No products in the cart.
మార్చి 26 – డంబముగా ప్రవర్తింపదు
“ప్రేమ డంబముగా ప్రవర్తింపదు” (1. కొరింథీ. 13:4).
ప్రేమ తనకు తానుగా డంబముగా ప్రవర్తింపదు, ప్రచారమును అన్వేషింపదు. ప్రేమ గలవారు పేరు ప్రఖ్యాతులను ఎదురు చూడక తెరచాటున మరుగైయుండి మేలు చేయుచునే ఉందురు.
నాటుకోడి అనునది ఒక గుడ్డును పెట్టినట్లయితే చాలును, కొక్కొరొక్కో అని ఖేరుచు శబ్దము పెట్టుము. అరగంటసేపు గొప్ప ఆర్భాటమును చేసి పెట్టును. అయితే బాతును చూడుడి. కోడి కంటే పెద్ద గుడ్డును పెట్టినా కూడాను, అతిశయింపక మౌనముగా ఉండును. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు గాని, తన్ను తానే మెచ్చుకొనువాడు యోగ్యుడుకాడు” (2. కోరింథీ. 10:17,18).
ప్రేమగల యేసు వైపు తేరి చూడుడి. ఆయన మేలు చేయుచుండు వాడై సంచరించెను. కుష్ఠు రోగులను స్వస్థపరిచెను. మృతులను సజీవముగా లేపెను. పలు సమయములయందు మేలు పొందిన వారి చూచి ఆ సంగతిని ఎవరితోను చెప్పకుడి అని తెలియజేసెను. జనులు ఆయనను రాజుగా చేయగోరినప్పుడు, ఆయన వారి మధ్యలో నుండి మరుగైపోయెను. డంబమును కోరుకొనని ప్రేమగల ప్రియుడు.
తన్ను తాను డంబముగా ప్రవర్తింపని ప్రేమ క్రీస్తు యొక్క ప్రేమ. అట్టి ప్రేమయే ఆయనను పరలోకమును విడచి భూమికి తీసుకొని వచ్చెను. క్రీస్తు యొక్క ప్రేమ పాపముతోను, ద్రోహముతోను నిండియున్న ప్రజల మధ్యకు ఆయనను తీసుకొని వచ్చెను. క్రీస్తు యొక్క ప్రేమ, ఆయనను దాసుని యొక్క రూపము దాల్చునట్లుగా చేసెను. అట్టి ప్రేమ పాపులమైయున్న మనలను విమోచించుట చేత మనము నశించిపోవుచున్న ఆత్మలను విమోచించుటకు ఎట్టి త్యాగమునైనను చేయుటకు సిద్ధముగా ఉండవలెను.
జాన్స్మిత్ అను సేవకుడు ఎన్నడును పేరు ప్రఖ్యాతులను ఎదురు చూడలేదు. ఒకసారి ఆయన తన గుండెల పై కొట్టుకొనుచు: “స్పష్టమైన త్రోవను ప్రభువు నాకు అనుగ్రహించెను. నశించి పోవుచున్న ఆత్మల యొక్క విలువను చూచుట చేత నా హృదయము నలిగిపోవుచున్నది. ఆత్మలను రక్షింపకపోయినట్లయితే, నేను ప్రాణాలతో జీవించుట ప్రయోజనము లేదు. అవును ప్రభువా, ఆత్మలను దయచేయుము లేనిచో నేను మరణించెదను” అని విలపించి ఏడ్చేనట.
తిరిగి రానటువంటి అగ్నిగుండమునకు తిన్నగా ఎట్టి గ్రహింపు లేకుండా ఉల్లాసముగా వెళ్ళుచున్న ఆత్మల యొక్క పరిస్థితిని చూచుచున్న కన్నులును, వారి తట్టున ఆప్యాయతతో అక్కర కలిగి నడుచుచున్న పాదములును ప్రభువు మనకు అనుగ్రహించును గాక. ప్రభువు తానే దేవుని ప్రేమ చేత మన తలంపులను, ఆలోచనలను, క్రియలను అన్నిటిని నింపును గాక. కల్వరి ప్రేమను ఎత్తి పట్టి చూపించి ఆత్మల సంపాదయమును చేయు కృపలను అనుగ్రహించును గాక.
క్రీస్తు ప్రేమను నిజముగా రుచి చూచిన వారి యొక్క హృదయములలో నశించి పోవుచున్న ఆత్మలను గూర్చిన భారమును, చింతయును ఎల్లప్పుడును ఒక రకమైన బరువైన భారము పిండి వేయుచు ఉండును. అక్కడ డంబమునకు తావులేదు. దేవుని బిడ్డలారా, క్రీస్తు యొక్క ప్రేమ మిమ్ములను బలవంతము చేసి పూరిగోల్పును గాక.
నేటి ధ్యానమునకై: “మేము మమ్మునుగూర్చి ప్రకటించు కొనుటలేదు గాని, క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు, మమ్మును గూర్చి, యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము” (2. కోరింథీ. 4:6).
