Appam, Appam - Telugu

ఆగస్టు 17 – వెదకుచున్న విశ్రాంతి!

“అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరులేని చోట్ల తిరుగుచుండును, విశ్రాంతిని (వెదకినను) దొరకనందున నేను వదలివచ్చిన నా యింటికి తిరిగి వెళ్లుదుననుకొని…..”     (మత్తయి. 12:43,44) 

చూడండి, అపవిత్రాత్మ కూడా విశ్రాంతిని వెతికి ఆలయుచు తిరుగుచున్నదట. మనుష్యుని కనుగొని అతనిలోనికి వెళ్లి విశ్రాంతి పొందవలెనని కోరుచున్నదట. అతడు చోటు ఇచ్చుచున్నప్పుడు, అతనిని పట్టుకొనుచున్నది. యేసు గెరాసేనుల దేశ సముద్ర తీరమునందు గల సమాధులలో నివాసమున్న మనుష్యునిలో ఉన్న సేన అను పేరుగల దెయ్యములను వెళ్ళగొట్టినప్పుడు, అవి పందులలోనికి వెళ్ళుటకు కోరెను. ఏదో ఒక స్థలమునందు నివాసము ఉండవలెనని కోరెను.

అవ్వను మోసగించాలని తలచిన సాతాను ఘటసర్పమునందు చోటు పట్టుకొనెను.     “సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై యుండెను”     (ఆది. 3:1)  అనుటయే దానికి గల కారణము. కొన్ని అపవిత్రాత్మలు కోతి వంటి మృగములయందు చోటు పట్టుకొనును. కొన్ని దురాత్ములు వేప చెట్టుయందు వేలాడుచు ఉండునట.   ‘ములగ చెట్టు ఎక్కిన బేతాళము’ అను కథ కూడా ఒకటి కలదు. సహజముగా, అపవిత్రమైన స్థలములయందే, సాతాను నివాసము ఉండుటకు కోరుటను చూచుచున్నాము.

“నా నామమున దయ్యములను వెళ్లగొట్టుదురు”    (మార్కు. 16:17)  అను లేఖన వాక్యము చేత సేవకులు అపవిత్ర ఆత్మను వెళ్ళగొట్టుచున్నప్పుడు, అది వెళ్ళి పోవుచున్నది. అయితే అపవిత్ర ఆత్మ వెళ్లగొట్టబడిన మనుష్యుడు తన యొక్క జీవితమును క్రీస్తునకు సమర్పించు కొనకపోయినట్లయితే, అతని అంతరంగమగు ఇల్లు శూన్యముగాను, ఊడ్చి అమర్చబడినదిగాను, అపవిత్రాత్మకు తగినదిగాను ఉండును. అతనిలోనుండి వదిలిపోయిన అపవిత్ర ఆత్మ నీరు లేని చోట్లకు వెళ్లి, అది ఎదురుచూచిన విశ్రాంతి దొరకక పోయినందున, మరల అదే మనుష్యుని అంతరంగములోనికి తిరిగి వచ్చును.

తాను మరల ఒంటరిగా వెళ్ళినట్లయితే, మరలా తనను వెళ్ళగొట్టుదురేమో అని ఆ అపవిత్రాత్మ భయపడి, వెళ్లి మరలా తనకంటె చెడ్డదైన మరి యేడు దయ్యములను వెంటబెట్టుకొని వచ్చి దానిలో ప్రవేశించి, అక్కడనే కాపురముండుటకు ప్రారంభించును. ఎంతటి భయంకరమో చూడుడి. ఆ మనుష్యుని యొక్క కడపటిస్థితి మొదటిస్థితికంటె చెడ్డదైపోవును.

ఒకసారి ఒక సేవకుడు, ఒక యవ్వనస్థుని యందుగల సర్పపు ఆత్మను వెళ్ళగొట్టెను. అతనిని యేసుని వద్దకు త్రోవ నడిపించినట్లు, పాపపు ఒప్పుకోలు ప్రార్థనను చెప్పునట్లు చెప్పెను. అయితే అతడు,   ‘మీరు నాయందు గల దయ్యమును వెళ్ళగొట్టిరి. మీకు కృతజ్ఞతలు, అయితే  నాకు యేసు వద్దు’ అని చెప్పియుండెను.  ఒక వారము రోజులు తర్వాత  మరల ఆ సర్పపు ఆత్మ, అనేక దురాత్మలతో అతని యందు ప్రవేశించి అతనిని పట్టిపీడించెను.

పాత నిబంధనయందు సౌలు పాపము చేసినప్పుడు, ప్రభువు యొక్క ఆత్మ అతని ఎడబాసి పోయెను. అభిషేకము అతనిని విడిచి పోయెను. అప్పుడు,    “యెహోవా యొద్దనుండి దురాత్మయొకటి వచ్చి అతని వెరపింప జేయుచు ఉండెను”    (1.సమూ. 16:14). దేవుని బిడ్డలారా మీ యొక్క అంతరంగమును శూన్యముగా ఉంచక క్రీస్తుని మహిమచేతను, పరిశుద్ధాత్ముని యొక్క ప్రసన్నతచేతను నింపబడి ఉంచుడి.

నేటి ధ్యానమునకై: 📖”దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో, వారందరు దేవుని కుమారులై యుందురు”     (రోమీ. 8:14).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.