No products in the cart.
సెప్టెంబర్ 19 – పేరుపెట్టి పిలుపు!
“అయితే యాకోబూ, నిన్ను సృజించినవాడగు యెహోవా; ఇశ్రాయేలూ, నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు; భయపడకుము, నేను నిన్ను విమోచించియున్నాను; పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను, నీవు నా సొత్తు” (యెషయా. 43:1)
ప్రభువు మనకు తల్లియు, తండ్రియునైయున్నాడు. ఒక తల్లి ఓదార్చునట్లు ఆయన మనలను ఓదార్చుచున్నాడు. తండ్రి తన బిడ్డలను కనికరించినట్లు కనికరించును. ఆయన మనలను ‘యాకోబు’ అనియు, ‘ఇశ్రాయేలు’ అనియు పేరు పెట్టి ప్రేమతో పిలుచున్నప్పుడు, మన యొక్క అంతరంగ మంతయును ఆనందించి ఉలసించుచున్నది.
తల్లిదండ్రులు పిల్లలకు ఎట్టి పేరును పెట్టినను, అత్యధికమైన ఆప్యాయతచేత అదనముగా మరొక్క ముద్దు పేరును పెట్టి పిలుచుచుందురు. చుట్టూత వెయ్యి మంది ఉండినను, ముద్దు పేరును పెట్టి పిలుచుచున్న తల్లిదండ్రులు లెక్క స్వరమును వినుచున్నప్పుడు పిల్లల యొక్క మనస్సు ఆనందించి ఉలసించును. మన యొక్క అన్ని పేర్లతో, ప్రభువు పెట్టిన నామము మనకు కలదు. “నా సేవకుడైన యాకోబు నిమిత్తమును, నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు నిమిత్తమును, నేను నీకు పేరుపెట్టి నిన్ను పిలిచితిని, నీవు నన్ను ఎరుగకుండినప్పటికిని నీకు బిరుదులిచ్చితిని” (యెషయా. 45:4).
బైబులు గ్రంథమునందు ఐదుగురి యొక్క పేర్లను రెండుసార్లు ప్రభువు పిలుచుటను చూచుచున్నాము. అందులో ఒకటి అబ్రహాము, “యెహోవా దూత పరలోకమునుండి; అబ్రాహామా, అబ్రాహామా అని అతని పిలిచెను; అందుకతడు, చిత్తము ప్రభువా అనెను” (ఆది. 22:11). అబ్రహాము మూలపితరులలో ఒకడు, అబ్రహామునకు పూర్వము హేబేలు, హానోకు, నోవా అని విస్తారమైన పరిశుద్ధులు ఉండినప్పటికీని, వారు; ‘పితరులు’ అని విలువబడలేదు. అబ్రహామునందే అటువంటి అభిషేకము ఇవ్వబడెను.
పరలోకమునందు తండ్రియైన దేవుడు మన కొరకు తన ఏకైక కుమారుని కల్వరియందు త్యాగ భలిగా ఇచ్చుటకు సంకల్పించెను. పరలోకపు తండ్రి యొక్క హృదయము ఎంతగా వేదనపడెను అను సంగతిని తెలుసుకొనునట్లు భూమియందు గల తండ్రిని, ‘అబ్రహామా, అబ్రహామా అని పిలిచెను. “నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును; తీసికొని మోరీయా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతని నర్పించుము” అని చెప్పెను. అబ్రహామునకు హృదయమునందు వేదన ఉండినను, దానిని అధిగమించేటువంటి విశ్వాసము ఉండెను. అలాగునె నేను నా కుమారుని బలి అర్పించినా కూడా, మృతులలో నుండి సజీవముగా లేపును, నా దేవుడు శక్తి గలవాడు అను సంగతిని ఆయన విశ్వసించెను.
అందుచేతనే, తన పని వారితో, “నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్లి, (దేవునికి) మ్రొక్కి మరల మీయొద్దకు వచ్చెదమని చెప్పెను” (ఆది. 22:5). అబ్రహాము, ఇస్సాకును బలి అర్పించుటకు దేవుడు అనుమతించలేదు. కావున అబ్రహాము తన కుమారుని మృతులలో నుండి సజీవముగా తిరిగి పొందుకొనునట్లు పొందుకొనెను.
దేవుని బిడ్డలారా, ప్రభువు కొరకు దేనిని మీరు సమర్పించుకొనిను, దానిని ఆయన వెయ్యిరెట్లు అత్యధికముగా ఆశీర్వదించి మీకు మరలా దయచేయును. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “తన సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక, మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మన కెందుకు అనుగ్రహింపడు?” (రోమీ. 8:32).
నేటి ధ్యానమునకై: 📖”అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా” (1. పేతురు. 1:19)..