No products in the cart.
సెప్టెంబర్ 22 – మూడు విరాళములు
“నీ రక్షణ కేడెమును నీవు నాకందించుచున్నావు; నీ కుడిచెయ్యి నన్ను ఆదుకొనెను; నీ (సాత్వికము) ధయ నన్ను గొప్పచేసెను” (కీర్తనలు. 18:35).
ఈ వచనమునందు “నీ” అను మాట మూడుసార్లు చోటుచేసుకుని ఉండుటను చూచుచున్నాము. ప్రభువు మనకు ఇచ్చుచున్న అమోఘమైన మూడు ఈవులను ఈ వచనము తెలియపరుచుచున్నది. 1. ప్రభువు యొక్క కేడము, 2. ప్రభువు యొక్క కుడి చెయ్యి, 3. ప్రభువు యొక్క ధయ అనేటువంటివే అట్టి మూడు ఈవులు.
- ప్రభువు యొక్క కేడము:- “ఆయనను ఆశ్రయించువారికి ఆయన కేడెము” (సామెతలు. 30:5). కేడెము ఒక యుద్ధ యోధునికి మంచి కాపుదలను ఇచ్చుచున్నది. మనము కూడా యుద్ధ యోధులముగా లోకము, శరీరము, సాతాను అనువాటికి విరోధముగా యుద్ధము చేయవలెను. “ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాథులతోను, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోను మనము పోరాడుచున్నాము” (ఎఫెసీ. 6:12). కావున మనము కేడమును పట్టుకొని ఉండవలసినది అవశ్యమైయున్నది.
సాతాను మీపై అగ్ని బాణములను వేయిచున్నప్పుడు, దుష్ఠలైన మనుష్యులు చిల్లంగి తనములను పంపుచున్నప్పుడు ప్రభువు మనలను కాపాడుచున్న కేడముగాను, రక్షించున్న కేడముగాను ఉన్నాడు. అంత మాత్రమే కాదు, విశ్వాసము కూడాను ఒక కీడమైయున్నది. “ఇవన్నియుగాక విశ్వాసమను డాలును పట్టుకున్నవారై నిలిచియుండుడి” అని అపో. పౌలు వ్రాయుచున్నాడు. (ఎఫేసి. 6:16).
క్రీస్తు మీకు కేడమైనవాడు. మనపై రావలసిన ఉగ్రతను యేసు తనపై మోసుకొనెను. మీకు తిన్నగా వచ్చుచున్న బాణములన్నిటిని ఆయనే అడ్డగించి నిలిపివేయుచున్నాడు. “వేటకాని ఉరిలోనుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండ నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును; ఆయన సత్యము, కేడెమును డాలునైయున్నది” (కీర్తనలు. 91:3,4).
- ప్రభువు యొక్క కుడిచెయ్యి:- అది చాచిన బాహు; హెచ్చింపబడిన హస్తము. మోషే చెప్పెను: “శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలము; నిత్యముగనుండు ఆయన బాహువులు నీకు (క్రిందనుండును) ఆధారములు” (ద్వితీ. 33:27).
మోషే మరణించు దినము వచ్చినప్పుడు ఇశ్రాయేలు జనులను ఆయన ప్రభువు యొక్క బలమైన హస్తమునకు అప్పగించెను. దేవుని యొక్క హస్తములు కృషించిపోని బలమైన హస్తములు. మీ పాదములకు రాయి తగలకుండా కాపాడు హస్తములు (లూకా. 4:11). ముదిమి వచ్చువరకు మిమ్ములను ఎత్తికొను బలమైన హస్తములు. (యెషయా. 46:4).
- ప్రభువు యొక్క ధయ:- నీ యొక్క ధయ నన్ను గొప్పవానిగా చేయును అని దావీదు రాజు సంతోషముతో చెప్పెను. గొర్రెలను కాయుచున్న దావీదును ఇశ్రాయేలీయులకు రాజుగా హెచ్చించి అభిషేకము చేసినది ప్రభువు యొక్క ధయయే. ఎట్టి మనుష్యుడనైనను హెచ్చించుటకును గొప్ప చేయుటకును ప్రభువు వలన అగును.
దేవుని బిడ్డలారా, ప్రభువు యొక్క ధయను ఆశ్రయించుడి. అట్టి ధయ నిశ్చయముగానే మిమ్ములను హెచ్చించి గొప్ప చేయును.
నేటి ధ్యానమునకై: “ఆయన ధయ ఎంత గొప్పది? ఆయన సొగసు ఎంత గొప్పది? ధాన్యముచేత యౌవనులును, క్రొత్త ద్రాక్షారసముచేత యౌవన స్త్రీలును వృద్ధి నొందుదురు” (జెకర్యా. 9:17).