించి ఓదార్చను.

ప్రభువు గాయపరచినను గాయమును కట్టుచున్న దేవుడైయున్నాడు. పాపము యొక్క శిక్షను ఒకవేళ మీ పై మోపినను, తర్వాత జాలి కలిగి గాయములను మాన్పేటువంటివాడై యున్నాడు.  ఇశ్రాయేలు ప్రజలు పాపము చేసినప్పుడు, వారిని ప్రభువు చెర పట్టబడుటకై అప్పగించెను.

చెరపట్టబడిన నందువలన కలిగిన గాయములు లోతైనదిగాను,  తట్టుకోలేనిదిగాను ఉండటను చూచి, వారు కన్నీటిని విడిచి ఏడ్చి  ప్రభువు వద్దకు తిరిగినప్పుడు, ప్రభువు ఆ గాయములను మాన్పి,  తమ యొక్క దేశమునకు మరల తిరిగి వచ్చున్నట్లు చేసెను.

న్యాయాధిపతుల గ్రంథమును, రాజుల యొక్క గ్రంథమును, ఇజ్రాయేలు యొక్క చరిత్రయు ఇట్టి వాస్తవమును బయలు పరచుచున్నది. ప్రభువు తట్టు తేరి చూచుచున్నప్పుడు, ఆయన వారి గాయములను మాన్పును. కావున దావీదు,   “దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు”   (కీర్తన. 51:17)  అని ప్రార్ధించెను.

ఎరికోకు వెళ్ళు మార్గము నందు ఒక మనుష్యుడు కొరప్రాణముతో ఉండెను. అతనిని దొంగలు గాయపరచి ఉండిరి. అతని యొక్క ధనమును దోచుకొనుటతో పాటు, అతని యొక్క వస్త్రములను ఒలుచుకొనుటతో పాటు వారు అతనిని విడిచి పెట్టలేదు. అతనిని గాయపరచి, కోరప్రాణాలతో ఉండు దుర్స్థితికి తెచ్చిరి.

మనుష్యుల యొక్క ప్రాణమును కొర్రప్రాణాల దుస్థితికి తెచ్చు కౄరమైన దొంగ సాతానైయున్నాడు. అతడు సంతోషమును దొంగిలించుచున్నాడు, సమాధానమును దొంగలించుచున్నాడు. అంతమాత్రమే కాదు,  ఆత్మీయ రక్షణ వస్త్రములను ఒలుచు కొనుచున్నాడు.  మనుష్య హంతకుడైన సాతాను జనులను కొరప్రాణములతో విడిచిపెట్టుచున్నాడు.

మంచి సమరయుడైయిన యేసు అతనిని వెతుక్కుంటూ వచ్చెను, లేవనెత్తెను, జాలిపడెను, గాయముల యందు నూనెను ద్రాక్ష రసమును పోసి, గాయమును కట్టెను.

దేవుని బిడ్డలారా, ప్రభువే మనలను స్వస్థపరచువాడై ఉండి మనలను పరామర్శించుచున్నాడు. ఆయన యొక్క ప్రేమ నేడును మీ యొక్క గాయములను కట్టుచున్నది  (లూకా. 10:33,34).  ఆయన మీ వేదనను ఎరుగును. నిశ్చయముగానే మిమ్మలను ఆదరించును.  మీయొక్క గాయములను కట్టి మీకు ఆరోగ్యమును కలుగజేయును.

నేటి ధ్యానమునకై: “నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును; అతని రెక్కలు ఆరోగ్యమును కలుగజేయును గనుక; మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు”    (మలాకీ. 4:2).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.