Appam, Appam - Telugu

అక్టోబర్ 23 – పరలోకపు జ్ఞానము!

“జ్ఞానమును (సంపాదించినవాడు) కనుగొన్నవాడు ధన్యుడు, వివేచనను సంపాదించిన  నరుడు ధన్యుడు”    (సామెతలు 3: 13

ప్రభువు యొక్క బిడ్డలు ఎల్లప్పుడును పరలోకము నుండి వచ్చున్న జ్ఞానము చేత నింపబడియుండవలెను. ప్రభువు మనకు తన జ్ఞానము యొక్క ఐశ్వర్యమును బయలుపరచుటకు ఎల్లప్పుడును సిద్ధముగానే ఉన్నాడు. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది:   “జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధిని సంపాదించుకొనుము నా నోటిమాటలను మరువకుము; వాటినుండి తొలగిపోకుము”    (సామెతలు 4: 5)

“యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి (మూలము) ప్రారంభము”   ( సామెతలు 1:7).     “మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల, అతడు అందరికిని ధారాళముగ దయచేయుచున్న….. దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును”    (యాకోబు 1: 5).   ” దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయెను”    (1. కోరింథీ.  1:31).

లోకముయొక్క జ్ఞానము అనుట వేరు, పరలోకము నుండి వచ్చుచున్న జ్ఞానము అనుట వేరు. లోకము యొక్క జ్ఞానము ఈలోక అంశములనే దృష్టించును. ఈ లోకజ్ఞాని తన యొక్క జ్ఞానమునందు నమ్మికను ఉంచి ప్రభువును తృణీకరించుచున్నాడు. నేడు అత్యధికముగా విద్యావంతులు ప్రభువు లేడు అని, నాస్తికత్వమును వెంబడించుచున్నారు. కోతినుండి పుట్టిన వాడే మనుష్యుడు అని వాదించుచున్నారు. లోకజ్ఞానము ప్రభువు ఎదుట వెర్రితనముగా ఉన్నది.

అయితే.  ” పైనుండి వచ్చుచున్న జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణయైనను లేనిదియునైయున్నది”   (యాకోబు 3:17). లోక జ్ఞానులను సిగ్గుపరిచునట్లుగా ప్రభువు వెర్రివారిని ఏర్పరచుకొని వారిని పరలోకము నుండి వచ్చుచున్న జ్ఞానము చేత నింపుచున్నాడు. ఈ లోకము యొక్క జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేయలేదా? (1. కోరింథీ. 1:20)

దైవ జ్ఞానమును పొందుకొనుటకు బైబిలు గ్రంధమును మరలా మరలా చదువుచుండవలెను. తన యొక్క అనంత జ్ఞానము చేత ప్రపంచములను సృష్టించి, కాచి, నడిపించువచ్చుచున్న ప్రభువు ప్రేమతో అనుగ్రహించిన దైవిక జ్ఞానము కదా బైబిలు గ్రంధము? లేఖన గ్రంథమును ప్రేమించి చదువుచున్నవారు జ్ఞానము లేనివారై ఉండినను, జ్ఞానమును పొందుకొందురు, వివేకమునందు  వర్ధిల్లుదురు. ప్రభువు యొక్క బిడ్డలకు ఎవరును ఎదిరించి నిలబడలేని వాక్కును శక్తిని దయచేయును కదా.

నెబుక్ద్నేజరు ఒక కలను కనినప్పుడు, మనస్సునందు కలతచెందెను. బబులోనుదేశము నందుగల ఏ జ్ఞానియైనను కల యొక్క భావము చెప్పలేక పోయెను. అయితే జ్ఞానమును ప్రేమించిన దానియేలునకు ప్రభువు ప్రేమతో ఆ సంగతిని బయలుపరిచి ఇచ్చెను.

దానియేలు దేవుని స్తోత్రించి,   “మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకనుగ్రహించి యున్నావు; మేమడిగిన యీ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసియున్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు ఘనపరచుచున్నాను; ఏలయనగా రాజుయొక్క సంగతి నీవే మాకు తెలియజేసితివని”  దానియేలు  చెప్పెను”   (దానియేలు 2: 23). దానియేలు వలన మాత్రమే రాజు యొక్క కలను, దాని యొక్క అర్థమును తెలియజేయ గలిగెను. దేవుని బిడ్డలారా, అట్టి దేవుడు పక్షపాతము గలవాడు కాదు. మీకును అట్టి జ్ఞానమును దయచేయును.

నేటి ధ్యానమునకై: “చీకటికంటె వెలుగు ఎంత ప్రయోజనకరమో; బుద్ధిహీనతకంటె జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలిసికొంటిని”   (ప్రసంగి 2: 13).*

Leave A Comment

Your Comment
All comments are held for moderation.