No products in the cart.
మార్చి 28 – ప్రేమ అమర్యాదగా నడువదు!
“ప్రేమ …. అమర్యాదగా నడువదు” (1. కొరింథీ. 13:5).
ప్రేమ, తనను ప్రేమించువారిని దుఃఖపరచి ఎన్నడును అమర్యాదగా నడువదు. తనను ప్రేమించు వారిని ప్రేమించి వారిని ఆనందింపజేయు పనులను చేయును. తద్వారా నిజమైన ప్రేమ ఏది అనియు, నకిలీ ప్రేమ ఏది అనియు కనుగొనవచ్చును.
ఆనాడు ఆదామును అవ్వను ప్రభువు యొక్క అమితమైన ప్రేమను గ్రహించి ఉన్నట్లయితే ఆయనను దుఃఖ పరచి, ఆయన ఆజ్ఞను అతిక్రమించి నిషేధించబడిన పండును భుజించి ఉండరు. ప్రేమ వారికి లోపించుట చేత వారు పాపములో జారి పడునట్లు చేసెను. ఆనాడు ఆకాను ప్రభువును తన యొక్క దళపతియైన యెహోషువాను నిజముగా ప్రేమించి ఉండినట్లయితే, అమర్యాదగా షీనారు యొక్క పైవస్త్రమును దొంగిలించి ఉండడు. ఆనాడు ఇస్కారుయోతు యూదా తన కొరకు భూమికి దిగివచ్చిన ప్రభువును లోతుగా ప్రేమించి ఉన్నట్లయితే, అమర్యాదగా క్రీస్తును ముప్పై వెండి నాణెములకు అమ్మివేసి ఉండేవాడు కాదు. ప్రేమ యొక్క లోపము చేతనే వీరు పడిపోవుటకు గల కారణము. ఈనాడు పలు విశ్వాసులు లంచము తీసుకొనుటకు కూడా అదే కారణము. మీరు మీ యొక్క పనులన్నిటిని దేవుని ప్రేమ యొక్క వెలుగునందు సరితూచి చూచి సరి చేసుకొనుడి.
భార్యపై నిజమైన ప్రేమను కలిగియున్నవాడు పరాయి స్త్రీని తలెత్తి కూడాను చూడనే చూడడు. పిల్లలపై నిజమైన ప్రేమను కలిగియున్నవాడు పిల్లల యొక్క చదువు కొరకును, భవిష్యత్కాలము కొరకు గల ధనమును తీసి వ్యర్ధముగా ఖర్చు పెట్టడు. ప్రభువుపై నిజమైన ప్రేమను ఉంచియున్నవాడు ఆయనను దుఃఖపరిచి లోకము యొక్క ఉల్లాసములను ప్రేమించుటకు వెళ్ళడు. ప్రేమ అమర్యాదగా నడుచుకొనదు.
ప్రభువు యొక్క కన్నులు ఎఫెసు సంఘము యొక్క క్రియలను చూచెను. ప్రయాసమును మెచ్చుకొనెను. సహనమును కొనియాడెను. అయినప్పటికిని, ఎఫెసు సంఘమునందుగల ఒక లోపము ప్రభువు యొక్క అంతరంగమును వేదన పరిచెను. “మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీమీద తప్పు ఒకటి మోపవలసియున్నది” అని ఆయన చెప్పెను. ఇది ఎంతటి దౌర్భాగ్యమైన ఒక పరిస్థితి!
నేడు అనేకులు భక్తియందు వైరాగ్యము గలవారిగా ఉండినప్పటికిని, ఉపదేశ వైరాగ్యమునందు కన్నులు ఎర్రబడినవారై ఉన్నారు. సత్యమును సత్యముగా బోధించక పోయినట్లయితే, వారిని శిక్షించక మానను అని చెప్పుచున్నారు. వారి యొక్క పని అంతా అపోస్తులు కాని వారు, తమ్మును అపోస్తులులు అని చెప్పుచున్న వారి సంగతిని పరిశోధించి అబద్ధికులని కనుగొనుటయే.
ఇట్టి వైరాగ్యము గల వారినే ప్రభువు దుఃఖముతో చూచి: “మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి” అని కన్నీటితో చెప్పుచున్నాడు. మునుపు అనేకులకు దేవుని సముఖము మధురముగా ఉండెను. అయితే ఇప్పుడు ఇతరుల వద్ద ఉన్న లోపములను కనుగొనుటయే మధురముగా ఉన్నది. మునుపు లేఖన గ్రంథము మనస్సునకు బహు సంతోషముగా ఉండెను. ఇప్పుడైతే విమర్శనా పత్రము వ్రాసి ఇతరులను నొప్పించుట మనస్సునకు సంతోషముగా ఉన్నది.
దేవుని బిడ్డలారా, పూర్వమందు ప్రభువు కొరకు శ్రమల అనుభవించి సేవ చేయుటకు త్యాగముగల తలంపు ఎక్కడ? కల్వరి ప్రేమ ఎక్కడ?
నేటి ధ్యానమునకై: “నీవు ఏ స్థితిలోనుండి పడితివో అది జ్ఞాపకము చేసికొని, మారు మనస్సుపొంది, ఆ మొదటి క్రియలను చేయుము” (ప్రకటన. 2:5).
