No products in the cart.
మే 11 – పాపమునకు మరణించుటచేత జయము!
“ఓ మరణమా! నీ ముల్లెక్కడ ? ఓ పాతాళమా! నీ విజయమెక్కడ ? మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక” (1. కోరింథీ. 15:55,57).
యేసు పునరుత్థానుడాయెను. మరణమును, పాతాళమును, సాతానును జయించినవాడై విజయ గంభీరముతో పున్నుతానుడాయెను. ఆయన యొక్క పిల్లలమైయున్న మనము విజయమును స్వతంత్రించుకొని, మరణము యొక్క వెన్నెముకను తట్టి “మరణమా! నీ ముల్లెక్కడ? పాతాళమా! మీ విజయమెక్కడా? అని విజయ సునాధమును చేయుచున్నాము.
“యేసు క్రీస్తు మరణించి, సమాధి చేయబడి, తిరిగి సజీవముగా లేచెను” అనుట చరిత్ర. దానిని ఎవరును దాచుటగాని, అడ్డు చెప్పుట గాని కుదరదు. అయితే దానిని చారిత్రాత్మక సంఘటనగానే కలిగియున్నట్లయితే, మనకు ఎట్టి ప్రయోజనము కలుగుట లేదు. భయ భక్తితో శిలువ యొద్దకు వచ్చి నిలవబడి, “నా కొరకే నీవు మరణించితివి, నా కొరకే సమాధి చేయబడితివి, నా కొరికే సజీవముగా తిరిగి లేచితివి” అని చెప్పి మనసారా అంగీకరించినప్పుడు మాత్రమే మీకు రక్షణ కలుగును.
మరొక్క మెట్టు కలదు. అదియే మిమ్ములను విజయవంతమైన జీవితమునకు త్రోవ నడిపించును. అది ఏమిటి? “క్రీస్తుతో నేను సిలువ వేయబడితిని; క్రీస్తుతో సమాధి చేయబడితిని; క్రీస్తు యొక్క పునర్థానపు శక్తి చేత విజయవంతమైన జీవితమును జీవించెదను” అని ఒప్పుకోలు చేసి, ఆ విజయమును స్వతంత్రించు కొనుటైయున్నది.
అపో. పౌలు మొదటిగా, “క్రీస్తుతో కూడా శిలువ వేయబడితిని” అని సమర్పించుకొనెను. రెండోవదిగా, “క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని యిచ్ఛలతోను దురాశలతోను సిలువవేసియున్నారు” అని చెప్పెను (గలతి. 5:24). మూడోవదిగా, “క్రీస్తువలన లోకము నాకు సిలువవేయబడియున్నది. నేనును లోకమునకు సిలువవేయబడియున్నాను” (గలతి. 6:14) అని చెప్పెను. ఇదియే విజయము యొక్క రహస్యమైయున్నది.
ఎట్టి పరిస్థితియందును పాపపు శోధనలు గెలువలేదు అని దృఢ నిశ్చయముతో జీవించుటయె, క్రీస్తుతో కూడా సిలువ వేయబడితిని అని ఒప్పుకోలు చేసి క్రీస్తుని విజయమును స్వతంత్రించు కొనుటైయున్నది.
“క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమవలన క్రీస్తు మృతులలో నుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును నూతనజీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై క్రీస్తుతోకూడ పాతిపెట్టబడితివిు. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యముగలవారమైన యెడల, ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యముగలవారమై యుందుము” (రోమీ. 6:3-5).
దేవుని బిడ్డలారా, క్రీస్తు యొక్క శ్రమలు, మరణము, పునర్థానమును విశ్వసించి దాని తర్వాత బాప్తీస్మమును పొందుకొని యున్నట్లయితే, ఎల్లప్పుడును ఆ సంగతి ఒప్పుకోలు చేసి విజయవంతమైన జీవితమును జీవించుడి. “చనిపోయినవాడు పాపవిముక్తుడని తీర్పుపొందియున్నాడు” (రోమీ 6:7).
నేటి ధ్యానమునకై: “మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యముగలవారమైన యెడల, ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యముగలవారమై యుందుము” (రోమీ. 6:5).
