No products in the cart.
మే 10 – జయము మీకు!
“మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము” (రోమీ. 8:37).
ఓటమి అను పదము మన యొక్క అంతరంగమునకు దుఃఖమును తీసుకొని వచ్చి నీరసిల్ల చేయుచున్నది. అయితే విజయము అను పదము ఆనందించి ఉలసించి దేవుని స్తుతించునట్లుగా చేయుచున్నది. ప్రభువు మనకు అరా కొర జయమును వాగ్దానము చేయక పరిపూర్ణమైన జయమును వాగ్దానము చేసియున్నాడు. మనము మనలను ప్రేమించినవాని ద్వారా అత్యధిక విజయమును పొందుచున్నవారముగా ఉన్నాము.
మన యొక్క ప్రభువైనయున్న యేసుక్రీస్తు ఎన్నడును ఓటమిని పొందినవాడు కాదు. ఆయన ఇశ్రాయేలీయుల యొక్క జయ సునాధమైనవాడు. ‘సైన్యముల కదిపతియగు యెహోవా’ అనుట ఆయన యొక్క నామము. ఆయన సాతాను యొక్క తలను చితక గోట్టి అతనిపై జయమును పొందినవాడు. ఆయన మాటలన్నియును విజయభేరియైయ్యున్నది. ఆయన జయించి తండ్రి యొక్క సింహాసనమును స్వతంత్రించుకొనెను (ప్రకటన. 3:21).
గ్రామాలలో ఆటలాడుచున్న కబడ్డీ అయినను సరే, పట్టణాలలో ఆటలాడుచున్న క్రికెట్ అయినను సరే, విజయమును పొందుటయే ప్రజలు కోరుచున్నారు. మన యొక్క భారతీయ జట్టు పాకిస్థానుతో క్రికెట్ ఆడుచున్నప్పుడు, ప్రజలు వీధులలో నిలబడి దూరదర్శనీలలో ప్రత్యక్ష ప్రసారమును చూచుటను గమనించియున్నాను. భారతీయ జట్టు జయమును పొందవలెను అనుటలో వారికి అంతటి ఆసక్తి!
అదేవిధముగా, ప్రభువు కూడాను పరలోకములో నుండి మన యొక్క జీవితమును గమనించుచూనే ఉన్నాడు. లోకము, శరీరము, సాతాను మనకు విరోధముగా పోరాడుచున్నప్పుడు, మనము జయమును పొందుచున్నామా లేక శోధనలలో పడిపోయి ఓటమినిపొంది, సోమ్మసిల్లి పోవుచున్నామా అను సంగతిని గమనించి చూచుచున్నాడు. ఆయన జయించినవాడై ఉన్నట్లుగా, మీరును జయమును పొందువారై ఉండవలెను అనుటయే ఆయన కాంక్షించుచున్నాడు.
అందుచేత ప్రకటన గ్రంథమునందు గల ఏడు సంఘములును జయమును పొందునట్టుగా ఆలోచనను ఇచ్చి ఉత్సాహపరచుచున్నాడు. అక్కడ తొమ్మిది సార్లు జయించువాడు ఎవడో’ అను మాటలు మరలా మరలా వచ్చుచున్నది. బైబిలు గ్రంథము యొక్క చివరిలో “జయించువాడు సమస్తమును స్వతంత్రించుకొనును; నేనతనికి దేవుడనైయుందును, అతడు నాకు కుమారుడైయుండును” (ప్రకటన. 21:7) అని చెప్పెను.
పరలోకము, జయము పొందిన పరిశుద్ధులచే నింపబడియుండును. పాపపు ఉచ్చులలో చిక్కుకొని, శోధనలో పడిపోయి ఓటమితో నిలబడుచున్న ప్రతి ఒక్కరు పరలోకమును స్వతంత్రించుకొనలేరు.
దేవుని బిడ్డలారా, గత కాలపు జీవితమునందు పలు అంశములలో మీరు ఓటమి పొందినప్పటికీని, ప్రభువు యొక్క నామము చేత మరల లేచి నిలబడుడి. గొర్రెపిల్ల యొక్క రక్తము చేతను, మీరు ఇచ్చుచున్న సాక్ష్యము వలనను సాతానును జయించుడి. ప్రతిష్ట గల జీవితమును, ఆత్మీయ తీర్మానములును, ఆసక్తితో కూడిన ప్రార్థనయు మిమ్ములను నిశ్చయముగానే విజయపు బాటలో త్రోవ నడిపించును.
నేటి ధ్యానమునకై: “మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక” (1. కోరింథీ. 15:57).
